Jump to content

Votes deleted issue


NatuGadu

Recommended Posts

13 minutes ago, Koduri said:

Brother, meerena AFDB lo ikkadi discussions ni akkada vesedi? Last week oka thread choosanu AFDB lo. Same thread including title akkada vesaru NFDB chat room lo di. 

Prathi thread Loki vachi -ve comments vestunnaru. Meeku istam lekapothe just silent ga vundochu kada? Ledu naaku ilane anandam ga vuntundi ante mee istam. 

ikkada aa btach ki accounts unnayi, Entertainer, ee kurrodu, inkokallu evaro unnaru. Afdb lo Raithu Bidda ane id kuda mana DB atanidi ani annaru. 

Link to comment
Share on other sites

6 minutes ago, niceguy said:

Ee time lo ilanti comments avsarama..nee istam inka..

Hahaha.....monna army strikes apudu ...tammullu chesina pichi pichi comments tho polisthe idi aslu ye mulaki..?:cheers:...

Aina na cmnt not related to that le....just social media vere platforms glance vesthe...akada govt paike steering tirugutundi ani anipichindi....so ade told

Link to comment
Share on other sites

3 hours ago, niceguy said:

 

yeaaahh ... I'm going to trust ec guy ...

asalu okadi vote ni ikokadu delete cheyyamani apply cheyyatamenti ... kamedy kaakapothe ... 

Voting is a fundamental right of a citizen. How can they put these silly procedures in place?

Form7 enti ... evari meedo inkevado submit cheyyatamendi 

Link to comment
Share on other sites

atleast a dozen cases chusa ... in this forum alone ... parents/spouses votes delete ayyayi ani ... 

Most of these are educated people who know how to manage things ... 

how can this happen? 

Am I too naive in thinking that Indian democracy has some integrity?

I'm beginning to question that belief now.

 

Link to comment
Share on other sites

pks-gen1a_84.jpg

ఒంగోలు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఒంగోలులో ఓటర్ల తొలగింపు దరఖాస్తులు వైకాపా నాయకుల పేరిట వస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే, ఆయన అనుచరులతో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైకాపా నాయకుల పేరిట ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు రావడంపై దృష్టి సారించాలని కోరారు. అర్హులైన ఓటర్లను జాబితాలో నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, పకడ్బందీగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్‌ దరఖాస్తులు, విచారణ, ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 15 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎవరి ఓట్లు విచారణ లేకుండా తొలగించేది లేదని స్పష్టం చేశారు. నాయకులు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎక్కడ నుంచి గంపగుత్తగా దరఖాస్తులు వస్తున్నాయో వారిపై కేసులు నేమోదు చేస్తున్నామని వివరించారు.

చిల్లర రాజకీయాలు తగవు
ఓట్ల తొలగింపు వ్యవహారం వైకాపా నాయకులు కావాలనే తెరవెనుక చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ విమర్శించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదురు ఆదివారం రాత్రి విలేకర్లతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేని వైకాపా నాయకులు ఇలా ఓటర్లను తొలగించడానికి చాటుమాటు వ్యవహారాలు చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి ఎదుర్కోవాలని సవాలు విసిరారు. కాలనీల్లో చిల్లర రాజకీయాలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఎన్ని వార్డుల నుంచి ఎన్ని ఓట్లు తొలగించాలని దరఖాస్తులు చేశారో తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని వివరించారు. ఆయన వెంట ఆయన అనుచరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

ఓటర్లూ భయపడవద్దు

అకారణంగా ఓట్లు తొలగించరు
ప్రతి దరఖాస్తు  మూడు దశల్లో విచారణ
అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష: కలెక్టర్‌
ఒంగోలు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

pks-brk2a_62.jpg

ఓటర్ల తొలగింపు దరఖాస్తుల విషయంలో అక్రమాలకు పాల్పడితే  జైలుశిక్ష పడుతుందని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓట్లు తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తులు అత్యధికంగా వచ్చిన విషయంపై ఆయన స్పందించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. అక్రమంగా ఓట్లు తొలగించాలనే ఉద్దేశంతో కొందరు తమ సెల్‌ఫోన్ల నుంచి దరఖాస్తులు నమోదు చేస్తున్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రతి దరఖాస్తుపైనా మూడు దశల్లో విచారణ జరుగుతుందని, అకారణంగా ఎవరి ఓట్లు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యంత్రాంగం పకడ్బందీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఓటర్లు భయపడాల్సిన పని లేదని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 86 వేల దరఖాస్తులు ఫారం-7 కింద నమోదయ్యాయని తెలిపారు. ఒక వ్యక్తి నుంచి గరిష్ఠంగా 3, 4 దరఖాస్తులు వస్తే సాధారణంగా పరిశీలించి, విచారణ చేపడతామన్నారు. అలా చేయకుండా ఒక వ్యక్తి నుంచే 10, 20, 40 దరఖాస్తులొస్తే, ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వీటిపై ఐపీ చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పర్చూరులో- మూడు, అద్దంకిలో-అయిదు, చీరాలలో- రెండు, సంతనూతలపాడులో- ఒకటి, గిద్దలూరులో- మూడు కేసులు నమోదయ్యాయని వివరించారు. కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వివరించారు. అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...