Jump to content

T360 Survey


narens

Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply

తెలుగు360 సర్వే : ప.గో జిల్లాలో వైసీపీకీ ఈ సారీ షాకే..! By Telugu360 -April 2, 2019 జిల్లాల వారీగా తెలుగు360 పకడ్బందీగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి .. విశ్లేషించి ఇస్తున్న సర్వేల్లో భాగంగా.. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఫలితాలను చూద్దాం…!. 2014 ఎన్నికల్లో జిల్లా నుంచి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 15 అసెంబ్లీ స్థానాలుంటే.. ఒకటి బీజేపీ, 14 టీడీపీ గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా.. అక్కడ టీడీపీనే హవా కొనసాగిస్తోంది. అధికార వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై జనాగ్రహం లాంటివి కనిపిస్తున్నా.. వైసీపీ మాత్రం పుంజకోలేదు. ఇక్కడ ఆ పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ కొంత ప్రధానంగా జనసేన వైపు వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సంప్రదాయంగా.. అండగా ఉండే సామాజికవర్గాలు.. ఈ జిల్లాలో పెద్దగా లేకపోవడం.. ఉన్న వర్గాలు జనసేన వైపు చీలిపోవడంతో… వైసీపీ ఇక్కడ ఈ సారి కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని సర్వేలో తేలింది. నియోజకవర్గాల వారీగా.. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..! ప.గో జిల్లాలో.. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చిన ఒకే ఒక్క సీటు తాడేపల్లిగూడెం. అప్పటి వరకూ.. బీజేపీకి ఉనికి పెద్దగా లేదు. అయినప్పటికీ.. టీడీపీ మద్దతుతో విజయం సాధించగలిగారు. ఈ సారి బీజేపీ ఉనికి లేదు. మాణిక్యాలరావు కూడా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ప్రధాన పోటీ టీడీపీకి అభ్యర్థి ఈలి నాని, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోరాటం నెలకొంది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు.. కుల సమీకరణాల కారణంగా అవకాశం దక్కించుకోలేకపోవడంతో.. అసంతృప్తికి గురయ్యారు. కానీ.. ఈలి నాని విజయానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నా… అభ్యర్థులకు మద్దతిచ్చే సామాజికవర్గాల్లో చీలక కనిపిస్తోంది. ఫలితంగా.. టీడీపీ అభ్యర్థి ఈలి నాని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పుప్పాల శ్రీనివాసు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉండటంతో టిక్కెట్ కేటాయించారు. జనసేన నుంచి నవుడు వెంకటరమణ పోటీకి సై అంటున్నారు. సంక్షేమ పథకాలు… ప్రతీ కుటుంబానికి అందేలా గన్ని వీరాంజనేయలు.. ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైసీపీకి మద్దతుగా ఉండే కొన్ని సామాజికవర్గాలు.. ఈ సారి జనసేనకు మద్దతు పలుకుతున్నయి. దీంతో ఓట్ల చీలిక అనివార్యం అయింది. గన్ని వీరాంజనేయులు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తణుకులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. ఆయనకు ముస్లిం వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గత ఎన్నికల్లో 35వేలకుపైగా మెజార్టీ సాధించారు. ఉన్నత విద్యావంతుడు.. అందర్నీ కలుపుకుని వెళ్లడం, సంప్రదాయంగా.. టీడీపీకి మద్దతిచ్చే వర్గాలు ఎక్కువగా ఉండటంతో.. రాధాకృష్ణ ప్రత్యర్థుల కంటే చాలా ముందు ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా పసుపులేటి