Jump to content

eddaru TDP mla candidates ki bedripulu


Recommended Posts

  • Replies 88
  • Created
  • Last Reply
5 hours ago, ramntr said:

In case మంచి majority tho గెలిస్తే, post elections Cbn should discuss with andhra business community n explain pros n cons of businesses over here compared to there, some benifits should be given to have their offices in andhra.. Ilantidi serious ga think chesthe better....this is called opportunity out of crisis... ??

That will be a master of all return gifts

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

bediriethunnaru ane sodi anavasaram..show proofs and torture with babu gari back ground score or else it wioo back fire..ee cbn nerchukodu..party ni nakichi dobbuthunnadu..

2014 lo kuda ilage annaru cut chesthe 2014 govt form.chesadu...he always warrior....kachara la road meedha kukkala vaagadu...

Vaadu phone lo enduku bediristharu...antha direct ga lotus pond or pragathi bhavan

 

Link to comment
Share on other sites

అర్బన్‌ ఫ్యాక్షన్‌!
22-03-2019 02:54:13
 
636888200535449152.jpg
  • ఏపీ రాజకీయాలపై పెనుకుట్ర
  • ఆర్థిక మూలాలే అస్త్రాలు.. వాటిని అడ్డుపెట్టి బెదిరింపులు
  • ఏపీలో రహస్య మిత్రుడి కోసం పొరుగు పెద్దల వ్యూహం
  • 3 దశలుగా అమలు.. ముందుగానే పార్టీ మారేలా ఒత్తిడి
  • బరిలో నిలవకుండా, నిలిచినా తప్పించడం రెండో దశ
  • గెలిచిన తర్వాత పార్టీ మార్చేలా చేయడం తుది దశ
  • సీమ ఫ్యాక్షన్‌ తరహా రాజకీయాలంటున్న విశ్లేషకులు
మాకు తెలుసు కదా మీరొచ్చేస్తారు..!
కొన్నాళ్ల క్రితం ఏపీ మంత్రి
ఒకరు హైదరాబాద్‌లో ఒక పెళ్లికి వెళ్లారు. పొరుగు రాష్ట్రం కీలక నేత ఒకరు అక్కడ ఎదురుపడి కాసేపు మాట్లాడారు. ‘ఏ ప్రభుత్వం వచ్చినా మీరు మళ్లీ మంత్రి అవుతారు!’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీ గెలిస్తే మంత్రి అవుతానేమో! వేరే పార్టీ గెలిస్తే ఎలా అవుతాను?’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘వేరే పార్టీ గెలిచినా మీరు అందులోకి వచ్చేస్తారుగా. మిమ్మల్ని తీసుకువెళ్తాం. మంత్రిని చేస్తాం’’ అని పొరుగు రాష్ట్రం నేత ధీమాగా చెప్పారు. ఆ మంత్రి ఫంక్షన్‌ హాలు నుంచి బయటకు వచ్చేలోపే... టీడీపీ నుంచి ఆయన బయటకు వచ్చేస్తున్నారని, వైసీపీలో చేరడానికే హైదరాబాద్‌ వెళ్లారని విస్తృతంగా ప్రచారంలో పెట్టేశారు. అది నిజం కాదని చెప్పడానికి ఆయన నానా తంటాలు పడాల్సి వచ్చింది.
 
