Jump to content

Runamafi 4th and 5th

Saichandra

Recommended Posts

ఆ 3 పథకాల కథేంటి?
24-04-2019 02:30:08
 
636916698080910657.jpg
  • అన్నదాతా-సుఖీభవ, పసుపు-కుంకుమ, పింఛన్లపై సీఎస్‌ ఆరా
  •  గత బడ్జెట్‌లో ఈ స్కీములు లేవు కదా!
  •  ఇతర పనుల నిధులను వాటి కోసం మళ్లిస్తారా?
  •  ఐజీఎస్టీ డబ్బును సంక్షేమ పథకాలకు ఎలా ఇస్తారు?
  •  ఆర్థిక శాఖ అధికారులతో ఎల్వీ సమీక్షలు
అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు మూడు నెలల ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరా తీస్తున్నారు. 2018-19లో బడ్జెట్‌లో లేని అన్నదాతా-సుఖీభవ, పసుపు-కుంకుమ, సామాజిక పింఛన్ల మొత్తం రెట్టింపుపథకాల కోసం.. ఆ బడ్జెట్‌లో నిధులు కేటాయించిన పనులను, బిల్లులను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్‌లో ఇతర పనులకు కేటాయించిన నిధులను కొత్త పథకాల కోసం ఎందుకు మళ్లిస్తున్నారని వివరణ అడుగుతున్నట్లు సమాచారం. గత వారమే పెండింగ్‌ బిల్లులపై సమీక్ష నిర్వహించిన సీఎస్‌.. మంగళవారం మళ్లీ వాటిపై వరుస సమీక్షలు చేశారు. మొదట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమీక్షించి.. మరికొన్ని వివరాలు తీసుకురావాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
 
వారు ఆ వివరాలతో మధ్యాహ్నం మళ్లీ వచ్చారు. అనంతరం తిరిగి వచ్చి సీఎస్‌ మరికొన్ని వివరాలు అడుగుతున్నారంటూ ఆర్థిక శాఖ కార్యాలయంలో హడావుడి చేయడం కనిపించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అన్నదాతా-సుఖీభవ, పసుపు-కుంకుమ, పింఛన్ల రెట్టింపు పథకాలను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనలన్నిటినీ కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందాకే వాటిని అమల్లోకి తెచ్చారు. 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అంతకుముందే 4 నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించారు. అందులో ఈ కొత్త పథకాలకూ చేర్చారు. పసుపు-కుంకుమ మూడో విడత, అన్నదాతా-సుఖీభవ రెండో విడత చెల్లింపులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో చెల్లించారు. ఏప్రిల్‌లో కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల అడహాక్‌ గ్రాంటు వచ్చింది. మిగులు ఐజీఎస్టీ నిధులను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంచింది. ఈ నిధులను సంక్షేమ పథకాలకు ఎందుకు ఖర్చు పెట్టారని సీఎస్‌ ఆర్థిక శాఖ అధికారులను అడిగినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో లేని ఈ పథకాలకు ఏ విధానం ప్రకారం చెల్లింపులు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారో సమాచారమివ్వాలని ఆదేశించారు. ఈ పథకాలకు కేబినెట్‌ ఆమోదం ఉన్నా.. నియమ నిబంధనల ప్రకారమే నిధులు విడుదలయ్యాయా లేదా అని సీఎస్‌ అడిగినట్లు తెలిసింది.
 
పెండింగ్‌ బిల్లులు రూ.14,400 కోట్లు
మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.14,400 కోట్ల పెండింగ్‌ బిల్లులున్నాయి. పెండింగ్‌ బిల్లుల అంశంపై సీఎస్‌ నిర్వహించిన సమీక్షలో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. గత వారం సీఎస్‌ సమీక్ష నిర్వహించినప్పుడు పెండింగ్‌ బిల్లులు రూ.11,106 కోట్లు ఉండగా.. ఇప్పుడు అవి మరో రూ.3,294 కోట్ల మేర పెరిగాయి. బిల్లులు సరైన వివరాలతో సమర్పించని కారణంగా రూ.12,400 కోట్ల విలువైన బిల్లులను వెనక్కి పంపినట్లు అధికారులు సీఎ్‌సకు తెలిపారు. సరైన వివరాలతో బిల్లులు తిరిగి సమర్పిస్తే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఒకటే ఇన్‌వాయి్‌సతో 3-4 బిల్లులు పెడుతున్న సంఘటనలు బయటపడ్డాయని.. సీఎ్‌ఫఎంఎస్‌ సహాయంతో దొంగ బిల్లులు కనిపెడుతున్నామని వివరించారు.
 
Advertisement

Advertisement

Link to comment
Share on other sites

  • Replies 156
  • Created
  • Last Reply
3 hours ago, sonykongara said:

Endhi ee cs  badha? 

Link to comment
Share on other sites

సీఎస్ సమీక్షలపై మండిపడ్డ యనమల
24-04-2019 12:56:27
 
636917073880779391.jpg
అమరావతి: సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సమీక్షలపై ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల పథకాలకు నిధుల విడుదలను సీఎస్‌ ప్రశ్నించడం అహేతుకమన్నారు. పసుపు-కుంకుమ, పెన్షన్లు, రైతుల పెట్టుబడి సాయం బడ్జెట్లో ఉన్నవేనని యనమల స్పష్టం చేశారు. ఈ పథకాలన్నీ కేబినెట్, అసెంబ్లీ ఆమోదం పొందిన పథకాలేనని స్పష్టం చేశారు. ఓటాన్ అకౌంట్‌లో బడ్జెట్ కేటాయింపులు జరిగినవేనని తెలిపారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్పీచ్‌ను అసెంబ్లీ ఆమోదించిందని యనమల పేర్కొన్నారు.
 
ఎన్నికల కోడ్ రాకముందే రైతులకు, మహిళలకు చెక్కులు పంపిణీ చేశామన్నారు. అవేవీ ఎన్నికల కోడ్ కిందకు రావని కోర్టులు కూడా చెప్పాయని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ నేతల పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. మళ్లీ వీటిపై సీఎస్ రివ్యూ చేసినట్లు మీడియాలో కథనాలు హాస్యాస్పదమని యనమల ఎద్దేవా చేశారు. ఐజీఎస్టీ నిధులను కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చాక అవి రాష్ట్ర నిధులేనన్నారు. అలాంటి రాష్ట్ర నిధులను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వచ్చే నెల తొలివారంలోగా రైతు రుణమాఫీ 4వ, 5వ విడత నిధులు విడుదల చేయనున్నట్టు యనమల
 
తెలిపారు. ఆలస్యమైనా 10% వడ్డీతో సహా రైతులకు చెల్లిస్తామన్నారు. రైతుల్లో అపోహలు సృష్టించవద్దన్నారు. ఎన్నికల ప్రక్రియతో సీఎస్‌కు సంబంధం ఉండదని యనమల పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌పై పూర్తి బాధ్యత సీఈవోదేనన్నారు. సీఎస్ సమీక్షలకు హాజరుకావాలని సీఈవో ఆదేశాలివ్వడం విడ్డూరమన్నారు. కౌంటింగ్‌పై సీఎస్ సమీక్ష పెట్టడం ఏమిటని.. దానికి హాజరు
కావాలని సీఈవో ఆదేశాలివ్వడం ఏమిటని యనమల నిలదీశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...