Jump to content

APNRT Icon Towers


sonykongara

Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply
1 hour ago, sonykongara said:
ఏపీఎన్‌ఆర్‌టీ చుట్టూ 100 ఫ్లాట్లు 

 

‘యు’ ఆకారంలో నిర్మాణం... నెల రోజుల్లో అమ్మకానికి 
ఐకాన్‌ భవనం కింద సర్వీస్‌ అపార్టుమెంట్లు... వాణిజ్య సముదాయాలు 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

21ap-main2a_3.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) భవనం చుట్టూ ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో కొత్తగా 100 ఫ్లాట్లు రానున్నాయి. ఒక్కొక్క ఫ్లాటు విస్తీర్ణం 3000- 4000 చదరపు అడుగులు ఉంటుంది. డిజైన్‌ను రెండ్రోజుల క్రితమే ఆమోదించారు. వీటిని నెల రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేవలం ఎన్‌ఆర్‌ఐల ద్వారా సేకరించిన మొత్తంతోనే ఏపీఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ భవనాన్ని అత్యాధునిక హంగులతో కృష్ణా నదికి సమీపంలో నిర్మించనున్నారు. అమరావతి పరిపాలన నగరికి చేరువగా రూ.500 కోట్లతో 33 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు ఈ భవనం చుట్టూ కొత్తగా నిర్మించే వంద ఫ్లాట్లను ఎన్‌ఆర్‌ఐలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. భవనం కింది భాగంలో సర్వీస్‌ అపార్టుమెంట్లు (హోటళ్లు), వాణిజ్య సముదాయాలు నిర్మించనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 ఫ్లాట్లు అందుబాటులోకి తీసుకువస్తారు. ఒక్కొక్కటి వెయ్యి నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. వీటిని వారం రోజుల్లో బుకింగ్‌కు ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో చ.అ. కనీస ధర రూ.7,000కి మించి ఉండే అవకాశం ఉంది. 
హాట్‌ కేకుల్లా 124 ఫ్లాట్ల అమ్మకం 
ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ప్రారంభించిన గంట వ్యవధిలోనే ఏపీఎన్‌ఆర్‌టీ భవనంలో 124 ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంగ్ల ఆక్షరం ‘ఎ’ అకారంలో ఉండే ఐకాన్‌ భవనంలో మొత్తం 132 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 5,000 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తారు. వీటిని నివాసాలుగానే కాకుండా కార్యాలయాలకూ వినియోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, ఈత కొలను వంటివీ ఉంటాయి. ఒక్కో చ.అ. కనీస ధర రూ.5,500గా నిర్ణయించారు. 80 శాతం మేర ప్రవాసాంధ్రులు అమెరికా నుంచే బుకింగ్‌ చేసుకున్నారు. కువైట్‌, యూకే, ఆస్ట్రేలియాలలో ఉన్నవారి నుంచి కూడా ఆసక్తి వ్యక్తమయింది. అమరావతి సందర్శనకు వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు ఐకాన్‌ భవన డిజైన్‌ను తీర్చిదిద్దారు. భవనం మధ్యలో గ్లోబ్‌ ఆకారంలో నిర్మాణాన్ని ఎల్‌ఈడీ బల్బులతో నింపనున్నారు. గ్లోబ్‌ కింది భాగంలో లేజర్‌ దీపాలను ఏర్పాటు చేస్తారు. వీటి సాయంతో అత్యాధునిక 7డీ సాంకేతికతను ఉపయోగించి ప్రతిరోజూ రాత్రి 7:30, 9:30 గంటలకు లేజర్‌ షోను సందర్శకులు తిలకించేలా ఏర్పాటు చేస్తారు.

 

AP nrt  LO MANA DB vallu okkarau anna konadi sami memu m peru cheppukoni vcchi chusthamu

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...