Jump to content

New Voter List, Form 7 Scam, Voter Deletions.


LuvNTR

Recommended Posts

నియోజకవర్గానికో ఐపీఎస్‌
19-03-2019 02:56:45
 
636885610044365940.jpg
  • 67 స్థానాలపై ఈసీ ప్రత్యేక నజర్‌
  • ఇవి సమస్యాత్మక నియోజకవర్గాలు
  • ఇక్కడ ఐపీఎస్‌లే పరిశీలకులు
  • 23, 24 తేదీల్లో నామినేషన్లు తీసుకోం: ద్వివేది
  • ఎన్నికల్లో విధులకు భారీగా బలగాలు
  • ఇప్పటికే 90 కంపెనీల సిబ్బంది రాక
  • నెలాఖర్లో మరో 75 కంపెనీలు
  • హద్దు మీరితే కఠిన చర్యలు: ఏడీజీ రవిశంకర్‌
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన 67 నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం 67మంది ఐపీఎస్‌ కేడర్‌ అధికారులను ఈసీ అబ్జర్వర్లుగా పంపిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. తనను కలిసిన విలేకరులతో సోమవారం ఆయన చిట్‌చాట్‌ చేశారు. శాంతిభద్రతలపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ‘కులం, ఫ్యాక్షన్‌, రాజకీయంగా సమస్యాత్మకమైన ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించాం. బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి. శాంతిభద్రతల సమస్య ఉన్న 67 నియోజకవర్గాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం 67 మంది ఐపీఎ్‌సలను ఈసీ పంపుతోంది’ అని ద్వివేది తెలిపారు.
 
ఈసారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంటాయన్నారు. ‘ఫామ్‌-6 దరఖాస్తుల పరిశీలన ఈ నెల 25నాటికి పూర్తి చేస్తాం. ఓటర్ల అనుబంధ జాబితా 26న ప్రకటిస్తాం. ఈవీఎంపై గతంలో అభ్యర్థి గుర్తు, వరుస సంఖ్య మాత్రమే ఉండేది. ఈ ఎన్నికల్లో కొత్తగా అభ్యరి ్థఫోటో కూడా ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ గడువు 25తో ముగుస్తుంది. ఈ నెల 23, 24 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లు తీసుకోరు.’
 
48 గంటల్లో చెప్పాలి
‘జగన్‌ మీడియాలో వచ్చిన కథనాలను పెయిడ్‌ ఆర్టికల్స్‌గా గుర్తించాలని, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఆపాలని వచ్చిన ఫిర్యాదులను ఎంసీఎంసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తాం. వెంటనే నోటీ్‌సలు పంపుతాం. ఆ నోటీసులు అందుకున్న పార్టీలుగానీ, అభ్యర్థులుగానీ 48గంటల్లో ఈసీకి సమాధానమివ్వాలి. వారిచ్చిన సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు పరిశీలించి వాస్తవం అని తేలితే ఎంసీఎంసీ కమిటీ తగు చర్యలు తీసుకుంటుంది. ఒక్క నేరపూరిత సంఘటన కూడా జరగకుండా ఎన్నికలు నిర్వహించాలనేదే మా లక్ష్యం’ అని ద్వివేది చెప్పారు.
 
భారీగా ఎన్‌ఆర్‌ఐ దరఖాస్తుల
ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రవాసాంధ్రులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫామ్‌-6ఏ దరఖాస్తులను భారీగా నమోదు చేశారు. గత ఏడాది నవంబరు ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు 10,645 మంది ఎన్‌ఆర్‌ఐలు ఓటు కోసం దరఖాస్తు చేశారు. అందులో 2,188 దరఖాస్తులను ఆమోదించగా, 4,032 తిరస్కరించారు. ఇంకా 4,425 పరిశీలనలో ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు 2,018 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకుని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. 2,003 దరఖాస్తులతో కడప జిల్లా రెండో స్థానంలో నిలవగా, 101 దరఖాస్తులతో విజయనగరం చివరి స్థానంలో నిలిచింది. కడప జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలలో ఇప్పటి వరకూ 383 మంది ఓటు హక్కు పొంది మొదటిస్థానంలో నిలిచారు. 306 ఎన్‌ఆర్‌ఐ ఓట్లతో పశ్చిమ గోదావరి జిల్లా, 282 ఓట్లతో తూర్పుగోదావరి జిల్లా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 21మంది ఓటర్లతో విజయనగరం చివరిస్థానంలో ఉంది.
 
