Jump to content

నేడు వైసీపీ కండువా కప్పుకోనున్న మోహన్ బాబు!


Recommended Posts

నేడు వైసీపీ కండువా కప్పుకోనున్న మోహన్ బాబు!
26-03-2019 10:40:13
 
636891936147397306.jpg
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో మోహన్ బాబు లోటస్‌పాండ్‌‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కానున్నారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.
 
గత కొన్ని రోజులుగా తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌‌ విషయమై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. కాగా.. వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
 
 
దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ హయాంలో కీలకనేతగా మోహన్ బాబు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుస్తోంది. వైసీపీతో మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకుంటే రాజ్యసభ సీటిచ్చి ఢిల్లీకి పంపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 
ఇదిలా ఉంటే.. గతంలో కూడా కలెక్షన్‌కింగ్ కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకుంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు మంచు మనోజ్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ప్రజాసేవ చేయాలని హైదరాబాద్‌ను వదిలి తిరుపతికి వెళ్లడంతో అప్పట్లో మోహన్ బాబు కుటుంబం మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని.. అందుకే ప్రజలకు దగ్గరయ్యేందుకు కార్యక్రమాలు చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో తాను రాజకీయాల్లోకి రావట్లేదని మనోజ్ స్పష్టం చేశారు. అయితే తాజాగా వస్తున్న పుకార్లు నిజమవుతాయా..? లేకుంటే పుకార్లుగానే మిగిలిపోతాయా..? అన్నది తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

Kanduva kappuko lekapothe Guddalu ippuko evadiki ekkuva.

Nee mata vini namme neutral voter okkadu undadu, that is the credibility you have. Okka vote koda atu itu marchaleni Legend or celebrity nuvvu

Monna nuvvu chesina dramaki ivala partylo cheradamtho saripoyindi

Link to comment
Share on other sites

7 minutes ago, BalayyaTarak said:

Kanduva kappuko lekapothe Guddalu ippuko evadiki ekkuva.

Nee matavininamme neutral voter okkaduundadu, that is the credibility you have. Okka vote kodaatuitumarchaleni Legend or celebrity nuvvu

Monna nuvvu chesina dramaki ivala partylo cheradamtho saripoyindi

ifMB doesn't join in YSRCP, Jagan will not give a chance for him to request for an MP seat. If MB joins then he can claim of his efforts and request for an MP seat. It is as plain as that.

Link to comment
Share on other sites

బ్రేకింగ్: వైసీపీలో చేరిన మంచు మోహన్ బాబు
26-03-2019 12:58:37
 
636892019183922440.jpg
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం మోహన్ బాబు, మంచు విష్ణు లోటస్‌పాండ్‌కు చేరుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఇటీవల ఫీజు రియింబర్స్‌మెంట్ వివాదంపై స్పందించినట్లు సమాచారం. అనంతరం మంచు మోహన్‌బాబుకు.. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం లోటస్‌పాండ్ నుంచి బయటికొస్తూ వైసీపీ కండువాను చేతిలోని పట్టుకుని వచ్చి మోహన్ బాబు కారెక్కి ఇంటికి పయనమయ్యారు.
 
 
కాగా... మంచు మోహన్‌బాబును రాజ్యసభకు పంపాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్‌కు మంగళవారం మధ్యాహ్నంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఇదిలా ఉంటే.. మోహన్ బాబు కుటుంబానికి.. వైఎస్సార్ ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.
 
Tags : Mohan babu, YSR Congress
Link to comment
Share on other sites

6 hours ago, gnk@vja said:

Manoj genuine anukunna .  Atleast calm ga unna undalsindi

Vadhu inka worst bro recent gha 2 tweets chesadu and delete chesadu Malie but anti fan itey tappa yavaru antha worst gha veyaru tweets leki yadavalu villa family antha Anie prove chesadu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...