రామారావు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి ఎవరి ఓట్లు ఎక్కువ చీలుస్తారో వారు నష్టపోతారు. అయితే ఈ ప్రమాదం… వైసీపీ అభ్యర్థికే ఎక్కువగా ఉంది. పోలవరం నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి తో బొరగం శ్రీనివాసరావుకి టిక్కెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. తెల్లం బాలరాజు వైసీపీ టికెట్‌పై పోటీలో ఉన్నారు. గతంతో పోల్చితే వైసీపీ ఈ నియోజకవర్గంలో పుంజుకుంది. కాపులు, గిరిజనుల ఓట్లు ఎక్కువగా ఉండటం వలన రెండు సామాజికవర్గాలపైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో… త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఒక్క రోజులోనే టిక్కెట్ దక్కించుకున్న డాక్టర్ బాబ్జి బరిలోకి దిగారు. చివరి వరకూ.. వైసీపీ ఇన్చార్జిగా ఉండి.. టిక్కెట్ ఇక ఆయనకే అని చెప్పుకున్న గుణ్ణం నాగబాబుకు.. జగన్ హ్యాండివ్వడంతో.. ఆయన జనసేనలో చేరి… ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు సానుభూతి కనిపిస్తోంది. నిమ్మల రామానాయుడు.. కొన్ని వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో పొందలేకపోయారని భావిస్తున్నారు. ఇక్కడ ముక్కోణపు పోటీలో గుణ్ణం నాగబాబుపై సానుభూతి పవనాలు, పవన్ క్రేజ్‌తో.. జనసేనకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీడీపీకి కంచుకోట లాంటి నిడదవోలు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పోటీ చేస్తున్నారు. టిక్కెట్ కోసం చాలా మంది ప్రయత్నించినప్పటికీ.. శేషారావు వైపే హైకమాండ్ నిలిచింది. అయితే అందరూ సర్దుకుని ఆయన విజయానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ తరపున జి. శ్రీనివాస్‌ నాయుడుకు టికెట్ ఖరారయింది. నియోజకవర్గంలో కాపు కులస్తులపై ఈయనకు పట్టు ఉంది. ఇదే తనకు అనుకూలాంశంగా మారుతుందని ఆయన ఆశిస్తున్నారు. జనసేన అభ్యర్తిగా అటికల రమ్యశ్రీ పోటీలో ఉన్నారు. ఈమె చీల్చుకునే ఓట్లు ప్రధానంగా వైసీపీ అభ్యర్థి ఆశిస్తున్నవే కావడంతో… టీడీపీ అభ్యర్థి విజయం సునాయాసం కానుంది. నరసాపురం టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకే అవకాశం కల్పించారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు టికెట్ ఖరారయింది. టీడీపీ టిక్కెట్ ఆశించిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. రాకపోవడంతో.. మళ్లీ వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడే పోటీ చేశారు. ఓడిపోయారు. ఈ సారి ఆయన వైసీపీకి మద్దతిస్తున్నారు. ఇక్కడ జనసేన తరపున బొమ్మిడి నాయకర్ పోటీలో ఉన్నారు. పవన్ క్రేజ్‌ను బట్టి.. ఆయన చీల్చుకునే ఓట్లను బట్టి… అభ్యర్థుల జాతకాలు ఆధారపడి ఉన్నాయి. పోటీ హోరాహోరీగా ఉన్న టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయి. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేసినప్పటికీ ఒక బలమైన సామాజికవర్గం పరిపాలన కొనసాగిస్తోంది. ఓ సారి ఎమ్మెల్యే అయిన ఎవర్నీ రెండో సారి కొనసాగించడానికి ఇష్టపడరు. ఈ సారి కూడా జవహర్‌ను మార్చే వరకూ ఆందోళనలు చేశారు. చివరికి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కొవ్వూరు టికెట్‌ను కేటాయించారు. సంప్రదాయకంగా .. టీడీపీకి బలమైన స్థానం కావడంతో.. అక్కడ విజయం సునాయాసం కానుంది. గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 11వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు