Jump to content

Recommended Posts

2 minutes ago, RamaSiddhu J said:

Guntur 3 MPs and 13 MLAs Gaurantee including Sathenapalli

Gelisthe happy eh bro... 

Kakapothe okate ... Voorke uff ante odipoye Ambati gadiki anavasarm ga win ayye chance icham...

Vere evaru ayina... Vadini Etti avathala padese vaallam easy ga

Link to comment
Share on other sites

ప్రచారంలో పోటెత్తిన అభిమానం
 
లోకేష్‌కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం

06-450_160.jpg

వీర్లపాలెంలో గొర్రెపిల్లతో లోకేష్, జయదేవ్‌

గొడవర్రు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మొక్కజొన్న, జొన్న బోనస్‌ చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందని, ఇప్పుడు కోడ్‌ ఉన్నందున ఎన్నికలు అయ్యాక వెంటనే ఈ విషయాన్ని తప్పకుండా తన బాధ్యతగా తీసుకుని పరిష్కరిస్తానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. ఆదివారం పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించిన ఆయన ప్రచారం సాయంత్రం 4 గంటల వరకూ సాగింది. మండలానికి ఈశాన్యం కావడంతో పెదకొండూరు కనకపుట్టలమ్మ గుడిలో గంజి చిరంజీవి, చందు సాంబశివరావు, పోతినేని శ్రీనివాస్, ఏనుగ కిషోర్, నందం అబద్దయ్యలతో కలిసి పూజలు చేశారు. ఆలయం వద్ద పాలకవర్గ ఛైర్మన్‌ మొలబంటి శ్రీనివాసరావు తయారు చేయించిన పొంగలిని(బోనమ్‌)ను లోకేష్‌ తలకు ఎత్తుకున్నారు. ఆలయానికి చేరుకోగానే పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావ్, మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ కేసంనేని శ్రీధర్, కానుమోలు సత్యనారాయణ, కుంపటి వెంకటరత్నం, పట్టెల శ్రీనివాసరావు తదితరులు సాదరస్వాగతం పలికారు. పెదకొండూరుకు గ్రామాభివృద్ధి చేస్తున్నారంటూ వితరణశీలి పట్టెల శివశంకరరావును అభినందించారు. అనంతరం సభలో మాట్లాడుతూ గ్రామాల్లో మురుగునీటి పారుదల సమస్య ఉందని తన దృష్టికి వచ్చిందని గెలిచిన వెంటనే యుద్ధప్రాతిపదికన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యవసాయవిద్యుత్తు సరఫరా పగటి వేళ ఏడుగంటలు ఉండడం లేదని గంగాధర్‌ అనే వ్యక్తి లోకేష్‌తో చెప్పారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎస్‌ఈతో మాట్లాడతానని అన్నారు. తనకు, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మోదీ, జగన్, కేసీఆర్‌ల త్రయం కుట్రలు చేస్తోందని అన్నారు. అనంతరం ఆయన గొడవర్రు వచ్చారు. అక్కడ మహిళలు పలు చోట్ల హారతులు ఇచ్చారు. గ్రామంలో జరిగిన ప్రదర్శనలో ఆయనతో కలిసి కదిలారు. రెండు వేళ్లు చూపుతూ తాము తెలుగుదేశం వెంటే ఉన్నామని ప్రజలు గట్టిగా చెప్పారు. విశ్వనాధపల్లి శివకుమార్, చోడవరపు నల్లమ్మ, నడకుదుటి శ్రీనివాసరావు తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వీర్లపాలెం ప్రచారానికి వచ్చిన సమయంలో ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చి జత కలిశారు. చింతలపూడికి చెందిన రామకృష్ణ గొర్రెపిల్లను తెచ్చి ప్రచార రథంపై ఉన్న లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్‌ల చేతికి ఇచ్చారు. బందాపు హనుమాయమ్మ అనే వికలాంగురాలైన 60 ఏళ్ల వృద్ధురాలు మూడు చక్రాల సైకిల్‌పై జెండాలు కట్టుకుని వచ్చి లోకేష్‌ గెలుపునను కాంక్షిస్తున్నట్లు చెప్పారు. శివరామిరెడ్డి, వెంకటరెడ్డి, శంకరరెడ్డి తదితరులున్నారు. పెదపాలెంలో అడుగడుగనా మహిళలు హారతులు పట్టారు. పుతుంబాక సాయికృష్ణ, మొవ్వా చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. చినపాలెంలోనూ వాసిరెడ్డి ప్రదీప్, పెమ్మసాని రామకృష్ణ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడా మహిళలు హారతులు పట్టారు. అన్ని గ్రామాల్లో యువత, మహిళలు లోకేష్‌తో సెల్ఫీలు దిగారు. వృద్ధులు, దివ్యాంగుల్ని ఆయన పలుకరిస్తున్నప్పుడు నీవే గెలవాలంటూ దీవించారు.

