Jump to content

chirala


Recommended Posts

రండి... రండి... రండి...
 

తెదేపాలో ఊపందుకున్న చేరికలు
పర్చూరు, చీరాలలో హుషారు
కొన్నిచోట్ల చర్చల దశలో కీలక నాయకులు

02-450_137.jpg

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో తెదేపాలో చేరిన భరత్‌ తదితరులు

ఈనాడు డిజిటల్‌- ఒంగోలు

ఎన్నికల వేళ గట్లు మారడం సహజమే... చిన్నపాటి చేరికలు, మార్పులు అయితే పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కానీ భారీగా జరిగితే అది ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో కీలక దశల్లో ఉండగా, చీరాలలోనూ ఊపందుకున్నాయి. ఇతర స్థానాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళ... తెదేపాలోకి చేరికలు ఊపందుకున్నాయి. పర్చూరులో రెండు రోజుల వ్యవధిలో 150 మందికి పైగా ఇతర పార్టీల నాయకులు తెదేపాలో చేరగా, చీరాలలో వైకాపా కీలక నాయకులు యడం బాలాజీ నేడు తెదేపాలో చేరనుండడం అదనపు బలమే. రెండు రోజుల కిందట ఏఎంసీ అధ్యక్షుడు జంజనం శ్రీనివాసరావు చేరడం, తాజాగా మరికొన్ని చేరికలకు కరణం బలరాం ప్రయత్నాలు ఫలించడంతో ఇక్కడా పరిణామాలు ఊపందుకున్నాయి. మరోవైపు గిద్దలూరు, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోనూ త్వరలోనే కాస్త పట్టున్న నాయకులు తెదేపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే తెదేపాలో చేరనున్న కొందరు నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి...

* గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే సాయికల్పనరెడ్డి నాలుగు రోజుల్లో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆమె ఇంతకు ముందే చంద్రబాబుతో భేటీ అయ్యారు, తమ కుటుంబ సభ్యులతోనూ చర్చించారు.

* చీరాల వైకాపా నాయకులు యడం బాలాజీ బుధవారం తెదేపాలో చేరనున్నారు. ఇప్పటికే చీరాల అభ్యర్థి ఎంపిక, ఇతర రాజకీయ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

జోరందుకున్న పర్చూరు

పర్చూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా చేరికలు ఊపందుకున్నాయి. పర్చూరు, ఇంకొల్లు మండలాలకు చెందిన 50 కుటుంబాల వారు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో పార్టీలో చేరారు. వీరిలో వైకాపా బాపట్ల పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి రవిచంద్ర, గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా వేమూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్‌ తదితరులు తమ అనుచరులతో సహా పార్టీలో చేరారు. వీరితో పాటు ఇంకొందరు కీలక నాయకులను చేర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. మండలాల వారీగా సమీక్ష జరుపుతూ పార్టీలో చేరికలకు ఆసక్తి చూపుతున్న నాయకులను చేర్చుకోవడంలో పర్చూరు జోరుగా ఉంది. ఇదే వేగాన్ని చీరాలలోనూ అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. యడం బాలాజీ, జంజనం శ్రీనివాసరావు సహా కొందరు కౌన్సిలర్లు, కీలకమైన వైకాపా నాయకులు తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. రెండురోజుల్లో ఖరారు కానుంది.

నేడు చీరాలకు బలరాం

చీరాల శాసనసభ స్థానం నుంచి పోటీకి పార్టీ నుంచి పచ్చజెండా రావడంతో ఎమ్మెల్సీ కరణం బలరాం చీరాలలో రాజకీయాలకు పదును పెట్టారు. దీనిలో భాగంగా బుధవారం చీరాలలో పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని కీలక నాయకులను కలుపుకొని కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ బలోపేతంపై, ఎన్నికల ప్రచారం ప్రణాళికలు చర్చించి మళ్లీ సాయంత్రానికి విజయవాడ వెళ్లనున్నారు. ఇక్కడ తెదేపాలో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు, తదితర నాయకులు సైతం బలరాం అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉండడంతో ఐక్యంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 63
  • Created
  • Last Reply
36 minutes ago, KvrReddy said:

Bujji+Yeluri super combination ..

Pedalludini thokkali eesari.. 

Cherina Bharat is not Gottipati Bharath. Addanki Bujji batch kooda Eluri ki support chesthe baagundu.

Dabbubati cunning fellow. Last Minute daaka jagartha ga undali

 

Link to comment
Share on other sites

దగ్గుబాటి హితేష్‌కు టికెట్ విషయంలో చిక్కులు!
13-03-2019 15:20:22
 
636880872232972768.jpg
 
 
హైదరాబాద్: దగ్గుబాటి హితేష్‌కు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీకి కొత్త చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. పర్చూరు సీటు ఆశించి ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ వైసీపీలో చేరారు. అయితే హితేష్‌ అమెరికా పౌరసత్వం రద్దుకాని కారణంగా టికెట్‌ ఇచ్చే విషయంలో జగన్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు జగన్ సూచించినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

చీరాలలో టీడీపీలోకి వలసలు!

 410
 

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చీరాల పోరులో ఆమంచిని చిత్తుగా ఓడించాలని పసుపు దళాలు కసిగా ఉన్నాయి. అధిష్ఠానం బలరాంను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి చీరాల నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో కదలిక వచ్చింది. ఎమ్మెల్యే ఆమంచికి వ్యతిరేకంగా ఉన్నవారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నవారు వెల్లువలా బయటకు వస్తున్నారు. బలరాంను కలిసి మద్దతు తెలుపుతున్నారు. కొందరు పార్టీలో చేరుతున్నారు.

