Jump to content

Vizag MP - Big Fight


RKumar

Recommended Posts

ఏపీలో బిగ్‌ఫైట్‌ ఇక్కడే

vsp-loksabha-brk1_1.jpg

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం‌: ఏపీలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంటోంది. అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థుల ఓటమే ధ్యేయంగా ఎత్తులు, పైఎత్తులతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ కీలకమైన విశాఖ లోక్‌సభ సీటుపైనే ఉంది. ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ లోక్‌సభ పరిధిలో భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట కూడా ఉంది. ప్రస్తుతం తెదేపా, జనసేన అభ్యర్థులు తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి బరిలో దిగుతున్నారు. వైకాపా, భాజపా నుంచి ఇది వరకే రాజకీయ అనుభవమున్న నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ సహా మరికొన్ని పార్టీలో బరిలోకి దిగుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తెదేపా, వైకాపా, జనసేన, భాజపా మధ్యే ఉండనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా సముద్రతీర నగరంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారనే విషయం ఆసక్తిగా మారింది.

తెదేపా

vsp-loksabha-brk2_1.jpgవిశాఖ లోక్‌సభకు అభ్యర్థి ఎంపిక విషయంలో తెదేపా పెద్ద కసరత్తే చేసింది. మంత్రి గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ తదితర పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ దశలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరిలను పార్టీలో చేర్చుకుని వారికి కేటాయిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే ఆ జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు మతుకుమిల్లి శ్రీభరత్‌వైపే మొగ్గు చూపారు. దీంతో ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగానే అధినేత చంద్రబాబు భరత్‌ను ఎంపిక చేశారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కువమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండటం..క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఉండటం తెదేపాకు కలిసి రావొచ్చు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశముంది. మరోవైపు హుద్‌హుద్‌ తుపాను సమయంలో సీఎం చంద్రబాబు చూపిన చొరవ.. ప్రభుత్వ యంత్రాంగంతో తక్కువ సమయంలోనే నగరాన్ని యథాస్థితికి తీసుకురావడం తదితర విషయాలన్నీ తెదేపాకు సానుకూలంగా మారే వీలుంది.

భాజపా

vsp-loksabha-brk3_1.jpgగత ఎన్నికల్లో తెదేపాతో పొత్తులో భాగంగా భాజపాకు ఈ స్థానాన్ని కేటాయించారు. కంభంపాటి హరిబాబు ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ నేత దగ్గుబాటి పురందేశ్వరిని లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆమె.. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఎంపీగా పనిచేసిన సమయంలో ఉన్న పరిచయాలు తనకు లాభిస్తాయని పురందేశ్వరి ధీమాగా ఉన్నారు. మరోవైపు విశాఖ రైల్వేజోన్‌.. స్మార్ట్‌ సిటీగా ప్రకటించడం తదితర అంశాలు భాజపాకు అనుకూలంగా ఉండనున్నాయి. అంతేకాకుండా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో కేంద్ర సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్‌ నేవీ, స్టీల్‌ప్లాంట్‌తో పాటు మరికొన్ని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా ఉత్తరాదికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాదికి చెందిన ఓట్లు తమకు పడతాయని భాజపా ఆశిస్తోంది. 

జనసేన

vsp-loksabha-brk4_1.jpgఈ స్థానంలో జనసేన తొలుత గేదెల శ్రీనుబాబును ఎంపీగా అభ్యర్థిగా  ప్రకటించింది. ప్రకటించిన తర్వాతి రోజే కొన్ని కారణాలతో ఆయన్ను తప్పిస్తున్నట్లుగా జనసేన పేర్కొంది. దీంతో శ్రీనుబాబు వైకాపాలో చేరారు. ఈ క్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో చేరడం.. ఆయనకు విశాఖ లోక్‌సభ స్థానం కేటాయించడం జరిగిపోయాయి. రాయలసీమ నుంచి బరిలో దించాలని అధినేత పవన్‌ భావించినా.. దానికి లక్ష్మీనారాయణ సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. దీంతో విశాఖ అభ్యర్థిగా ఆయన్ను ప్రకటించారు. వ్యక్తిగతంగా ఉన్నత విద్యావంతుడు కావడం.. నిజాయతీ గల అధికారిగా పేరుండటం, స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో పనిచేయడం లక్ష్మీనారాయణకు కలిసొచ్చే అవకాశముంది. నగరంలో ఉండే యువతలో ఎక్కువగా విద్యావంతులే కావడంతో వారంతా జనసేన వెంటే ఉంటారని ఆ పార్టీ భావిస్తోంది. 

వైకాపా

vsp-loksabha-brk5_1.jpgవిశాఖ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఎంవీవీ సత్యనారాయణనే ఎంపీ అభ్యర్థిగా వైకాపా ఖరారు చేసింది. జగన్‌ పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతున్న సమయంలో ఆయన వైకాపాలో చేరారు. వైకాపా స్థానికేతరుడికే విశాఖ ఎంపీ టికెట్‌ను కేటాయించనుందని ఆ మధ్య ఊహాగానాలు వెలువడ్డాయి. ఓ దశలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని బరిలోకి దించనున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ చివరికి విశాఖలో స్థిరపడిన సత్యనారాయణ వైపే జగన్‌ మొగ్గు చూపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని.. అదే తమకు లాభిస్తుందని వైకాపా భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు బలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లతో పాటు మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉండే ఎస్‌.కోట, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో వైకాపా ప్రభావం ఉండే అవకాశముంది.

Link to comment
Share on other sites

Janasena weak in S.Kota & Bheemili.

Akkada pick up ayithe tough fight isthadi to TDP.

JD ki City 5 seats lo baagane votes padathaayi excluding core YSRCP haters of JD/JS.

TDP ki anni MLA seats lo strong experienced candidates vunnaru.

Community wise also super combination - 5-BCs (K.Velama-2, 1-Yadav, 1-Matsyakara, 1-Gavara) & 2 OCs (1-Kapu, 1-Kamma)

TDP nunchi Huge cross voting ayithe thappa Janasena ki not easy to win.

 

Link to comment
Share on other sites

4 hours ago, Nfan from 1982 said:

TDP going to clean sweep in this constituency for both MP and MLAs. Lock it ?

 

7 minutes ago, predator said:

Sare

Pawan & Lakshminarayana poti lo lekunda vundi vunte clean sweep ki high chances vundevi.

Bhimili & V-South thappa ee seat lo kooda YSRCP ki strong candidates leru.

Link to comment
Share on other sites

Hudhud gurunchi gurtu cheyyandi..Visakha Sodarlu ki..and Vizag zone gurunchi ehppandi BJP entha mosam chesindoo...Please change the speeches according to city.. Going forward vizag would be a high rise seat for TDP to keep so strong ....we should nt loose this as it would be a financial hub going to be happen in next 1o years...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...