Jump to content

byreddy srisailam?

Recommended Posts

శ్రీశైలం టీడీపీ అభ్యర్థిగా ఏవీ సుబ్బారెడ్డి?
19-03-2019 09:20:11
 
636885840106376527.jpg
అమరావతి/కర్నూలు: ఎన్నికల బరి నుంచి మరో టీడీపీ అభ్యర్థి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో టీడీపీ అధిష్టానం మరో బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌‌గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి పేరును పార్టీ పరిశీలిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డితో టీడీపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారు. ఆలోచించి నిర్ణయం చెబుతానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా టీడీపీ బరి నుంచి తప్పుకుని వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

43 minutes ago, koushik_k said:

He is jumping japang.  Rayalaseema kcr 

Aa doola కూడా వదిలి vuntadi ఈ 5 yrs lo, considering local జన naadi, he can't try separate seema వేషాలు for sometime, party loki వస్తే good అని చెప్పొచ్చు.. 

Link to comment
Share on other sites

డీపీలోకి బైరెడ్డి? శ్రీశైలం అభ్యర్థిగా పరిశీలన!
19-03-2019 10:25:14
 
636885880445972288.jpg
కర్నూలు: ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు.. ఈ గట్టు నుంచి ఆ గట్టుకు నేతలు జంపైపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. తెలుగుదేశంలో చేరాలంటూ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీశైలం బరి నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. టికెట్ హామీ దొరికితే ఇవాళే సీఎం చంద్రబాబు సమక్షంలో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

తెదేపాలోకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

break10a_4.jpg

కర్నూలు: కర్నూలుకు చెందిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపాలో చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. గతంలో తెదేపాలో ఉన్న ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో ఓ పార్టీని కూడా నెలకొల్పారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తెదేపా అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి తెదేపా అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే అటు అసెంబ్లీ స్థానంలో గెలవడంతో పాటు.. ఇటు తెదేపా లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై అధిష్ఠానం నిర్ణయం వెలువడాల్సి ఉంది. చర్చలు సఫలమైతే రేపు లేదా ఎల్లుండి తెదేపాలో బైరెడ్డి చేరే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

టీడీపీలో ట్విస్ట్.. చంద్రబాబు సూచనతో శ్రీశైలం అభ్యర్థి బుడ్డా యూటర్న్
19-03-2019 18:31:10
 
636886170696412896.jpg
కర్నూలు: చంద్రబాబు సూచనతో శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌ కార్యాచరణపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలతో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పోటీకి సిద్ధమయ్యారంటూ ఆత్మకూరులో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తన భార్యకు అనారోగ్యం కారణంగా ఎన్నికల బరిలో నిలవడం లేదని, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని సోమవారం రాత్రి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశానని, మన్నించాలని కోరారు. తన కుటుంబ పరిస్థితులు, తన సతీమణి బుడ్డా శైలజ ఆనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని వివరించారు.
 
Link to comment
Share on other sites

12 minutes ago, RamaSiddhu J said:

good 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...