Jump to content

TDP list


sonykongara

Recommended Posts

1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు

2. విజయనగరం – అశోక్ గజపతిరాజు

3. అమలాపురం – గంటి హరీష్

4. విజయవాడ – కేశినేని నాని

5. కడప – ఆదినారాయణ రెడ్డి

6. గుంటూరు – గల్లా జయదేవ్

7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబసభ్యులు

8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం

అసెంబ్లీ అభ్యర్థులు :-

1. కడప – అషాఫ్

2. రాయచోటి – రమేష్ రెడ్డి

3. రాజం పేట – చెంగల రాయుడు

4. రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్

5. బద్వేల్ – లాజర్

6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి

7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి

8.పులివెందుల – సతీష్ రెడ్డి

9. కమలాపురం – వీర శివారెడ్డి

10.తాడిపత్రి – జేసి ప్రభాకర్ రెడ్డి

11. రాప్తాడు పరిటాల సునీత

12. పుట్టపర్తి – …………

13. ఉరవకొండ – పయ్యావుల కేశవ్

chandra-1.jpg

14. హిందూపురం – నందమూరి బాలకృష్ణ

15. పత్తికొండ – కేఈ కృష్ణ మూర్తి

16. శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్

17. ఆళ్లగడ్డ – అఖిల ప్రియ

18. నంద్యాల – …………

19. ఆదోని – మీనాక్షి నాయుడు

20. కుప్పం – నారా చంద్రబాబు నాయుడు

21. పలమనేరు – అమర్నాధ్ రెడ్డి

22. పుంగనూరు – అనూష రెడ్డి

23. నగరి – గాలి ముద్దు కృష్ణమ గారి కుమారుడు

24. పీలేరు – నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి

25. శ్రీకాళహస్తి – బొజ్జాల కుటుంబ సభ్యులు

26. నెల్లూరు నగరము – పి నారాయణ

27. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

28.కొవ్వూరు – పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి

29.ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య

30.పర్చూరు – ఏలూరి సాంబశివరావు

31.అర్థంకి – గొట్టిపాటి రవికుమార్

32.ఒంగోలు – దామంచర్ల జనార్దన్

33. దర్శి – సిద్ధ రాఘవరావు

34.తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్

35. వేమూరు – నక్క ఆనంద్ బాబు

36. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్

37. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు

38. వినుకొండ – జి వి ఆంజనేయులు

39. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

40. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు

41. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

42. పెడన – కాగిత వెంకట్రావు

43. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు

44. గన్నవరం – వల్లభనేని వంశీ

45.పెనమాలూరు – బోడె ప్రసాద్

chandra.jpg

46.దెందులూరు – చింతమనేని ప్రభాకర్

47.ఏలూరు – బడేటి బుజ్జి

48.గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు

49.తణుకు – ఆరిమిల్లి రాధ కృష్ణ

50. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు

51. ఉండి – శివ రామ రాజు

52.ఆచంట – పితాని సత్యనారాయణ

53. జగ్గo పేట – జ్యోతుల నెహ్రు

54.కొత్తపేట -బండారు సత్యనoదం రావు

55.అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి

56.ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు

57.మండపేట – జోగేశ్వర రావు

58. ప్రత్తిపాడు – పరుపుల రాజు

59.రాజోలు – బత్తిన రాము

60. పాయకరావుపేట – అనిత

61.నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు

62. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ

63. భీమిలి – గంట శ్రీనివాస్

64. అరకు – కిడారి శ్రవణ్ కుమార్

65.మాడుగుల- పైలా ప్రసాద్ రావు

66.పిందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి

67. బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు

68.ఎస్ కోటా – కోళ్లు లలిత కుమారి

69.రాజాం – కొండ్రు మురళి

70. ఏర్చర్ల – కళా వెంకట్రావు

71. టెక్కిలి – అచ్చెన్నాయుడు

72.పలాస – గౌతు శిరీష

evaro post chesadu

Link to comment
Share on other sites

రెండుమూడు రోజుల్లో ఈ 70మంది అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వార్తలు వస్తున్నాయి. అయితే పై వాటిల్లో ఒక ఐదు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు అని, లేకుంటే దాదాపుగా ఇవే ఖరారు అవుతాయని తెలుస్తుంది. ప్రస్తుతం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తున్న ఈ లిస్ట్ సంచలనం కలిగిస్తుంది.

Link to comment
Share on other sites

తాజా సమీక్ష సందర్భంగా విజయవాడ సెంట్రల్‌, తూర్పుతో పాటు మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజక వర్గాల సిటింగ్‌ ఎమ్మెల్యేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, మిగిలిన నియోజకవర్గాలపై సుదీర్ఘ చర్చ జరిగినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని సమాచారం.

Link to comment
Share on other sites

కడపలో ఖరారు!