మళ్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసి ముప్పిడి వెంకటేశ్వరరావుపై ఓటమిపాలయ్యారు. ఈసారి జనం తనను ఆదరిస్తారని తలారి నమ్ముతున్నారు. అందరికీ అందుబాటులో ఉండటం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరడంతో టీడీపీ అభ్యర్థి ఎక్కువ ధీమాగా ఉన్నారు. ఏలూరులో బిగ్ ఫైట్ జరగుతోంది. టీడీపీ నుంచి బడేటి కోట రామారావు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే పోరు ఉంది. జనసేన అభ్యర్థి చీల్చే ఓట్లతో.. టీడీపీకి నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీంతో.. వైసీపీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున కొఠారు అబ్బయ్యచౌదరి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇద్దరిదీ పెదవేగి మండలమే. పవన్ కల్యాణ్ చింతమనేనిని ఓడించాలనే లక్ష్యంతో జనసేన అభ్యర్థిగా ఘంటసాల వెంకట లక్ష్మిి ని బరిలోకి దించారు. మాస్ లీడర్ గా పేరున్న చింతమనేని… వివాదాస్పద వ్యవహారశైలిపై బయట ఎంత నెగెటివ్ ప్రచారం జరిగినా..ఆయన ప్రజలకు మేలు చేస్తాడని అక్కడి జనం నమ్ముతున్నారు. ఈ సారి కూడా చింతమనేని వైపే ప్రజల మొగ్గు ఉంది. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీతల సుజాతకు ఈ సారి టికెట్‌ను టీడీపీ కేటాయించలేదు. ఆమెకు బదులుగా కర్రా రాజారావును టీడీపీ బరిలోకి దించింది. వైసీపీ అభ్యర్థిగా వీఆర్ ఎలీషా, ఇక జనసేన తరపున మేకల ఈశ్వరయ్య బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థిని మార్చడంతో… టీడీపీకి కలసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆచంట నియోజకవర్గంలో…మంత్రి పితాని సత్యనారాణ.. బలంగా ఉన్నారు. ఆయన అయితేనే గెలుస్తారన్న ఉద్దేశంతో.. ఆయనకు కుటుంబానికి రెండు టిక్కెట్లు ఆఫర్ చేసి..వైసీపీలో చేర్చుకోవాలని జగన్ ప్రయత్నించారు. మైండ్ గేమ్ ఆడారు. కానీ సాధ్యం కాలేదు. చెరుకువాడ శ్రీరంగనాథ రాజును వైసీపీ బరిలోకి దించింది. జనసేన తరపున జవ్వాది వెంకట జయరామ్ పోటీ చేస్తున్నారు. మంత్రిగా పితాని.. వ్యతిరేకత పెంచుకోలేదు. అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును పార్లమెంట్ బరిలో నిలిపిన చంద్రబాబు… రామరాజుని అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గంపై పట్టు ఉన్న శివరామరాజు…రామరాజుకి పూర్తి మద్ధతు ఇవ్వడం ప్లస్ కానుంది. ఉండి నియోజకవర్గం లో ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. అభ్యర్థిని మార్చడం.. మరింతగా ప్లస్ అయింది. వైసీపీ అభ్యర్థి నరసింహరాజు నియోజకవర్గంలోని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన చీల్చే ఓట్లు ఎవరివి అన్నవే ఫలితాలపై ప్రభావం చూపనుంది. టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ కూడా హోరా హోరీ తలపడుతున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీకి మద్దతుగా ఉండే వర్గాలు జనసేనకు అండగా నిలుస్తున్నాయి. దీంతో.. పవన్ కల్యాణ్‌ భీమవరం నుంచి గెలుపు దిశగా ఉన్నారని చెప్పుకోవచ్చు. Area Party కొవ్వూరు (ఎస్సీ) టీడీపీ నిడదవోలు టీడీపీ ఆచంట టీడీపీ పాలకొల్లు జనసేన నర్సాపురం టీడీపీ భీమవరం జనసేన ఉండి టీడీపీ తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం టీడీపీ ఉంగుటూరు టీడీపీ దెందులూరు టీడీపీ ఏలూరు వైసీపీ గోపాలపురం (ఎస్సీ) టీడీపీ పోలవరం (ఎస్టీ) వైసీపీ చింతలపూడి (ఎస్సీ) టీడీపీ