నవ్వులు పూశాయి: పెదపాలెంలో లోకేష్‌ మాట్లాడుతూ మీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఒంట్లో కరెంటు బాగా ఎక్కువ అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. ఆయనది బ్యాటరీలు తయారుచేసే కంపెనీ కదా అందుకే కరెంటు ఎక్కువ. పార్లమెంట్‌లో మోదీ కరెంటు షాక్‌కు గురయ్యారని అన్నారు.

07-450_160.jpg

Link to comment
Share on other sites

Just now, Venu_NTR said:

Gelisthe happy eh bro... 

Kakapothe okate ... Voorke uff ante odipoye Ambati gadiki anavasarm ga win ayye chance icham...

Vere evaru ayina... Vadini Etti avathala padese vaallam easy ga

Sathenapalli Development is at peaks under Kodela .don't ignore this 

Link to comment
Share on other sites

ప్రతిసారీ ప్రత్యర్థి మార్పు 

3/18/2019 1:52:47 AM

636885040435223439.jpg
  • ఐదుపర్యాయాలు నరేంద్ర గెలుపు
  • ఆరోసారి అదే పోరు
  • పొన్నూరులో ఇదీ సంగతి
(ఆంధ్రజ్యోతి,గుంటూరు) : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పొన్నూరు నుంచి ధూళిపాళ్ల కుటుంబమే ఎన్నికల బరిలో నిలుస్తోంది. 1983, 1985, 1989 ఎన్నికల్లో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మూడుసార్లు పోటీచేసి 83, 85 ఎన్నికల్లో విజయం సాధించడ మే కాకుండా రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. వీరయ్య చౌదరి ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా 1994లో నరేంద్రకుమార్‌ రాజకీయ అరం గేట్రం చేశారు. 1994 ఎన్నికల బరిలో నిలిచిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా ఐదు పర్యాయాలు గెలుపుబాట కొనసాగించారు. అయితే, ఈ ఐదుసార్లు సమీప ప్రత్యర్థులు మారు తుండడం యాధృచ్చికంగా జరుగుతోంది. ఆరోసారి నరేంద్రకుమార్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సారి కూడా ప్రధాన పార్టీ ప్రత్యర్థి మారడం గమనార్హం!
 
టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై కాంగ్రెస్‌ తరఫున 1994 ఎన్నికల్లో తలశిల వెంకట రామయ్య, 1999 ఎన్నికల్లో చిట్టినేని ప్రతాప్‌బాబు, 2004 ఎన్నికల్లో మన్నవ రాజకిషోర్‌, 2009 ఎన్నికల్లో మారుపూడి లీలాధరరావు, 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున రావి వెంకటరమణలు పోటీ చేసి విజయం సాధించలేక పోయారు. వరుసగా ఐదుసార్లు నరేంద్రకుమార్‌ విజయ బావుటా ఎగురవేశారు. ఈ సారి (2019) ఎన్నికల్లోనూ ప్రత్యర్థి మారడం గమనార్హం! ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున కిలారి వెంకట రోశయ్య బరిలోకి దిగనున్నారు.
Link to comment
Share on other sites

సుజనా రాయబారం.. తేల్చి చెప్పిన రాయపాటి ! 
18-03-2019 17:26:40
 
అమరావతి: గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. నర్సరావుపేట ఎంపీ టికెట్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ రాయపాటి అలకతో ఈ స్థానంపై అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. తనకు ఎంపీ టికెట్‌తో పాటు కుమారుడికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నది రాయపాటి ప్రతిపాదన. అయితే.. జిల్లాలోని దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి. రాయపాటి లాంటి సీనియర్ నేతను వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కన పెట్టి రాయపాటి కుమారుడికి టికెట్ ఇవ్వాలనే అంశంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా మరో వాదన కూడా తెరపైకొచ్చింది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం సిట్టింగ్ నుంచి ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, అధిష్టానం మాత్రం మరికొందరి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చింది.
 
రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదన కూడా టీడీపీ అధిష్టానం రాయపాటి ముందుంచినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రాయపాటి అంగీకారం తెలిపితే.. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసిన మద్దాల గిరిని... నర్సరావుపేట అసెంబ్లీకి పంపాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఆలపాటి నర్సరావుపేట లోక్‌సభకు పోటీ చేయనంటే... భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో రాయపాటి సాంబశివరావును ఎంపీ సుజనాచౌదరి పిలిపించి మాట్లాడిట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన పట్ల తనకు ఆసక్తి లేదని రాయపాటి తేల్చి చెప్పినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

పల్నాటి పోరు

ఈనాడు - గుంటూరు

18ap-main10b_2.jpg

18ap-main10a_3.jpg

పిడుగురాళ్ల సున్నంబట్టీలు.. దాచేపల్లి ముగ్గురాయి.. సిమెంటు పరిశ్రమలు.. నడికుడి రైల్వే జంక్షన్‌.. తెలంగాణ సరిహద్దు.. ఇలా పలు భౌగోళిక ప్రత్యేకతలతో అలరారుతున్న గుంటూరు జిల్లా పల్నాడులోని గురజాల నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే.
తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ వరుసగా మూడోసారి విజయం కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రధాన ప్రత్యర్థిగా వైకాపా తరఫున కాసు మహేష్‌రెడ్డి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయ ఉద్దండులైన కాసు కుటుంబ వారసుడిగా ఆయన  రంగప్రవేశం చేస్తున్నారు.
రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏడాది కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఓట్ల నమోదు నుంచి ప్రతి అంశంపై ఇరు పార్టీలు పోటాపోటీగా పని చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనకు విజయం చేకూరుస్తాయని    యరపతినేని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. రాజకీయ కుటుంబ వారసుడిగా తనను గెలిపిస్తే అండగా ఉంటానంటూ మహేష్‌రెడ్డి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

18ap-main10c.jpg

యరపతినేని పరపతి ఇదీ

18ap-main10d.jpg*సుదీర్ఘకాలంగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం
* పార్టీ కార్యకర్తలు
* బలమైన సొంత సామాజిక వర్గం అండ
* ఏడాది నుంచి వర్గాల వారీగా పలువురికి సొంత సాయం అందించడం
* ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

ఆరోపణలు
* సొంత పార్టీలోని నేతలందరితో కలవలేకపోవడం
* మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల్చు
* యరపతినేని తెదేపా తరఫున 1994, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. 1999, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అభ్యర్థులు ఒక్కరూ లేరు.

కొత్త ‘కాసు’

18ap-main10e.jpg* రాజకీయ కుటుంబం, బలమైన సొంత సామాజిక వర్గం అండ
*నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి కావడంతో వివాదాలు లేకపోవడం
* 1994 నుంచి 25 ఏళ్లుగా ఇక్కడ ఆయన సామాజికవర్గానికి టికెట్‌ రాకపోవడం
* అందరితో కలుపుగోలుగా ఉండటం

లోటుపాట్లు
* స్థానికుడు కాకపోవడం
* ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తుండటం
* 1983 తెదేపా ప్రభంజనంలో కాసు వెంకటకృష్ణారెడ్డి ఇక్కడ పోటీ చేసి తెదేపా అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి చేతిలో 27,020 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కాసు కుటుంబం నుంచి మహేష్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Gnt బలాబలాలు veyyandi plz మీకు వున్న info.. 

Tdp:

Gnt west, తెనాలి, tadikonda, pathipadu, Ponnur, vemuru, repalle, చిలకలూరిపేట 

Ycp:

Nrt, bapatla

Fight:

Gnt east, గురజాల, మాచర్ల, మంగళగిరి, pedakurapadu, సత్తెనపల్లి, vinukonda

Fight vunde వాటిల్లో ఎన్ని gelustharo చూడాలి.. 

Link to comment
Share on other sites

19 minutes ago, rama123 said:

Tenali elaga gelustadu last election compare chesi cheppandi 

Anduke మీ info veyyandi... Total mood thelusthadi అందరి opinions తెలిస్తే.. 

రాజా ki tough seat Antara తెనాలి.. 

Link to comment
Share on other sites

8 minutes ago, akuna matata said:

Watch NTV Lokesh speech local leader waste gallu anukunta janalu tiskuraledhu asale 

Managalagiri motham lo oka meeting pedithe janalani tholuku vastharu. Prathi village, house campaign chesetappudu Janalu enduku???? Irritating and uncomfortable ga untadi

Link to comment
Share on other sites

5 minutes ago, TDP_2019 said:

Managalagiri motham lo oka meeting pedithe janalani tholuku vastharu. Prathi village, house campaign chesetappudu Janalu enduku???? Irritating and uncomfortable ga untadi

ayana chestundi door to door  campaign...public meetings kaadu...daaniki kooda pakka orla nundi janalu toluku ravala enti

