Jump to content

మహిళల ఓట్లన్నీ చంద్రబాబుకేనా?


Recommended Posts

మహిళల ఓట్లన్నీ చంద్రబాబుకేనా?
27-03-2019 20:39:17
 
636893161394821073.jpg
మహిళలను మించిన మీడియం మరొకటి లేదని చెబుతారు. ఏదైనా అంశంపై మహిళలు చేసినంతగా ప్రచారం మరెవరూ చేయలేరని అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి నెలకొంది. మహిళలు చంద్రబాబుకు నీరాజనాలు పలుకుతున్నారు. మహిళా సంక్షేమానికి చేపడుతున్న పథకాలు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్షలకు కారణమేంటి?
 
 
ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. 'మళ్లీ మీరే రావాలి' అంటూ పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు.. అక్కాచెల్లెళ్లే తన బలమని చెప్పుకుంటున్నారు. తనను గెలిపించే బాధ్యత వాళ్లే తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రచారం హోరెత్తుతోంది. ఊరూరా జనాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి. అయితే.. జనం మాత్రం ఎటువైపు మొగ్గుచూపాలో స్పష్టంగా డిసైడయ్యారు. ఎవరు మాటలకే పరిమితమవుతారు ? ఎవరు చేతల్లో చూపిస్తున్నారు ? అన్న విషయంలో ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్లముందు కనిపిస్తున్న ప్రగతి, సంక్షేమం ముందు.. బయటినుంచి వచ్చి ఎవరు ఏం చెప్పినా వృథా ప్రయాసే అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
 
 
ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల్లో మహిళా సెంటిమెంట్‌ దూసుకుపోతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతోంది మహిళాలోకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనే ప్రతి సభకూ మహిళలు వెల్లువలా వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు ముగ్ధులవుతున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తాము పొందిన లబ్దిని గుర్తు చేసుకుంటున్నారు.
 
 
తమకు తాము నెమరు వేసుకోవడమే కాదు.. బాహాటంగా సభలో చెబుతున్నారు. మహిళలు, ప్రధానంగా వృద్ధులు చంద్రబాబు సభావేదికపైకి ఎక్కి 'మళ్లీ మీరే రావాలి' అంటూ ఆశీర్వదిస్తున్నారు. తమ ప్రత్యక్ష అనుభవాలను జనం ముందుకు తీసుకువస్తున్నారు.
 
 
ఇది.. స్వయంగా ఓ వృద్ధురాలు చెప్పిన పరిస్థితి. చంద్రబాబు ఇస్తున్న పెన్షన్‌తోనే బతుకుతున్నానని, బాబు వస్తున్నారని తెలిసి.. మళ్లీ ఆయనే రావాలంటూ పార్టీ నేతలతో కలిసి కొబ్బరికాయ కూడా కొట్టానని చెప్పుకొచ్చింది. ఇది ఏ ఒక్కరో చెబుతున్న విషయం కాదు.. ఏ జిల్లాకు వెళ్లినా.. ఏ ఊళ్లో సభ నిర్వహించినా.. ఇలాంటి కథలు వినిపిస్తున్నాయి. ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకుంటానంటూ తమలాంటి పెద్దవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భరోసా మాటలకే పరిమితం కాదని, కళ్లముందు సాక్షాత్కరిస్తోందని ఆనందంగా చెబుతున్నారు.
 
 
వాస్తవానికి మహిళా సెంటిమెంట్‌ను మించినది ఏదీ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా సెంటిమెంట్‌ అడుగడుగునా హారతులు పడుతోంది. మహిళలు ఉవ్వెత్తున భావోద్వేగానికి గురవుతున్నారు. డ్వాక్రా, పసుపు కకుంకుమ, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు ఇలా.. ప్రభుత్వ సంక్షేమ పథకాల జడిలో తడిసిముద్దవుతున్నారు. చంద్రబాబుకు జై కొడుతున్నారు.
 
 
మహిళలు తలచుకుంటే ఏదైనా హిట్‌ అవుతుంది. సాధారణంగా మహిళలకు రీచ్ అయితే, వాళ్ల ఆదరణ చూరగొంటే ఏదైనా సూపర్‌ హిట్‌ అవుతుంది. అది క్యాంపెయిన్‌ అయినా, స్లోగన్‌ అయినా.. ఏదైనా వ్యాపార ప్రకటన అయినా, మరేదైనా పథకమైనా మహిళల మనసులకు ఒక్కసారి కనెక్ట్‌ అయితే దానికి తిరుగు ఉండదు. అనుకున్నదానికంటే అంతకుమించి సక్సెస్‌ అవుతుంది.
 