బలగాల నీడలో..
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఏపీ పోలీసుశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల పోలీసులు, bakjshh.jpgఐపీఎ్‌సల అధికారులను సైతం పెద్ద సంఖ్యలో మోహరిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలను, సీమలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక స్థానాల జాబితాలో చేర్చింది. శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ గత కొన్ని రోజులుగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో శాంతిభద్రతలపై సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటి వరకూ పరిస్థితి అదుపులో ఉన్నా నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశం ఉందని సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల పోలీసులతోపాటు, మరిన్ని కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల ఐపీఎ్‌సలను సైతం రంగంలోకి దింపుతున్నారు.
 
నియోజకవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసులతో పికెట్‌ ఏర్పాటు చేసి అందులో షిఫ్టుకు ఆరుగురి చొప్పున 24 గంటలూ కేంద్ర సాయుధ బలగాలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, రాష్ట్రానికి 185 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు వస్తున్నాయి. ఇప్పటికే 90కంపెనీల బలగాలు వచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో ఇంకో 20 కంపెనీలు వస్తున్నాయని, ఈ నెల 30న మరో 75 కంపెనీల బలగాలు వస్తాయని రవిశంకర్‌ చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Link to comment
Share on other sites

ఫామ్‌-7 కేసుల్లో అన్నీ తప్పుడు ఫిర్యాదులే!
21-03-2019 04:26:41
 
  • ఎవరినడిగినా మాకేం తెలీదంటూ ఒకే సమాధానం
  • చిలకలూరిపేటలో వైసీపీ కార్యాలయం నుంచే అప్‌లోడ్‌
  • హోంమంత్రి చినరాజప్ప అనుచరుల ఓట్లకూ ఎసరు
  • ఎన్నికల అధికారి ద్వివేదితో సిట్‌ అధిపతి భేటీ
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సురేశ్‌ అనే వ్యక్తి ఓటు తొలగించాలని నరేశ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. విచారణకు వెళ్లిన పోలీసు అధికారి ఫిర్యాదుదారుని ప్రశ్నించగా దరఖాస్తు తానే అప్‌లోడ్‌ చేశానన్నాడు. ఇంతకూ సురేశ్‌ అనే వ్యక్తి ఉన్నాడా? లేడా? అని విచారిస్తే.. నరేశ్‌ ఓటు తొలగించాలని ఫిర్యాదు చేసింది అతడేనని తేలింది. దీంతో అధికారి ముందు వారిద్దరూ నోరెళ్లబెట్టారు.
 
చిలకలూరిపేట నియోజకవర్గంలో కొందరు తామే ఫిర్యాదు చేసినట్లు ఒప్పుకున్నారు. కాకపోతే స్థానిక వైసీపీ కార్యాలయంలో ఓ ఉద్యోగి దరఖాస్తులు అప్‌లోడ్‌ చేశారని చెప్పారు. అతడి కోసం పోలీసులు ఆరా తీయగా అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిసింది. అతను మరిన్ని దరఖాస్తులు సొంతంగా అప్‌లోడ్‌ చేసినట్లు విచారణలో తేలింది.
 
