Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

spy reddy

Recommended Posts

1 hour ago, TDP_2019 said:

Drop ayyi TDP ki support chesthe Nandyala Assembly, MP kotteyochhu...Peddayana ki Rajyasabha offer chesthe better

problemadhekadha. thanaki emi voddu antha alludiki ivvandi ani.

Share this post


Link to post
Share on other sites
పార్టీ వీడిన ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు ఆఫర్‌

26apcm1a.jpg

నంద్యాల: ఇటీవల తెదేపాను వీడి జనసేనలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సీఎం చంద్రబాబు ఆఫర్‌ ఇచ్చారు. తెదేపా గెలుపునకు సహకరించి నంద్యాల అభివృద్ధిలో భాగస్వామి కావాలన్నారు. అలాగైతే, ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆఫర్‌ చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. నంద్యాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు. 
‘‘నంద్యాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయిస్తాం. నంద్యాల జిల్లా కావాలి. నంద్యాల జిల్లా కావాలంటే కుప్పం కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయను. కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబానికి సీటు ఇవ్వలేకపోయాం. ఆయన కుటుంబానికి నేను అండగా ఉన్నా. ఎన్నికలు అవ్వగానే నంద్యాలను జిల్లా చేస్తా. నంద్యాలను స్మార్ట్‌సిటీగా మారుస్తా. సీడ్‌ క్యాపిటల్‌గా చేస్తా. వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తాం. వ్యవసాయ కళాశాలలో విత్తనాల పరిశోధనపై దృష్టిపెడతాం. డిగ్రీ కళాశాల సైతం ఇస్తా.  బాహ్యవలయ రహదారి నిర్మిస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

కేసీఆర్‌ ఢీ అంటే మేమూ ఢీ అంటాం 
‘‘భాజపా, వైకాపాది విడదీయరాని భార్యాభర్తల సంబంధం. ఇంట్లో కాపురం, బయట నాటకాలు ఆడుతున్నారు. ఎందుకీ ముసుగులు. ధైర్యం ఉంటే  మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి రండి. మా తడాఖా చూపిస్తాం. ముసుగులో గుద్దులాట వద్దు. ఎన్నికల యుద్ధంలో ఇంటికో సైనికుడు రావాలి. రాష్ట్రంలో చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్‌ ఢీ అంటే మేమూ ఢీ అంటాం.  తెలంగాణ కంటే మిన్నగా ఏపీని తయారు చేస్తా. ప్రజల కోసం వీరసైనికుడిగా ముందుకెళ్తున్నా. దుర్మార్గులతో పోరాడుతున్నా. ప్రధాని మోదీ నేరస్థులకు కాపలాదారుడిగా మారారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేయించారు’’ అని అన్నారు.  

నంద్యాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటా..
‘‘గతంలో జరిగిన ఉప ఎన్నికలో నంద్యాల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. నా జీవితంలో నంద్యాలను మరిచిపోలేను. నంద్యాల ప్రజల అభిమానాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా. ఐదేళ్ల పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేనంతమంది చెల్లెళ్లు నాకు ఉన్నారు.  త్వరలోనే మహిళందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందజేస్తా. పింఛన్లు పదిరెట్లు పెంచి రూ.2వేలు చేశాం. దాన్ని రూ.3వేలకు పెంచుతాం. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. చంద్రన్న పెళ్లి కానుక, దుల్హన్‌ పథకాల కింద ఇచ్చే సాయాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Share this post


Link to post
Share on other sites
జనసేనకు ఎస్పీవై రెడ్డి ఝలక్?
27-03-2019 12:32:48
 
636892868746928338.jpg
కర్నూలు: జనసేనకు ఆ పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవైరెడ్డి ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ తరుపున ఆయన కుటుంబం వేసిన నామినేషన్లను ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశంలో ఆయనకు టికెట్ నిరాకరించడంతో జనసేనలో చేరారు. జనసేన అనూహ్యంగా ఎస్వీవైరెడ్డి కుటుంబానికి ఏకంగా మూడు టికెట్లిచ్చింది. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి బరిలోకి దిగగా.. ఆయన చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేస్తున్నారు. అయితే మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్వీవైరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అలాగే టీడీపీ విజయానికి కృషి చేయాలని సీఎం కోరారు. దీంతో ఆయన యూటర్న్ తీసుకోబోతున్నట్లు సమాచారం. జనసేన తరుపున వేసిన మూడు నామినేషన్లు ఎస్వీవైరెడ్డి ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×