 
అంశం ఏదైనా మహిళలను మించిన మీడియం మరొకటి లేదంటారు. ఆ స్థాయిలో దానికి ప్రచారం లభిస్తుంది. మామూలుగా ఏదైనా అంశాన్ని పురుషులకు చెబితే... వాళ్లు ఫ్రెండ్స్‌కో, ఒకరిద్దరికి చెబుతారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతారు.
 
సందర్భం వస్తేగానీ మళ్లీ దాని గురించి మాట్లాడరు. అదే యూత్‌కు ఏదైనా విషయం చెబితే.. మహా అయితే.. మరో పదిమదికి షేర్‌ చేస్తారు. వాళ్లకు కనెక్టివిటీ ఉన్న అంశమైనా అక్కడితో ఫుల్‌స్టాప్‌ పడుతుంది. కానీ.. మహిళలంటే అలా కాదు.. ప్రతి చోటా అదే విషయాన్ని చెబుతారు. సందర్భం కల్పించుకొని మరీ ఆ అంశానికి ప్రాచుర్యం తెస్తారు. వీలైనంత ఎక్కువమందికి తెలియజెప్పడమే కాదు.. వాళ్ల అభిప్రాయాలను కూడా మార్చగలిగే శక్తి మహిళలకు ఉంటుంది. ఒక్కసారి మహిళలు అభిమానిస్తే.. రియాక్షన్‌ మామూలుగా ఉండదు. ఈ పాజిటివ్‌ రియాక్షన్‌ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
 
 
ఇప్పుడు ఏపీలో ఓ ట్రెండ్‌ నడుస్తోంది. నవ్యాంధ్ర పురోగతి మరింత పరుగులు పెట్టాలంటే చంద్రబాబే రావాలన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. 'మళ్లీ నువ్వే రావాలి' అన్న క్యాంపెయిన్‌ కంటిన్యూ అవుతోంది. ఈ క్యాంపెయిన్‌ ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే.. ఆ క్యాంపెయిన్‌ వెనుక చంద్రబాబును ఉద్దేశించి ఓ పెద్దమ్మ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించిన ఆంధ్రజ్యోతి కథనం ఉంది. తెలుగుదేశం ప్రచార వ్యూహకర్తల్లో ఆ కథనం తీసుకొచ్చిన ఆలోచన ఉంది.
 
 
'మళ్లీ నువ్వేరావాలి' ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన నినాదం. ఎన్నికల ప్రచారపర్వంలో అధికార పార్టీ క్యాంపెయిన్‌ ఇది. సరిగ్గా ఎనిమిది నెలల క్రితమే ఈ క్యాంపెయిన్‌ రూపుదిద్దుకుంది. సరిగ్గా గతేడాది ఆగస్టు 23వ తేదీన చంద్రబాబు నాయుడు పార్టీ ప్రచార కమిటీకి, పార్టీ శ్రేణులకు ఈ క్యాంపెయిన్‌పై దిశానిర్దేశం చేశారు. ప్రజల్లోకి ఈ కాన్సెప్ట్‌ బాగా వెళ్లిందని, ఇకనుంచి ఈ నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అప్పటినుంచి టీడీపీ ప్రచార కమిటీ, సోషల్ మీడియా వింగ్‌ ఈ క్యాంపెయిన్‌ను సీరియస్‌గా మొదలెట్టారు.
 
 
అయితే.. చంద్రబాబు ఈ ఆదేశాలు జారీచేయడానికి సరిగ్గా 23 రోజుల ముందు.. అంటే.. 2018 జూలై 31వ తేదీనే మొట్టమొదటి సారి ఈ మాట వినిపించింది. ఓ వృద్ధ మహిళ నోటివెంట స్వయంగా చంద్రబాబు సమక్షంలోనే ''మళ్లీ నువ్వే రావాలి'' అన్న మాట వచ్చింది. ఆ వార్తను రిపోర్ట్‌ చేసిన ఆంధ్రజ్యోతి.. మారుమూల గ్రామానికి చెందిన ఆ ముసలమ్మ నోటినుంచి వచ్చిన మాటను యధాతథంగా ప్రముఖంగా ప్రచురించింది. తొలిపేజీలో ఈ వార్తకు చోటు కల్పించింది.
 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ.. గ్రామదర్శిని కార్యక్రమాలను విస్తృతంగా పర్యవేక్షించిన సమయం అది. ఈ క్రమంలోనే.. విశాఖ జిల్లా ఎస్‌రాయవరం మండలం గుడివాడలో ఏర్పాటుచేసిన సభకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సభలో తాను ప్రసంగించడమే కాకుండా.. పలు సంక్షేమ పథకాల లబ్దిదారులతో, రైతులతో ముఖాముఖి ముచ్చటించారు. ఆ సందర్భంలోనే.. వేదికకు అల్లంత దూరంలో నిల్చున్న గున్నమ్మ అనే 80యేళ్ల వృద్ధురాలిని చంద్రబాబు పలకరించారు. తనకు దగ్గరగా రావాలని పిలిచారు. ఆ ముసలమ్మ భుజంపై చేయివేసి.. ఆత్మీయుడిలా మాట్లాడారు. 'ఏం పెద్దమ్మా! నీ సమస్య ఏమిటి ?' అని అడిగారు.
 