 
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫామ్‌-7 ఫిర్యాదుల్లో దాదాపు అన్నీ తప్పుడువేనని పోలీసుల దర్యాప్తులో బయటపడుతోంది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన పేర్ల ఆధారంగా ఎవరిని విచారించినా ‘మాకు తెలియదు’ అనే సమాధానమే వస్తోంది. దీంతో ఐపీ అడ్ర్‌సల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అసలు సూత్రధారులను గుర్తించే పనిలో పడింది. సిట్‌ అధిపతి ఐజీ సత్యనారాయణ బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు. ఫిర్యాదుల్లో నకిలీవిగా భావిస్తున్న 2.74 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఐపీ అడ్ర్‌సలు కావాలని కోరారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ ఓట్ల తొలగింపునకు ఫామ్‌-7 దరఖాస్తులను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. వారిచ్చిన చిరునామా ఆధారంగా దర్యాప్తు చేసేందుకు వెళ్లిన పోలీసులు... ‘ఓటు తొలగించాలని మీరు ఫిర్యాదు చేశారు కదా?’ అని అడగ్గానే ‘నేనా...’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ పేరుతో ఫిర్యాదు చేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఫిర్యాదుదారుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులే ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వస్తోంది.
 
ఒక్కరోజే 1.50లక్షల దరఖాస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపు దరఖాస్తులు ఈసీకి పంపాలని వైసీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫిబ్రవరి చివరివారంలో కేడర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణలో డేటా చోరీ వివాదం కూడా అప్పుడే మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని అటువైపు మళ్లించిన ఆ పార్టీ అదే అదనుగా ఫిబ్రవరి 27న ఒక్కరోజే 1.50లక్షల ఫామ్‌-7 దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసింది. అయితే ఈ విషయాన్ని అధికార పార్టీ గుర్తించింది. అప్పటికే ఎలక్టోరల్‌ ఆఫీసర్లు వాటిపై విచారణ ప్రారంభించారు. దాదాపు అన్నీ నకిలీ ఫిర్యాదులని తేలడంతో కేసులు నమోదవడం, సిట్‌ ఏర్పాటు చేయడం, ఎవరి ఓటూ తొలగించడం లేదంటూ ఈసీ ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి.
 
సీడాక్‌కు లేఖ: సిట్‌
ఫామ్‌-7 కేసుల్లో కీలకమైన ఐపీ అడ్ర్‌సల కోసం ఇప్పటికే ఈసీని కోరామని, తాజాగా సీడాక్‌ సంస్థకు లేఖ రాశామని సిట్‌ అధిపతి సత్యనారాయణ తెలిపారు. వివరాలు అందిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఫిర్యాదులందాయని, అత్యధికంగా తిరుపతిలో 10,980 దరఖాస్తులపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
 
అనకాపల్లిలో 10,200, చీపురుపల్లి 8,214, గాజువాక 5,785, అనపర్తి 7,088, గోపాలపురం 7,800, భీమవరం 5వేలు, ఆదోని 5,110, కడప 5,501, ధర్మవరం 6,804 ఇలా రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5వేలకు పైగా తప్పుడు ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
 
కడప తప్ప అన్నీ తప్పే
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 250 పోలీ్‌సస్టేషన్ల పరిధిలో ఇటువంటి కేసులపై విచారణ చేపట్టిన అధికారులకు మూడుచోట్ల మాత్రమే అసలైన వ్యక్తులు తారసపడ్డారు. కడప వన్‌టౌన్‌ పీఎస్‌ పరిధిలో 28 దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుదారు విచారణ అధికారి ముందుకొచ్చారు. తానే ఫామ్‌-7 అప్‌లోడ్‌ చేశానని, వారంతా ఊరొదిలి వెళ్లిపోయారని ఆధారాలు చూపించారు. పెద్దాపురంలో హోంశాఖ మంత్రి చినరాజప్ప అనుచరుల ఓట్లు తొలగించేందుకు త్రినాథ్‌ అనే వ్యక్తి పేరుతో ఫిర్యాదు వచ్చింది. పోలీసులు ప్రశ్నించగా తనకేమీ తెలీదని ఆయన బదులిచ్చారు. ఇలా రాష్ట్రంలో చాలాచోట్ల ఎవరో ఒకరి పేరుతో సంబంధం లేని వ్యక్తులు పథకం ప్రకారమే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...