Read more at telugu360.com: తెలుగు360 సర్వే : ప.గో జిల్లాలో వైసీపీకీ ఈ సారీ షాకే..! - https://www.telugu360.com/te/telugu360-survey-west-godavari-2019/

Link to comment
Share on other sites

తెలుగు360 సర్వే : కంచుకోటలో టీడీపీ పరిస్థితి మెరుగురుపడిందా..? జనసేన దెబ్బ ఎవరికి..? By Telugu360 -April 1, 2019 జిల్లాల వారీగా తెలుగు 360 అందిస్తున్న సర్వేల్లో భాగంగా ఈ రోజు… తూర్పుగోదావరి జిల్లాల ఫలితాలను చూద్దాం…!. ఎలాంటి పక్షపాతం లేకుండా… అభిప్రాయసేకరణ జరిపి.. అందిస్తున్న ఫలితాలు ఇవి. సర్వేల ద్వారానో… ఓపీనియన్ పోల్స్ ద్వారానో.. ఓటర్లు ప్రభావితం అవుతారని… తెలుగు 360 భావించడం లేదు. అందుకే.. ఫలితాలను నిర్భయంగా ప్రకటిస్తున్నాం. వివిధ పార్టీల అభిమానులు, కార్యాకర్తలకలకు , నేతలకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అన్నింటినీ మేం గౌరవిస్తాం..! తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే.. వారికే అధికారం. 19 శాసనసభ నియోజకవర్గాలు … ఈ జిల్లాలో ఉన్నాయి. 2014లో తెలుగుదేశం 12 చోట్ల ఘన విజయం సాధించింది. బీజేపీకి ఇచ్చిన ఓ స్థానంలో ఆ పార్టీని గెలిపించింది. వైసీపీ ఐదు స్థానాలతో సరి పెట్టుకుంది. ఈ ఐదుగురిలో ముగ్గురు టీడీపీ గూటికి చేరారు. ఆవిర్భావం నుంచీ తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. ఈ సారి టీడీపీ, వైసీపీ, జనసేన.. జిల్లాలో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. పింఛన్లు, సీసీ రోడ్లు, పేదలకు ఇళ్లు, నూరు శాతం ఎల్‌ఈడీ లైట్ల, తాగునీటి పంపిణీ, యువతకు ఉపాధి, పూర్తయిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కాపు సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ టీడీపీకి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. పాదయాత్రతో ఆదరణ పెరిగిందని.. వైసీపీ అనుకుంటోంది. సామాజికవర్గ బలంతో.. జనసేన కూడా.. దైర్యంగానే ఉంది. ఇప్పుడు సీట్లలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో చూద్దాం.. ! రాజమండ్రి అర్బన్‌ సీటులో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఎర్రన్నాయుడు కుమార్తె. రామ్మోహన్ నాయుడు సోదరి. కుటుంబానికి రాజమండ్రిలో మంచి రాజకీయ పలుకుబడి ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఇవ్వడంతో… పోటీ చేసే అవకాశం టీడీపీ నేతలకు దక్కలేదు. వైసీపీ తరపు నుంచి రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేస్తున్నారు. ఉండవల్లికి అత్యంత ఆప్తుడయిన ఆయన ..గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేన పార్టీ తరపున అత్తి సత్యనారాయణను నిలబెట్టారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి ఉన్న పట్టు.,. టీడీపీ క్యాడర్ స్థిరంగా ఉండటం.. కార్పొరేషన్ పరిధిలో.. అత్యధికం టీడీపీ చేతిలోనే ఉండటంతో.. మొగ్గు .. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ వైపే ఉంది. రాజమండ్రి రూరల్ నియోజవకర్గంలో సీనియర్ నేత.. గోరంట్ల బుచ్చయ్యచౌదరికి.. ధీటైన ప్రత్యర్థి లేరు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల వీర్రాజు, జనసేన తరపున మాజీ కాంగ్రెస్ నేత కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. కడియం మండంలపై… గోరంట్ల పూర్తి స్థాయి పట్టు సాధించడంతో.. ఆయన విజయంపై ఢోకా లేదు. తునిలో టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోకూడా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా ఆరుసార్లు గెలిచిన యనమల తర్వాత నియోజకవర్గంపై పట్టుకోల్పోయారు. జనసేన తరపున బరిలోకి దిగిన… మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ సారి ముగ్గురి మధ్య చాలా భీకరమైన పోటీ జరగబోతోంది కానీ… ఫలితం మాత్రం..