దీంతో.. తనకు ఏమీ వద్దని గున్నమ్మ బదులిచ్చింది. 'నాకేమీ వద్దు బాబూ.. నీ పరిపాలన బాగుంది. నువ్వు చల్లగా ఉండాలి. నువ్వే మళ్లీ గెలవాలి.' అంటూ ఆప్యాయంగా చంద్రబాబుకు ఆశీస్సులు అందించింది. ఆమెతో పాటు.. ఆ సభలో పాల్గొన్న మరికొంతమంది వృద్ధులు, మహిళలు చంద్రబాబు అందిస్తున్న సంక్షేమ పథకాలు తమకు అన్నం పెడుతున్నాయని చెప్పుకొచ్చారు. గున్నమ్మకు , చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణను ఆంధ్రజ్యోతి యధాతథంగా ప్రచురించింది. 'మళ్లీ నువ్వే రావాలి' అనే నినాదానికి నాంది పలికింది.
 
 
అలా.. ఆ నినాదానికి ఆంధ్రజ్యోతి మొదటగా ప్రాచుర్యం కల్పించింది. తర్వాత ఆ నినాదానికి అనూహ్య రీతిలో ఆదరణ లభించింది. చంద్రబాబు నాయుడే మళ్లీ రావాలి అన్న వాదన రాష్ట్రమంతటా మొదలైంది. ఈ పరిస్థితులను గమనించిన సీఎం చంద్రబాబు.. ఆగస్టు 23వ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పేరిట క్యాంపెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అప్పటినుంచి ఆ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇప్పుడు ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రచార సభల క్యాంపెయిన్‌కు ఈ నినాదాన్నే వినియోగించుకుంటున్నారు.
 
 
ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ప్రచార సభల్లో మహిళల గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఏ ఆసరాలేని వాళ్లకు తాను పెద్దకొడుకుగా ఆదుకుంటానని భరోసా ఇస్తున్నారు. తాను చేపట్టిన పథకాలతో కోటిమంది అక్కాచెల్లెళ్లు తనవెంట ఉన్నారని ధీమాగా చెబుతున్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని అంటున్నారు. ప్రతి సభలోనూ తప్పకుండా ఈ అంశం లేవనెత్తుతున్నారు. కొన్ని సభల్లో అయితే ఇదే అంశంతో ప్రసంగం మొదలు పెడుతున్నారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లందరూ తనవెంటే ఉన్నారని తనను వాళ్లే గెలిపిస్తారని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
 
 
ఎందుకంటే.. తాను మహిళలకోసం ఏమేం చేశారో బహిరంగ వేదికలపై ప్రకటిస్తున్నారు. దేశంలో ఎక్కడా అక్కా చెల్లెళ్లకు, మహిళలకు, ఈస్థాయిలో సంక్షేమ పథకాలు ఎవరూ ప్రవేశ పెట్టలేదని చెబుతున్నారు. వాస్తవం కూడా ఇదే అన్నది మహిళలకూ అవగతమవుతోంది. దీంతో.. చంద్రబాబు ప్రసంగాలకు మహిళల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఆ రియాక్షన్‌ చూసి మరింత ఉత్సాహంగా తన ప్రసంగాలు సాగిస్తున్నారు చంద్రబాబు. మహిళలు ఒక్కసారి డిసైడ్‌ అయితే.. అభిప్రాయం మార్చుకోరని అంటున్నారు.
 
 
తన పథకాలు మహిళలకు ఎలా ఉపయోగపడుతున్నాయో మహిళల చేతనే చెప్పిస్తున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసేవాళ్లకు బుద్ధిచెప్పే బాధ్యతను మహిళలకే అప్పగిస్తున్నానంటూ వాళ్లపైనే బాధ్యత మోపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ఎన్నికల్లో మహిళల పాత్రే కీలకంగా కనిపిస్తోంది. ప్రచారఘట్టంలో ఆ ఆనవాళ్లు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
 
సీఎం చంద్రబాబుపై మహిళల్లో అభిప్రాయం ఎలా ఉందంటే...
 