 

amanchi-krishna-mohan43343434.jpg

చీరాలలో అణిచి పెట్టబడిన ఆగ్రహం ఇప్పుడు బయటకు వస్తోంది. ఆమంచిని కట్టడి చేసే మొనగాడు లేక ఇన్నాళ్లు జనం చెప్పుకోలేక పోయారు. ఇప్పుడు ఆమంచికి తాత లాంటి కరణం బలరాం రంగంలోకి దిగటంతో ఆమంచి కూడా ఖంగు తిన్నారు. తన సీటు మార్చాలని అడిగినా జగన్ ఒప్పుకోలేదు. చీరాలలో ఇప్పుడు ఆమంచి వ్యతిరేక, టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. శుక్రవారం కరణ బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌, వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరిన వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ వేటపాలెం మండలం దేశాయిపేటలో పట్టున్న ఓ సీనియర్‌ నాయకుడును రహస్యంగా కలిశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో బలరాం సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన టీడీపీలోకి వస్తే వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. మండలంలో ఏకపక్ష పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆయనతో పాటు అన్ని మండలాల్లో వైసీపీలో ఉన్న అసంతృప్తుల‌ను చేర‌దీయాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది.

karanam-balaram45454545.jpg

ఇదిలా ఉంటే చీరాల మున్సినాలిటీలో గట్టి పట్టున్న రామానగరం సహా పలు ప్రాంతాలలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వైసీపీ 2వ వార్డు కౌన్సిలర్‌ మొగిలి బాబ్జి, ఆయన సోదరుడు సుధాకర్‌లు సుమారు వంద మందితో బలరాం సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పెద్దాయన గెలుపుకోసం నిస్వార్ధంగా పనిచేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూరగాని లక్ష్మి, సూరగాని నరసింహారావు బలరాం సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ చీరాల, వేటపాలెం మండలాల మహిళా అధ్యక్షులు మల్లీశ్వరి, శారదాంబలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈపురుపాలెంకు చెందిన సీనియర్‌ నాయకుడు, ప్రగడ కోటయ్య శిష్యుడు దామర్ల శ్రీకష్ణ తదితరులు కూడా బలరాం సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తం మీద ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు పెరగటం, టీడీపీలోని అందరు నాయకులూ సమన్వయంతో ముందుకుసాగుతుండటంతో ఆ పార్టీలో జోష్‌ నెలకొంది.

 
410
Link to comment
Share on other sites

Looks like chirala this time will be Aamanchi vs Anti Amanchi

Paleti ramarao, Pothula Sunitha, Yedam balaji andaru working to defeat him. Last time it looks like Anty Aamanchi vote got split.

Balaram ni fast ga akkadiki pampinchatam kooda manchidi ayyindhi. Addanki issue poindhi, alane chirala kottali ane kasi perigindhi

 

Link to comment
Share on other sites

4 minutes ago, TDP_2019 said:

Looks like chirala this time will be Aamanchi vs Anti Amanchi

Paleti ramarao, Pothula Sunitha, Yedam balaji andaru working to defeat him. Last time it looks like Anty Aamanchi vote got split.

Balaram ni fast ga akkadiki pampinchatam kooda manchidi ayyindhi. Addanki issue poindhi, alane chirala kottali ane kasi perigindhi

 

 

Link to comment
Share on other sites

చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచికి షాక్
17-03-2019 22:11:14
 
636884574733418409.jpg
  • టీడీపీలో చేరిన ఆమంచి వర్గీయులు
చీరాల(ప్రకాశం జిల్లా): ఎమ్మెల్సీ కరణం బలరాం చీరాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నాటి నుంచి బలరాం సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీడీపీలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వ్యూహాత్మకంగా బలరాం వేస్తున్న అడుగులు అందుకు కారణం. శనివారం రామక్రిష్ణాపురంలోని ఆయన నివాసంలో ఆమంచి అనుంగ సహచరుడిగా ఉంటున్న వేటపాలెం మాజీ ఎంపీపీ చల్లా జనార్థన్‌రావు తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో బలరాం సమక్షంలో టీడీపీలో చేరారు.
 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలరాంకు చీరాలతో ఉన్న అవినాభావ సంబంధం విడదీయలేనిదన్నారు. బలరాం అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం అని పేర్కొన్నారు. గతంలో తాను పార్టీ నుంచి వెలుపలకు వెళ్ళినా ప్రస్తుత పరిస్థితులలో బలరాంను గెలిపించుకునేందుకు, ఆయనతో కలిసి ప్రయాణం చేసేందుకు ముందుకు వచ్చానన్నారు. జనార్థన్‌ వెంట ఏఎంసీ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, యడం బాలాజీ, కర్నా లచ్చారావు, పృధ్వి చంద్రమోహన్‌, లేళ్ళ శ్రీధర్‌, పృధ్వి చంద్రమోహన్‌ తదితరులు ఉన్నారు. అనంతరం టీటీఎంఏ అధ్యక్షుడు చిన్ని లీలాధర్‌రావు పలువురితో బలరాంను కలిశారు. బలరాం గెలుపుకు తమ వంతు శాయిశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఆయనవెంట కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు గుంటూరు మాధవరావు తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

వైసీపీలో ఇంకా చల్లారని అసంతృప్తి జ్వాలలు
19-03-2019 11:59:29
 
636885935690480382.jpg
ప్రకాశం/కర్నూలు: వైసీపీలో ఇంకా అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. ప్రకాశం జిల్లాలో ఆమంచికి చీరాల టికెట్‌ ఇవ్వడంతో వైసీపీలో అసంతృప్తులు రగిలిపోతున్నారు. ఆమంచికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ కార్యదర్శి అమృతపాణి స్పష్టం చేశారు. తనపై సాక్షి మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించారు. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...