Jump to content

kurnool list


sonykongara

Recommended Posts

టికెట్ల విషయంపై కేఈ కుటుంబానికి స్పష్టత

22brk159a.jpg

అమరావతి: కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టికెట్ల విషయంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి సీఎం స్పష్టత ఇచ్చారు. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాలు కేఈ కుటుంబానికేనని చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల నేతలతో విడివిడిగా భేటీ  అయిన చంద్రబాబు.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. డోన్‌ నియోజకవర్గాన్ని కేఈ ప్రతాప్‌, పత్తికొండకు కేఈ శ్యాంబాబు పేర్లను ఎంపిక చేశారు. అలాగే జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం నుంచి  తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి,  బనగానపల్లె నుంచి బీసీ జనార్ధన్‌రెడ్డిని అభ్యర్థులుగా ఎంపికచేశారు. కర్నూలు‌, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపుపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్‌ తనయుడు భరత్‌ కర్నూలు అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. కర్నూలు ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా  పోటీ చేస్తానని ఇటీవల కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న  ఆయన  చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్టు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మరోవైపు, ఆదోని స్థానం కోసం బుట్టా రేణుక, మీనాక్షి నాయుడు పోటీ పడుతున్నారు. అయితే, ఈ స్థానాన్ని కూడా ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.   

ఆ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి   

పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. ‘‘తెదేపా ఆవిర్భావం, ఎదుర్కొన్న సంక్షోభాలపై తీసిన సినిమా ఎన్టీఆర్‌ మహానాయకుడు. నేటి తరానికి ఎన్టీఆర్‌  అంటే ఏంటో తెలిపే సినిమా. పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారంలోకి రావడం ఓ సంచలనం. తెలుగోడు దిల్లీని గడగడలాడించిన తీరు అందరికీ ఆదర్శం.ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మనకి స్ఫూర్తి. మహానాయకుడు సినిమాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని నేతలకు సూచించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...