ఆంధ్రప్రదేశ్‌లోని అక్కాచెల్లెళ్లందరూ తన వెంటే ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారు. తాను చేస్తున్న సంక్షేమ పథకాలే అండగా నిలుస్తాయంటున్నారు. మరి.. మహిళల్లో అభిప్రాయం ఎలా ఉంది ? చంద్రబాబు అంటే నిజంగానే వాళ్లకు అభిమానం ఉందా ? ఓటు టీడీపీ వైపే పడబోతోందా ?
 
 
ఒకప్పుడు వంటింటికీ, ఇంటిపనులకే పరిమితమైన మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనే ఆడపడచులకు మొట్టమొదటగా ప్రాధాన్యత ఇచ్చి.. వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అప్పటి చరిత్ర తిరగేస్తే ఆ విషయం బోధపడుతుందంటున్నారు జనం. డ్వాక్రా గ్రూపులను ప్రారంభించి.. గ్రాంట్‌లు మంజూరు చేసి మహిళలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేశారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబన కలిగించారు. ఆ ప్రభావం, ఆదరణ ఇప్పుడు ఏపీ మహిళా ఓటర్లలో కనిపిస్తోంది.
 
 
ఒకప్పుడు చంద్రబాబు అంటే.. డ్వాక్రా మహిళలే గుర్తొచ్చేవాళ్లు. ఆయనంటే అభిమానించేవాళ్లు. అయితే.. ఇప్పుడు అంతకుమించిన అభిమానం వెల్లువెత్తుతోంది. అందుకే మహిళలు, అక్కాచెల్లెళ్లు తనవెంటే ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా వీటిని ప్రతిబింబిస్తున్నాయి.
 
 
చంద్రబాబు ఇచ్చిన భరోసా వల్లే తమకు భవిష్యత్తుపై నమ్మకం కలుగుతోందంటున్నారు పింఛన్లద్వారా లబ్ది పొందుతున్న మహిళలు. ఇక.. వృద్ధులైతే చంద్రబాబునే తమ పెద్దకొడుకులా భావిస్తున్నామని అంటున్నారు. బాబే మళ్లీ రావాలని, ఆయన వస్తేనే ఈ పథకాలు కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నారు.
 
 
మహిళల నుంచి వస్తున్న ఆదరణను గమనిస్తున్న చంద్రబాబు వాళ్లమీద నమ్మకాన్ని మరింత పెంచుకుంటున్నారు. అంతేకాదు.. కొంతమంది పురుషులు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని, వాళ్లను కూడా టీడీపీకి ఓటేసేలా చూడాల్సిన బాధ్యత అక్కాచెల్లెళ్లే తీసుకోవాలని కోరుతున్నారు.
 
 
మొత్తానికి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలకు మహిళలు పోటెత్తుతున్నారు. చంద్రబాబు ప్రచార స్ట్రాటజీ కూడా మహిళల చుట్టూరా తిరుగుతోంది. ఆడపడుచుల అండతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు.
 
 
మహిళా సెంటిమెంట్‌ ప్రభంజనం వెల్లువలా పోటెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేడీస్‌ ఓటు బ్యాంక్‌ టీడీపీదే అన్న అంశం ఖాయమైపోయిందంటున్నారు విశ్లేషకులు. ఓవైపు సంక్షేమ పథకాల ఫలాలు, మరోవైపు లబ్దిదారుల స్పందన దీనికి నిదర్శనమంటున్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, narens said:

Ap24 gaadu endi mana meeda positive ga veathunnadu...manaku always against ha vintay debates anni

 

1 hour ago, baggie said:

 

ground situation ardamai untadi le

 

 

watch the full video, ladies are full happy on CBN, as it is ga gents are little unhappy.

Link to comment
Share on other sites

1 minute ago, ask678 said:

Eam gents ki ATMs or robbery chese chance ivvaledhu ana CBN?

vallaki petthanam ivvaledu ani le, AP lo janalni impress chese kanna brahma devudini impress cheyatam 1000 times easy. mana people sentiment ki longaru ane daniki idi best example.

Link to comment
Share on other sites

5 minutes ago, Bollu said:

vallaki petthanam ivvaledu ani le, AP lo janalni impress chese kanna brahma devudini impress cheyatam 1000 times easy. mana people sentiment ki longaru ane daniki idi best example.

TN public ayithe idhe development progress ki kallu mossukoni blind ga vote vestharu

Link to comment
Share on other sites

CBN ఒక పెద్దావిడతో: ఇంత ఎండలో .. ఇంత దూరం ఎందుకొచ్చావ్?

పెద్దావిడ: నా కొడుకులు ఇబ్బందుల్లో ఉన్నారు.. నువ్వు నన్ను చూసుకున్నావ్.. అట్టాంటిది నువ్వొస్తంటే నేను రాకుండా ఉంటానా కొడకా

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...