‘‘నేను పదిహేనేళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. అందులో పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాను. ఇటువంటి ఒత్తిళ్లు గతంలో ఎప్పుడూ చూడలేదు. పెట్టినంత వరకూ పెట్టాం. ఇకపై హైదరాబాద్‌లో పెట్టుబడులు అంత శ్రేయస్కరంగా కనిపించడం లేదు!’’
- టీడీపీ ఎమ్మెల్యే
 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఫ్యాక్షన్‌... ప్రత్యర్థులను భౌతికంగా నిర్మూలించడం! ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం! దీనికోసం పచ్చటి చీనీ (బత్తాయి) చెట్లను అడ్డంగా నరకడం. అనంతపురం, కడప జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది! ఏళ్ల తరబడి పెంచిన తోటలు ఒక్క రాత్రిలో నాశనం కావడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి. ఆ తర్వాత వారు మానసికంగా కూడా బలహీనులవుతారు. ఇది... రూరల్‌ ఫ్యాక్షనిజం! ఇప్పుడు ఇదే తరహాలో కొత్తగా ‘అర్బన్‌ ఫ్యాక్షనిజం’ మొలకెత్తింది. అచ్చం గ్రామాల్లో ముఠా కక్షల్లాగే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, తీస్తామని హెచ్చరించడం, ఆర్థికంగా, మానసికంగా వారిని బలహీనులను చూసి తమ దారికి తెచ్చుకోవడం! ఇదే... అర్బన్‌ ఫ్యాక్షనిజం. అక్కడ తరతరాల ముఠా కక్షల కోసం నిర్దాక్షిణ్య పోరాటం! ఇక్కడ... రాజకీయ అధికారం కోసం అడ్డదారిలో ఆరాటం!
నగరాల్లో తమ ప్రత్యర్థులకు ఉన్న ఆస్తులు, ఆర్థిక వనరులను దెబ్బ తీయడం లేదా దెబ్బ తీస్తామని బెదిరించి లొంగదీసుకోవడం కొత్త వ్యూహంగా అమల్లోకి వచ్చింది. దీనిని అర్బన్‌ ఫ్యాక్షనిజమని రాజకీయ వర్గాలు పిలుస్తున్నాయి. దీని విశ్వరూపం ఏపీ ఎన్నికల్లో బహిరంగంగా కనిపిస్తోంది. ఏపీలో త మ రహస్య మిత్రుడికి మేలు చేసేందుకు... పొరుగు రాష్ట్ర పెద్ద లు టీడీపీ నేతలపై ‘అర్బన్‌ ఫ్యాక్షనిజం’ ప్రయోగిస్తున్నారు.
 
కేరాఫ్‌ హైదరాబాద్‌
అరవై ఏళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌తో సీమాంధ్ర వాసులకు బలమైన బంధం ఉంది. నవ్యాంధ్రలో ఉండే ప్రతి కుటుంబానికి హైదరాబాద్‌తో ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఉద్యోగాలు, ఉపాధికి హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం కావడమే దీనికి కారణం. అలాగే... అక్కడ స్థిరాస్థులు కొనడం, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమల ఏర్పాటు చేయడంవంటివి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వ్యాపార వ్యవహారాలు అదే మాదిరిగా నడిపిస్తున్నారు. బెంగళూరు, చెన్నైలలోనూ తెలుగు వారికి పెద్దస్థాయిలో వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా అలాగే ఉంటాయని, సమస్యలు ఏవీ రావని వారు విశ్వసించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారికి మొట్టమొదటిసారి సమస్య తలెత్తింది. అదీ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి... ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారికి అర్బన్‌ ఫ్యాక్షనిజం వేడి తగులుతోంది. టీడీపీని వీడి తాము చెప్పిన పార్టీలో చేరాలని లేదా పోటీ చేయడం మానుకోవాలని పొరుగు రాష్ట్రం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.
 
‘‘ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. మరో ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని గుర్తుంచుకోవాల’ని ప్రత్యక్షంగానే బెదిరిస్తున్నారు. స్థిరాస్తులు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలను అస్త్రాలుగా మార్చుకుని.. పార్టీలు మారాలని ఒత్తిళ్లు గతంలో చూడకపోవడంతో అనేక మంది నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. కొందరికి పొరుగు రాష్ట్రంలో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి. టీడీపీ నేతలు తమ మాట వినకపోతే వారి భాగస్వాములను పిలిచి మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులకు తట్టుకోలేకపోతున్న భాగస్వాములు టీడీపీ నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదో కొత్త ధోరణి.
 
