Jump to content

Snakebabu from Narsapuram anta...


Recommended Posts

37 minutes ago, sskmaestro said:

Booka le.... Allu Aravind antha PRP peaks appudey odipoyadu.... oka lo eeka.... eedenta.... atu tirigi etu tirigi YCP ki bokka paduddi chudandi.... asalu ma chantodu self goal specialist 

Vaallu odipoyina TDP ni odagodithe chaalu, mission accomplished.

Link to comment
Share on other sites

  • - నరసాపురం నుంచి నాగబాబు
  • - ఏలూరు పార్లమెంటుకు పెంటపాటి పుల్లారావు
  • - జనసేన అధినేత ఎదుట ప్రతిపాదనలు
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన పక్షాలను తలదన్నేలా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించిందా..? దిమ్మ తిరిగేలా అభ్యర్థులను ప్రకటించబోతున్నారా..? నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్‌ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ జనసేన నేతలు నిజమేనని బదులిస్తున్నారు. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ ఆశ పడుతున్నారు. దీనికి తగ్గట్టు జిల్లాలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తూ వచ్చారు. ఒక దశలో తాను పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ పరోక్ష ప్రకటనలు చేశారు. ఏలూరు నుంచి ఓటు హక్కును పొందారు. అంతకుముందు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చేసిన ప్రకటన మార్చుకున్నట్టే కనిపించింది. ఆ తరువాత ఈ ప్రస్తావన ఎక్కడా ఎత్తలేదు.
 
జనసేనలో అసలు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? పార్లమెంటుకా..? అసెంబ్లీకా..? అనేది సస్పెన్స్‌గా మిగిలింది. తాజాగా రాజకీయ ప్రస్తావనలో ఆయన సోదరుడు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనసేన ముఖ్యనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తవానికి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగబోతున్నట్టు చాలాకాలం క్రితం ప్రచారం సాగింది. తన అన్న చిరంజీవి ఓటమి పొందిన పాలకొల్లులో తిరిగి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో పవన్‌ ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు జనసేన నేతలు పవన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలోకి దిగితే, మిగతా అసెంబ్లీ స్థానాలపైనా దీని ప్రభావం పడుతుందని, పార్టీ ఆయా స్థానాల్లో సులువుగా గెలిచేందుకు వీలు ఉంటుందని, తద్వారా జనసేన సత్తాను ప్రదర్శించేందుకు కార్యకర్తలు సమరోత్సాహంతో ముందుకు కదులుతారని నేతలు పవన్‌కు వివరించినట్టు సమాచారం.
 
గతంలో తమ కుటుంబానికి జరిగిన అవమానాలను జనసేన నుంచి గెలుపొంది తిప్పికొట్టాలనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకనే నరసాపురం, పాలకొల్లు స్థానాల ప్రతిపాదన కొత్తగా పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే తరుణంలో తమ సొంతూరు మొగల్తూరు నరసాపురం పరిధిలోనే ఉండడం పార్టీకి అనుకూలంగా ఉంటుందని తమకున్న అంచనాలను పవన్‌ చెవిన వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
ఏలూరు నుంచి పుల్లారావు
ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ప్రముఖ ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావును రంగంలోకి దించాలని భావిస్తున్నారు. జనసేనలో చేరిన ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పోలవరం నిర్వాసితుల విషయంలో గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేయడం ద్వారా పుల్లారావు పవన్‌ దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆయన ఏలూరు లోక్‌సభ నుంచి బరిలోకి దింపితే ఒకవైపు సామాజికవర్గంగా, మరోవైపు విద్యావేత్తల నుంచి తగినంత మద్ధతు కూడగట్టుకోవచ్చని జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. ఒక దశలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్‌) పేరును పరోక్షంగా పరిశీలనలోకి తీసుకున్నారు. పార్టీలో చేరాల్సిందిగా కోరినా.. ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో ఆయన స్థానంలో పుల్లారావు అభ్యర్థిత్వం పరిశీలనలోకి వచ్చినట్టు సమాచారం. ఒకవైపు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం సైతం ఏలూరు లోక్‌సభ పరిధిలో ఉండడం తమకు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు.
 
ఒంటరి పోటీకే నిర్ణయం?
ఒంటరిగా పోటీ చేసేందుకు నిర్ణయించి కొద్దిరోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కసరత్తు ముమ్మరం చేశారు. లోక్‌సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే దీని ప్రభావంతో అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు సులభం అవుతుందనేది వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏదొక పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువని భావిస్తున్న తరుణంలో తాజాగా ఒంటరిగా రంగంలోకి దిగాలని పవన్‌ భావిస్తున్నట్టు సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...