Jump to content

CBN menakodali mogudu


NatuGadu

Recommended Posts

  • Replies 61
  • Created
  • Last Reply
బాబు పాలన బాగోలేదు
01-03-2019 02:58:45
 
636870059266140473.jpg
  • జగన్‌తోనే రాష్ట్రానికి మేలు
  • జూ.ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు వ్యాఖ్య
హైదరాబాద్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు పాలన బాగాలేదని నార్నె సంస్థల అధినేత, సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు. గురువారం ఇక్కడ లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలిసిన ఆయన.. వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాలని, వైసీపీ కోసం పని చేద్దామనే తాను ఆ పార్టీలో చేరానని చెప్పారు.
 
తనకు పదేళ్లుగా వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎ్‌సను కూడా తాను కలిశానని అన్నారు. ఆయన గుంటూరు జిల్లా పొన్నూరు, చిలకలూరిపేట, పెదకూరపాడుల్లో ఎక్కడో ఒక చోట పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. జూనియర్‌ ఎన్టీఆర్‌ వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తారా అని అడుగగా.. తమ కుటుంబ, వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగడం సరికాదని నార్నె బదులిచ్చారు. కాగా.. శ్రీకాకుళం మాజీ ఎంపీ, కేంద్రమాజీమంత్రి కిల్లి కృపారాణి దంపతులు, జిల్లాకు చెందిన పలువురు కూడా జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...