Jump to content

అవంతి సీను సభ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన భారీ జన సందోహం


sonykongara

Recommended Posts

ఇదేమి నైతికత? అంటూ జగన్‌నే ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలు?
27-02-2019 10:25:20
 
636868599211759780.jpg
విశాఖ జిల్లాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్తలలో ఆందోళన మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న తమను కాదని, పార్టీలోకి కొత్తగా చేరుతున్న జంప్ జిలానీలకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంపై వారు భగ్గుమంటున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చి కొత్తవారిని తెరపైకి తెచ్చారు. ఎన్నికలు దగ్గరపడిన ఈ తరుణంలో వారిని కూడా మార్చేసి తాజాగా పార్టీలో చేరినవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ పరిణామాలపై విశాఖ వైసీపీ నేతల స్పందనెలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
 
   "నైతికత.. నైతికత..'' అంటూ ఉదయం లేచినప్పటి నుంచి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భజన చేస్తుంటారు. అవకాశం చిక్కినప్పుడల్లా "నైతికత'' గురించి ఆయన తెగ ఉపన్యాసాలు దంచేస్తుంటారు. వాస్తవానికే సాక్షాత్తూ వైసీపీ అధినేత జగనే నైతికతని పాటించడంలేదని విశాఖకి చెందిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వారు ఉదాహరణలుగా చూపుతున్నారు.
 
 
   వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని నమ్ముకున్న నేతలు విశాఖలో చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీకి సేవలు అందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో అంకితభావంతో పాల్గొంటున్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఉన్న నేతలు సొంత డబ్బులు కూడా ఖర్చుచేసి కష్టపడుతున్నారు. కానీ ఇలాంటి నేతలను వైసీపీ అధినేత జగన్‌ కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారట! ఇదేమి నైతికత? అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
 
 
    విశాఖజిల్లాలోని భీమిలి నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యముంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీచేయాలని అటు గంటా శ్రీనివాసరావు, ఇటు అవంతి శ్రీనివాసరావు కోరుకుంటున్నారు. అయితే ఈ సీటును గంటాకే టీడీపీ కట్టబెడుతుందని భావించిన అవంతి శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే వైసీపీలో చేరిపోయారు. ఈ తరుణంలో వైసీపీ హైకమాండ్ శరవేగంగా స్పందించింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అవంతి శ్రీనివాసరావుకి అప్పగించింది. హైకమాండ్ తాజా నిర్ణయం భీమిలీ నియోజకవర్గ వైసీపీలో సెగలు రేపింది. ఇప్పటివరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా అక్కరమాని విజయనిర్మల వ్యవహరించారు. ఎన్నికల ముందు ఆకస్మాత్తుగా నిర్మలను తప్పించి అవంతికి బాధ్యతలు అప్పగించడం ఏమిటని ఆమె వర్గీయులు గట్టిగా నిలదీస్తున్నారు. అంతేకాదు- "భీమిలి అసెంబ్లీ టిక్కెట్‌ విజయనిర్మలకే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇలా మాట తప్పడం ఏంటి?'' అని వారు అడుగుతున్నారు. తమకు న్యాయం చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ నిర్మల వర్గీయులు నిరసనగళం వినిపిస్తున్నారు.
 
 
   విజయనిర్మలకు ముందు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా కర్రి సీతారాం వ్యవహరించారు. ఆయన కూడా పార్టీకోసం ఎంతో శ్రమించేవారు. వైకాపా పెద్దల బుర్రలను ఏ పురుగు తొలిచిందో ఏమో..! వన్‌ ఫైన్‌ మార్నింగ్‌ కర్రి సీతారాంను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. విజయనిర్మలను భీమిలి వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. నాటి పరిణామంతో భగ్గుమన్న కర్రి సీతారాం తనకు జరిగిన అవమానానికి నిరసనగా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వచ్చిన విజయనిర్మలకు కూడా ఇదే పరిస్థితి దాపురించింది.
 
 
    ఈ పరిస్థితుల్లో అటు సీతారాం వర్గం, ఇటు విజయనిర్మల వర్గం చేతులు కలిపి.. తమకు అన్యాయం చేసిన పార్టీపై రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నట్లు భీమిలీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రసుత్తం భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పక్షాన పాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మానవవనరుల శాఖమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గంటా కూడా భీమిలి నుంచే మళ్లీ పోటీచేస్తారనీ, టీడీపీ ఆయనకు టిక్కెట్‌ ఖరారుచేసిందనీ ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. భీమిలిలో గంటాను ఓడించాలన్న ఉద్దేశంతోనే అవంతి శ్రీనివాసరావుని వైసీపీ రంగంలోకి దించింది. అయితే వైసీపీ అధిష్టానం అవంతికి టిక్కెట్ ఇస్తే.. జగన్‌ చేతిలో అవమానించబడిన మాజీ సమన్వయకర్తలైన కర్రి సీతారాం, విజయనిర్మల సహకరించే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నమొన్నటి వరకు వైసీపీని తీవ్రంగా విమర్శించిన అవంతి శ్రీనివాసరావుని అదే పార్టీ తరఫున రంగంలోకి దిగితే.. ఓటర్లు ఎలా ఆదరిస్తారనే ప్రశ్నలు కూడా ఉండనే ఉన్నాయి. ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా, మంచి వ్యూహకర్తగా పేరున్న గంటాను ఓడించడం వైసీపీకి సాధ్యమవుతుందా? లేదా? అన్న చర్చ విశాఖ జిల్లాలో వేడిపుట్టిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో!
 

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...