Jump to content

gudivada


Recommended Posts

13 minutes ago, krishna_Bidda said:

1 week back confirmed ...but Nani wins with 25 k majority as per local reports....

As per EC report lastime dual fight lo less than 15k ipudu peruguthundaaaa triangular fight lo Mallli ?

Link to comment
Share on other sites

Eenadu news

అమరావతి: తెదేపాలో టికెట్ల ఖరారు అంశం తుది దశకు చేరుకుంటోంది. పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల నేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుడివాడ నియోజకవర్గ పంచాయతీ కొలిక్కి వచ్చింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌కు గుడివాడ టికెట్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. గతంలో అక్కడ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నేత రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ, మరో నేత యలవర్తి శ్రీనివాస్‌కు కార్పొరేషన్‌ పదవి హామీ లభించినట్లు తెలుస్తోంది. విభేదాలు వీడి నేతలంతా పార్టీ అభ్యర్థి విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈస్థానంలో వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని బరిలోకి దిగనున్నారు. 

Link to comment
Share on other sites

Andhrajyothy 

అమరావతి: గుడివాడ టీడీపీ టికెట్‌ విషయంలో నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌కు టికెట్ కేటాయించడంపై రావి వెంకటేశ్వరరావు వర్గీయులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. రావికే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి సంకేతాలు పంపిన నేపథ్యంలో.. సోమవారం సీఎం చంద్రబాబు రావి వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు మరోమారు ఖరారు చేశారు. 

కొడాని నానిపై దేవినేని అవినాష్ పోటీ చేయబోతుండటంతో గుడివాడ నియోజకవర్గం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని కాపు ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కొడాలి నాని వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. రాధా వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా తనకు మద్దతు తెలపాలని కొడాలి కోరినట్లు తెలిసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...