Jump to content

UP lo SP+BSP Stroke for BJP


RKumar

Recommended Posts

ఈ ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ హవా ఎంత?

akhilesh_2.jpg

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి సవాలు విసురుతూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ- సమాజ్‌వాదీ పార్టీ కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. దీంతో యూపీలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంటుంది. బీఎస్పీ-ఎస్పీ కూటమిని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో ఎవరికెన్ని సీట్లు వస్తాయన్న విషయంపై ఒక మీడియా సంస్థ విశ్లేషణలో ఆ కూటమికి 40 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. 2014 ఎన్నికల్లో ఈ ఇరు పార్టీలు విడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలి భాజపాకు సానుకూల ఫలితాలు వచ్చాయి.

* 2014 లోక్‌సభ ఎన్నికల్లో 62 స్థానాల్లో బీఎస్పీ-ఎస్పీ కలిపి రెండో లేదా మూడో స్థానంలో నిలిచాయి.  

* గతంలో 35 స్థానాల్లో.. భాజపాకు వచ్చిన ఓట్ల శాతం కన్నా బీఎస్పీ-ఎస్పీకి కలిపి వచ్చిన ఓట్ల శాతం అధికంగా ఉంది.

* గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఈ స్థానాలు ఈ సారి కూడా తిరిగి దక్కే అవకాశం ఉంది. ఇవే కాకుండా మరో 35 స్థానాల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమి గెలుపొందే అవకాశం ఉంది. అంటే మొత్తం 40 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ, సంభల్‌, హర్దోయీ, నగీనా, లాల్‌గంజ్‌, ఘాజీపూర్‌ స్థానాలకు ప్రస్తుతం భాజపా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానాల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమి ఓట్ల శాతం భాజపా కంటే 20 శాతం అధికంగా ఉంది.     

* గత ఎన్నికల్లో భాజపా 71 సీట్లలో గెలుపొందింది. వాటిలో ఈ సారి 36 సీట్లను కోల్పోయే అవకాశం ఉంది.

* గతంలో 62 స్థానాల్లో బీఎస్పీ-ఎస్పీ కలిపి రెండో లేదా మూడో స్థానాల్లో నిలిచాయి. అందులోని 27 స్థానాల్లో భాజపాకు ఇప్పటికీ అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

* బులంద్‌షహర్‌, ముజఫర్‌నగర్‌, ఆగ్రా, హాథ్రస్‌, ఫైజాబాద్‌ నియోజక వర్గాల్లో భాజపా గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ-ఎస్పీ ఓట్ల శాతం కన్నా భాజపా చాలా శాతం అధికంగా ఓట్లను కలిగి ఉంది. 

* ఈ అన్ని గణాంకాలన్నింటినీ పరిశీలించి చూస్తే ఈ సారి బీఎస్పీ-ఎస్పీ కూటమి 40, భాజపా 35, కాంగ్రెస్‌ 4 (అమేథీ, రాయ్‌బరేలీతో కలిపి), ఆర్‌ఎల్‌డీ 1 (బీఎస్పీ-ఎస్పీ కూటమిలో ఉన్న ప్రభావంతో) సీట్లను గెలిచే అవకాశముంది. అయితే ప్రతి ఎన్నికకు ఓటర్ల తీరు మారుతుంటుంది. అభ్యర్థి, రాజకీయపక్షం నేపథ్యం, ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి ... తదితర అంశాలను ఓటరు పరిగణలోకి తీసుకొని ఓటు వేయవచ్చు. దీన్ని బట్టి ఆఖరిఫలితం ఉంటుంది.  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...