Jump to content

YS Vivekananda Reddy Died


Recommended Posts

1 hour ago, JAYAM_NANI said:

Appreciate if you can post a Christian version of this message for the living. The living may not take your nice message like that of the dead.

Idedho murder maadhiri undhi uncle...Isumanti time llo manam suvartha sabhalu ettukunte janam manalni chesthaaru murder..

Link to comment
Share on other sites

అవినాష్‌‌కు, వివేకాకు టికెట్ విషయంలో విభేదాలున్నాయి: మంత్రి ఆది

 

వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతిపై టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, చింతిస్తున్నామని.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నట్టుగా దర్యాప్తు నిష్పాక్షిపాతంగా జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు, ఛానళ్ల ముందు వైసీపీ వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ.. తాను, ముఖ్యమంత్రి, లోకేష్, సతీష్‌రెడ్డి పులివెందులలో ఎదుర్కోలేక కుట్రకు పాల్పడ్డామని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు.

 
టికెట్ విషయంలో అవినాష్‌రెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య వివాదం ఉందని ఆయన చెప్పారు. వివేకానందరెడ్డికి ఇలా జరగడం అన్యాయమని తాము చెబుతుంటే.. తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా జగన్‌పై జరిగిన దాడికి, తనకు సంబంధముందని ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. ఇంట్లో జరిగిన దానిని తొలుత ఒక విధంగా చెప్పడం, మళ్లీ ముఖ్యమంత్రిపై, తనపై ఆరోపణలు చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

వైఎస్ వివేకా అనుమానాస్పద మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు

వైఎస్‌ వివేకానంద మృతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనుమానాస్పద మృతి వార్తలపై చంద్రబాబు తక్షణమే స్పందించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. వివేకా మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకా మృతి పట్ల అనుమానాలు రావడంపై వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప పోలీసులతో చంద్రబాబు మాట్లాడారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...