జనసేన అభ్యర్థికి అనుకూలంగా రావడానికే ఎక్కువ అవకాశం ఉంది. పత్తిపాడులో టీడీపీ తరపున వరుపుల రాజా పోటీ చేస్తున్నారు. అయితే.. టీడీపీలో ఎప్పుడూ ఉండే పర్వత కుటుంబం ఈ సారి వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తోంది. డీసీసీబీ చైర్మన్‌గా వరుపుల రాజా దూకుడుగా ఉండటంతో పాటు.. క్యాడర్ సపోర్ట్ ఉండటంతో.. ఆయనకే మెరురైన అవకాశం కనిపిస్తోంది. రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున బొంతు రాజేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరు.. పార్టీల బలం… అండగా ఉన్న వర్గాలను.. అంచనా వేసుకుంటే.. గొల్లపల్లి సూర్యారావు ముందంజలో ఉన్నారు. అక్కడ టీడీపీకి ఫలితం అనుకూలంగా రానుంది. గన్నవరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ఎమ్మెల్యే ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తికి చాన్సివ్వలేదు. దళిత నేత నేలపూడి స్టాలిన్‌ టికెట్‌ ఇచ్చారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు, పాముల రాజేశ్వరి ఇద్దరూ టిక్కెట్ ఆశించారు. చివరికి చిట్టిబాబు వైసీపీ తరపున, రాజేశ్వరి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అమలాపురం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మళ్లీ పోటీ చేస్తున్నారు. చివరి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారు కాకపోయినా.. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ వర్గం పట్టుబట్టి టిక్కెట్ ఇప్పించుకుంది. వైసీపీ తరపున మాజీ మంత్రి పినిపె విశ్వరూప్, జనసేన తరపున శెట్టిబత్తుల చిట్టిబాబు పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ తరపున పోరాటం ఉండనుంది. టీడీపీకి నియోజకవర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు ఉండటంతో.. ఈ సారి ఐతాబత్తున ఆనందరావే మరోసారి గెలవనున్నారు. అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డికే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. అరవై శాతం రెడ్డి సామాజికవర్గ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో టీడీపీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ సారి ఇది వైసీపీ ఖాతాలోనే పడనుంది. ఇక్కడ జనసేన అభ్యర్థి నామమాత్రమే. కాకినాడ సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జనసేన నేత.. ముత్తా శశిధర్ మధ్య హోరాహీరో పోరు సాగనుంది. మత్య్సకార వర్గానికి చెందిన కొండబాబు.. ఈ నియోజకవర్గంలో.. ముందుండే అవకాశం ఉంది. రెడ్డి సామాజికవర్గం తక్కువ ఉండటం.. వైసీపీ ఓటు బ్యాంక్‌ను.. ముత్తా శశిధర్ చీల్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జనసేన తరపున పంతం నానాజీ పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ వర్గపోరుతో.. దెబ్బతిననుదంని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు.. ఆధిక్యత చూపించనున్నారు. పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అన్యాయం జరిగిందనే భావనతో నియోజకవర్గ ప్రజలంతా.. అండగా నిలిచారు. దాదాపుగా యాభై వేల మెజార్టీ వచ్చింది. ఈ సారి టీడీపీలో ఆయనకు పోటీ లేదు. వైసీపీ తరపున పెండెం దొరబాబు, జనసేన తరపున మాకినీడి శేషుకుమారి పోటీ చేస్తున్నారు. వర్మకు కాపుల మద్దతు ఉంది. ఆయన నియోజకవర్గంలో పట్టు సాధించారు. వైసీపీ, జనసేన మధ్య ఓట్లు చీలిపోయి… వర్మ మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయి. పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి చివరి క్షణంలో.. తోట నరసింహం భార్యను రంగంలోకి దింపారు. దీంతో..