Jump to content

jeevan reddy


Recommended Posts

టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ!
26-03-2019 17:05:05
 
636892167060950144.jpg
 
 
హైదరాబాద్: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతిచ్చిన పీఆర్టీయూ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. నర్సిరెడ్డికి 8976 ఓట్లు పోలవగా.. రవీందర్‌కు 6279 ఓట్లు పోలయ్యాయి. పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డికి 1873 ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు రాకముందే పాతూరి సుధాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడ తొలిరౌండ్‌లో పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మరో నేత పార్టీని వీడనున్నారు. మాజీ మంత్రి, మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను మంగళవారం ఆమె కలిశారు.

కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, పార్టీ తీసుకునే నిర్ణయాల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై సునీతా లక్ష్మారెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలన్న యోచనకు వచ్చారు. ఇదే సమయంలో అటు భాజపా, ఇటు తెరాసల నుంచి పిలుపు రావడంతో కొంత ఆయోమయంలో ఉన్నారు. దీనిపై తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. భాజపా నుంచి ఒత్తిడి మరింత పెరగడంతో ఆమె ఇవాళ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కారెక్కాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నర్సాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆమె గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

2 hours ago, subash.c said:

Nizamabad MP  kavitha ki opposite ga farmers nomination vesaru....ground level lo eni probs unna picha lite until there is a proper leader who can question 

Andukenaa akkaai monneppudo Amethi lo veyandi  inni nominations, raybareli lo veyandi antundi

Link to comment
Share on other sites

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపు

Untitled-1a_8.jpg

కరీంనగర్‌: కరీంనగర్‌-ఆదిలాబాద్‌- నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన చంద్రశేఖర్‌పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్‌రెడ్డి విజయంసాధించారు. ఈ స్థానం నుంచి 17 మంది బరిలో నిలువగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. జీవన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. మొత్తం 14 టేబుళ్లపై 9 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. నేతల వలసలతో ఇప్పటికే కూదేలైన కాంగ్రెస్‌కు ఈ విజయం ఎంతో ఊరట నిచ్చింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...