మూడు దశల్లో ఒత్తిళ్లకు వ్యూహం
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతలపై మూడు దశల్లో ఒత్తిడికి పొరుగు రాష్ట్ర పెద్దలు వ్యూహం రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి దశలో టీడీపీకి రాజీనామా చేయించి వైసీపీలో చేర్పించాలని నిశ్చయించారు. కొందరిని ఈ రకంగా పార్టీ మారేలా చేయగలగడంలో విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారిని గుర్తించి... వారు నామినేషన్‌ వేయకుండా ఆపడం.. లేదా వేసిన తర్వాతైనా ఉపసంహరించేలా చేయడం రెండో దశ! ఈ క్రమంలోనే ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలను కూడా పోటీ చేయాలా వద్దా అని గందరగోళంలో పెట్టగలిగారు. ఇటువంటి ఒత్తిళ్లు కనీసం మరో పది మంది అభ్యర్థులపై ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల తర్వాత వ్యూహం మూడో దశ! ఏదైనా కారణం వల్ల తాము బలపరుస్తున్న పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కావాల్సినంత బలం రాకపోతే టీడీపీ తరఫున గెలిచిన వారిని పార్టీ మారేలా చేయాలన్నది వారి వ్యూహం.
Link to comment
Share on other sites

పార్టీ మారితే ‘కేసు’ క్లోజ్‌!
22-03-2019 03:02:55
 
ఇటీవలిదాకా టీడీపీలో చురుగ్గా ఉన్న ఒక నాయకుడికి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కు సంబంధించిన కుంభకోణం చోటు చేసుకొందని ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపి ప్రభుత్వం నుంచి ఫీజు సొమ్ము రాబట్టారన్నది ఈ ఆరోపణల సారాంశం. పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేశారన్నది మరో ఆరోపణ! ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవహారం జరిగింది. అప్పటికి ఆ నాయకుడు టీడీపీలో లేరు. మరో పార్టీలో ఉన్నారు. ఆ ఫిర్యాదులపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు జరిపారు.
 
రూ.35 కోట్ల వరకూ అవినీతి జరిగిందని ప్రాఽథమికంగా తేల్చారు. లోతుల్లోకి వెళితే కేసు తీవ్రత చాలా ఉండేదని అంటున్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విచారణ పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికలు వచ్చాయి. ‘గిఫ్ట్‌ - రిటర్న్‌ గిఫ్ట్‌’ ప్రక్రియ మొదలైంది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ స్కామ్‌ ఎదుర్కొంటున్న... టీడీపీ నేత ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు టికెట్‌ కూడా వచ్చింది. తెలంగాణలో విచారణలో ఉన్న కేసు మరింత ముందుకు కదలకుండా ఆపేయాలని నిర్ణయించారని, పార్టీ మార్పిడి ఫలితమే ఈ బహుమతి అని కొందరు నాయకులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
పార్టీ మారితే ‘కేసు’ క్లోజ్‌!
22-03-2019 03:02:55
 
ఇటీవలిదాకా టీడీపీలో చురుగ్గా ఉన్న ఒక నాయకుడికి పలు విద్యా సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కు సంబంధించిన కుంభకోణం చోటు చేసుకొందని ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపి ప్రభుత్వం నుంచి ఫీజు సొమ్ము రాబట్టారన్నది ఈ ఆరోపణల సారాంశం. పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంటూ విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేశారన్నది మరో ఆరోపణ! ఉమ్మడి రాష్ట్రంలో ఈ వ్యవహారం జరిగింది. అప్పటికి ఆ నాయకుడు టీడీపీలో లేరు. మరో పార్టీలో ఉన్నారు. ఆ ఫిర్యాదులపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు జరిపారు.
 
రూ.35 కోట్ల వరకూ అవినీతి జరిగిందని ప్రాఽథమికంగా తేల్చారు. లోతుల్లోకి వెళితే కేసు తీవ్రత చాలా ఉండేదని అంటున్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో విచారణ పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత ఏపీ ఎన్నికలు వచ్చాయి. ‘గిఫ్ట్‌ - రిటర్న్‌ గిఫ్ట్‌’ ప్రక్రియ మొదలైంది. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ స్కామ్‌ ఎదుర్కొంటున్న... టీడీపీ నేత ఉన్నట్టుండి వైసీపీలో చేరిపోయారు. ఆయనకు టికెట్‌ కూడా వచ్చింది. తెలంగాణలో విచారణలో ఉన్న కేసు మరింత ముందుకు కదలకుండా ఆపేయాలని నిర్ణయించారని, పార్టీ మార్పిడి ఫలితమే ఈ బహుమతి అని కొందరు నాయకులు చెబుతున్నారు.

AVANTHI ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...