Jump to content

Funny Election in North Korea


Recommended Posts

బ్యాలెట్‌ పత్రంలో ఒకే పేరు!

బ్యాలెట్‌ పత్రంలో ఒకే పేరు!

త్తరకొరియాలో దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెప్పేదే శాసనం.  అక్కడ ప్రతి అయిదేళ్లకోసారి ఠంఛనుగా జరిగే ఎన్నికల్లో దాదాపు నూరుశాతం ఓటింగ్‌ నమోదవుతుంది.  ‘సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ’ పేరిట ఏకసభ విధానం ఉంది. 687 స్థానాలున్నాయి. ప్రతి అయిదేళ్లకోసారి బ్యాలెట్‌ విధానంలో ప్రతినిధులను ఎన్నుకుంటారు. బ్యాలెట్‌ పత్రంలో ఒకే అభ్యర్థి పేరు ఉంటుంది. ప్రజలందరూ అతనికే ఓటు వేయాలి. అభ్యర్థి తమకు నచ్చలేదని ఎన్నిక బహిష్కరించినా.. మరేదైనా కారణంతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నా ఇబ్బందుల్లో పడినట్లే. ఓటేయకపోవడాన్ని దేశద్రోహంగా పరిగణించి అత్యంత కఠిన శిక్షలు విధిస్తారు. అందుకే ప్రజలెవ్వరూ ఓటింగ్‌కు దూరమవ్వరు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...