అప్పటి వరకూ.. పార్టీని నమ్ముకున్న ఇన్‌చార్జి తోట సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. జగ్గంపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబుకు పోటీ ఇస్తున్నారు. జనసేన నుంచి అభ్యర్థి ఉన్నా.. జ్యోతుల కుటుంబీకుల మధ్యే పోటీ జరగనుంది. జ్యోతుల నెహ్రూ.. ఇతర వర్గాల మద్దతు కూడా పొందారు. దాంతో ఆయనకే ఈ సారి కూడా విజయావకాశాలు ఉన్నాయి. ముమ్మిడివరంలో టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపై గట్టి నమ్మకంతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిపై చివరి వరకు గందరగోళం ఉంది. చివరికి పొన్నాడ సతీశ్‌ అనే మాజీ ఎమ్మెల్యేను తీసుకొచ్చారు. దీంతో.. అప్పటి వరకూ అక్కడ ఖర్చు పెట్టుకున్న పితాని బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకుని.. జనసేనలో చేరారు. అక్కడ.. వర్గాల మధ్య ఓట్ల చీలికతో.. వైసీపీకే మెరుగైన ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. మండపేటలో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తిరిగి పోటీ చేస్తున్నారు. వైసీపీ ఇన్చార్జ్ గా ఉన్న వేగుళ్ల లీలా కృష్ణ కు జగన్ హ్యాండివ్వడంతో.. ఆయన జనసేనలో చేరి పోటీ చేస్తున్నారు. చివరికి .. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు… టిక్కెట్ ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీనే సునాయాసంగా విజయం సాధించే పరిస్థితి ఉంది. రామచంద్రాపురంలో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులే పోటీ చేస్తున్నారు. ఆయనపై చాలా కాలం పాటు పోరాడిన.. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చారు. జనసేన తరపున పోలిశెట్టి చంద్రశేఖర్ రేసులో ఉన్నా… ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే ముందంజలో ఉంది. రాజమండ్రి సిటీని అనుకుని ఉండే రాజానగరంలో టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజాబరిలో ఉన్నారు. జనసేన నుంచి బరిలో ఉన్న రాయపురెడ్డి ప్రసాద్ వైసీపీ ఓట్లు చీల్చే అకాశాలున్నాయి. దీంతో.. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ మరోసారి విజయబావుటా ఎగురవేయనున్నారు. రంపచోడవరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజేశ్వరికి టీడీపీ టికెట్‌ లభించింది. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మిని నిలబెట్టారు. ఇక్కడ అభ్యర్థుల కన్నా పార్టీలే కీలకం. వైసీపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్తపేటలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున బండారు సోదరుడే రంగంలో ఉన్నారు. గతంలో బండారు సత్యానందరావు పీఆర్పీ తరపున విజయం సాధించారు. దీంతో.. ఈ సారి బండారు శ్రీనివాసరావుకే విజయావకాశాలు ఉన్నట్లు అంచనా వేయవచ్చు. Area Party తుని జనసేన పత్తిపాడు టీడీపీ పిఠాపురం టీడీపీ కాకినాడ గ్రామీణ వైసీపీ పెద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ టీడీపీ రామచంద్రాపురం టీడీపీ ముమ్మిడివరం వైసీపీ అమలాపురం టీడీపీ రాజోలు (ఎస్సీ) టీడీపీ గన్నవరం (ఎస్సీ) వైసీపీ కొత్తపేట జనసేన మండపేట టీడీపీ రాజానగరం టీడీపీ రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి గ్రామీణ టీడీపీ జగ్గంపేట టీడీపీ రంపచోడవరం వైసీపీ

Read more at telugu360.com: తెలుగు360 సర్వే : కంచుకోటలో టీడీపీ పరిస్థితి మెరుగురుపడిందా..? జనసేన దెబ్బ ఎవరికి..? - https://www.telugu360.com/te/telugu360-survey-east-godavari-districts/

Link to comment
Share on other sites

14 minutes ago, narens said:

కృష్ణా జిల్లాలో టీడీపీకే అడ్వాంటేజ్...! వైసీపీ, జనసేనకు మెరుగైన ఫలితాలు..!

@JaiTDP - 9

Janasena 2 aa..... Enti aa seats...Edo PRP 2 gelichina Ani JSP ki 2 Ani vesinatlu vunnadu....

TDP -11

YCP-5

JSP-0

Avanigadda okati TDP sitting poyelavundi....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...