Link to comment
Share on other sites

On ‎3‎/‎18‎/‎2019 at 7:56 AM, RamaSiddhu J said:
ప్రచారంలో పోటెత్తిన అభిమానం
 
లోకేష్‌కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం

06-450_160.jpg

వీర్లపాలెంలో గొర్రెపిల్లతో లోకేష్, జయదేవ్‌

గొడవర్రు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మొక్కజొన్న, జొన్న బోనస్‌ చాలా మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందని, ఇప్పుడు కోడ్‌ ఉన్నందున ఎన్నికలు అయ్యాక వెంటనే ఈ విషయాన్ని తప్పకుండా తన బాధ్యతగా తీసుకుని పరిష్కరిస్తానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. ఆదివారం పెదకొండూరు, గొడవర్రు, వీర్లపాలెం, పెదపాలెం, చినపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభించిన ఆయన ప్రచారం సాయంత్రం 4 గంటల వరకూ సాగింది. మండలానికి ఈశాన్యం కావడంతో పెదకొండూరు కనకపుట్టలమ్మ గుడిలో గంజి చిరంజీవి, చందు సాంబశివరావు, పోతినేని శ్రీనివాస్, ఏనుగ కిషోర్, నందం అబద్దయ్యలతో కలిసి పూజలు చేశారు. ఆలయం వద్ద పాలకవర్గ ఛైర్మన్‌ మొలబంటి శ్రీనివాసరావు తయారు చేయించిన పొంగలిని(బోనమ్‌)ను లోకేష్‌ తలకు ఎత్తుకున్నారు. ఆలయానికి చేరుకోగానే పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు వెంకట్రావ్, మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ కేసంనేని శ్రీధర్, కానుమోలు సత్యనారాయణ, కుంపటి వెంకటరత్నం, పట్టెల శ్రీనివాసరావు తదితరులు సాదరస్వాగతం పలికారు. పెదకొండూరుకు గ్రామాభివృద్ధి చేస్తున్నారంటూ వితరణశీలి పట్టెల శివశంకరరావును అభినందించారు. అనంతరం సభలో మాట్లాడుతూ గ్రామాల్లో మురుగునీటి పారుదల సమస్య ఉందని తన దృష్టికి వచ్చిందని గెలిచిన వెంటనే యుద్ధప్రాతిపదికన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యవసాయవిద్యుత్తు సరఫరా పగటి వేళ ఏడుగంటలు ఉండడం లేదని గంగాధర్‌ అనే వ్యక్తి లోకేష్‌తో చెప్పారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎస్‌ఈతో మాట్లాడతానని అన్నారు. తనకు, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. మోదీ, జగన్, కేసీఆర్‌ల త్రయం కుట్రలు చేస్తోందని అన్నారు. అనంతరం ఆయన గొడవర్రు వచ్చారు. అక్కడ మహిళలు పలు చోట్ల హారతులు ఇచ్చారు. గ్రామంలో జరిగిన ప్రదర్శనలో ఆయనతో కలిసి కదిలారు. రెండు వేళ్లు చూపుతూ తాము తెలుగుదేశం వెంటే ఉన్నామని ప్రజలు గట్టిగా చెప్పారు. విశ్వనాధపల్లి శివకుమార్, చోడవరపు నల్లమ్మ, నడకుదుటి శ్రీనివాసరావు తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు. వీర్లపాలెం ప్రచారానికి వచ్చిన సమయంలో ఎంపీ గల్లా జయదేవ్‌ వచ్చి జత కలిశారు. చింతలపూడికి చెందిన రామకృష్ణ గొర్రెపిల్లను తెచ్చి ప్రచార రథంపై ఉన్న లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్‌ల చేతికి ఇచ్చారు. బందాపు హనుమాయమ్మ అనే వికలాంగురాలైన 60 ఏళ్ల వృద్ధురాలు మూడు చక్రాల సైకిల్‌పై జెండాలు కట్టుకుని వచ్చి లోకేష్‌ గెలుపునను కాంక్షిస్తున్నట్లు చెప్పారు. శివరామిరెడ్డి, వెంకటరెడ్డి, శంకరరెడ్డి తదితరులున్నారు. పెదపాలెంలో అడుగడుగనా మహిళలు హారతులు పట్టారు. పుతుంబాక సాయికృష్ణ, మొవ్వా చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. చినపాలెంలోనూ వాసిరెడ్డి ప్రదీప్, పెమ్మసాని రామకృష్ణ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడా మహిళలు హారతులు పట్టారు. అన్ని గ్రామాల్లో యువత, మహిళలు లోకేష్‌తో సెల్ఫీలు దిగారు. వృద్ధులు, దివ్యాంగుల్ని ఆయన పలుకరిస్తున్నప్పుడు నీవే గెలవాలంటూ దీవించారు.

నవ్వులు పూశాయి: పెదపాలెంలో లోకేష్‌ మాట్లాడుతూ మీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఒంట్లో కరెంటు బాగా ఎక్కువ అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. ఆయనది బ్యాటరీలు తయారుచేసే కంపెనీ కదా అందుకే కరెంటు ఎక్కువ. పార్లమెంట్‌లో మోదీ కరెంటు షాక్‌కు గురయ్యారని అన్నారు.

07-450_160.jpg

Galla pakka evaro kurradu Mahesh gani laga unnadu evadu?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...