Jump to content

Really??

APDevFreak

Recommended Posts

పాక్‌కు ఎలా షాకివ్వాలో చెప్పిన ఇజ్రాయెల్!
21-02-2019 22:04:01
 
636863834428055249.jpg
న్యూఢిల్లీ: ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడో మెసేజ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. వివిధ మార్గాల ద్వారా పాక్‌పై భారత్ యుద్ధం ప్రారంభించింది. తొలుత అత్యంత సన్నిహిత దేశం హోదాను తొలగించిన భారత్.. దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచింది. తాజాగా, పాక్‌కు వెళ్లే నీటిని ఆపేసింది.
 
ఇవన్నీ పక్కన పెడితే.. భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీయాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాక్.. నకిలీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి భారత్‌లో ప్రవేశపెడుతోంది. అయితే, దీనికి కూడా అడ్డుకట్ట వేసే మార్గం ఒకటుందని అంటోంది ఇజ్రాయెల్. ఒకే ఒక చిన్న పనితో నకిలీ నోట్లకు అడ్డుకట్టు వేయొచ్చని చెబుతూ భారత్‌కు ఇజ్రాయెల్ ఓ సలహా ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
 
అదేంటంటే.. ఇకపై భారత్ ముద్రించే కరెన్సీ నోట్లపై ‘కశ్మీర్ భారత్‌దే’(కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా) అని ముద్రించాలన్నదే ఆ సలహా. కశ్మీర్ భారత్‌దేనన్న నిజాన్ని అంగీకరించని పాక్ ఆ వాక్యాలను ప్రింట్ చేయడానికి అంగీకరించదని ఫలితంగా నకిలీ నోట్ల బెడద తప్పుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్‌కు సలహా ఇచ్చిందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. ఆలోచన మాత్రం అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
social.jpg 
Link to comment
Share on other sites

17 hours ago, APDevFreak said:

brahmilaughing2.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...