 

కసరత్తు ముమ్మరం చేసిన చంద్రబాబు
తెదేపా అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి
ఏడెనిమిది స్థానాలపై స్పష్టత
కడప లోక్‌సభ స్థానానికి ఆదినారాయణరెడ్డి పోటీ

శాసనసభ స్థానాలు 10: కడప, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు
లోక్‌సభ స్థానాలు 2: కడప, రాజంపేట

ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికే శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తేవాలని భావిస్తున్న తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. కొన్ని లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థులపై రమారమి ఓ స్పష్టతకు వచ్చారు. కొన్నిచోట్ల ఎంపిక చేసినవారిని వెళ్లి నియోజకవర్గంలో పనిచేసుకోమని చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ సొంత జిల్లా కడపలో వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు.. అక్కడ ఏడెనిమిది శాసనసభ స్థానాలతో పాటు, కడప లోక్‌సభ స్థానం అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేశారు.

కడప జిల్లాలో మొత్తం 10 శాసనసభ స్థానాలుండగా.. ప్రొద్దుటూరు, బద్వేలు తప్ప మిగతా స్థానాలకు అభ్యర్థులు ఇంచుమించు ఖరారైనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప లోక్‌సభ స్థానం నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. రాజంపేట లోక్‌సభ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు.

అభ్యర్థులు వీరే?
కడప జిల్లాలో చాలా శాసనసభ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం సీనియర్‌ నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉంది. చంద్రబాబు వారందరికీ సర్దిచెబుతూ.. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాల దృష్ట్యా అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారు.
* కడప శాసనసభ స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించనున్నారు. ఇటీవలే తెదేపాలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రాఫ్‌ను కడప అభ్యర్థిగా ఇంచుమించు ఖరారు చేశారు. వ్యాపారిగా స్థిరపడిన అష్రాఫ్‌ తండ్రి బాటలో రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారవుతుంది.
* రాయచోటి టిక్కెట్‌ కోసం.. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రమేష్‌రెడ్డి, మాజీ మంత్రి పాలకొండరాయుడి కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. రెండు వర్గాల వారినీ ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడారు. పాలకొండరాయుడు మంగళవారం కూడా ముఖ్యమంత్రిని కలసి తన కుమారుడికి టిక్కెట్‌ కోరారు. రమేష్‌రెడ్డికే అక్కడ టిక్కెట్‌ ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు సమాచారం.
* రాజంపేట టిక్కెట్‌ కోసం బత్యాల చెంగల్రాయుడు, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య పోటీ పడుతున్నారు. చెంగల్రాయుడి అభ్యర్థిత్వాన్నే సీఎం ఖరారు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* రిజర్వుడు నియోజకవర్గం రైల్వే కోడూరులో చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు పంతగాని నర్సింహప్రసాద్‌ని బరిలో దించాలని తెదేపా యోచిస్తోంది.
* మరో రిజర్వుడు నియోజకవర్గం బద్వేలులో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎవరి పేరు సూచిస్తే వారికి టిక్కెట్‌ ఇవ్వనున్నారు. ఆమె లాజరస్‌ అనే వ్యాపారవేత్త పేరుని సూచిస్తున్నట్టు సమాచారం.
* మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ల పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. అక్కడ రవీంద్రారెడ్డివైపే మొగ్గుచూపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
* జమ్మలమడుగు టిక్కెట్‌ విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ రామసుబ్బారెడ్డి తీవ్రంగా పోటీపడ్డా చివరకు ఇద్దరి మధ్య కుదిరిన అంగీకారంలో భాగంగా ఆ టిక్కెట్‌ రామసుబ్బారెడ్డికి ఖరారైంది.
* పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లోనూ సతీష్‌రెడ్డే పోటీ చేయనున్నారు.
* కమలాపురం టిక్కెట్‌ కోసం వీరశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి మధ్య పోటీ ఉంది.
* ప్రొద్దుటూరు అభ్యర్థిపై స్పష్టత రాలేదు. అక్కడ బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దించే ప్రతిపాదనను పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యం..
కడప జిల్లాలో గత ఎన్నికల్లో రాజంపేటలోనే తెదేపా గెలుపొందింది. అక్కడ గెలిచిన మేడా మల్లికార్జునరెడ్డి ఇటీవలే వైకాపా గూటికి చేరారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచినవారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు తెదేపాలో చేరారు. పులివెందులకు కృష్ణా జలాలను తీసుకెళ్లడం సహా, ఈ ఐదేళ్లలో కడప జిల్లాలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశామని, అక్కడ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవాలని నాయకులకు చంద్రబాబు చెబుతున్నారు.

 

Link to comment
Share on other sites

జయదేవ్‌ మీ ఆలోచనలు భేష్‌..

 

తెదేపా ప్రణాళికల రూపకల్పనలో రోజుకు 2 గంటలు కేటాయించాలని చంద్రబాబు సూచన
టికెట్లు త్వరగా ఖరారు చేయాలన్న జయదేవ్‌

19ap-main10a_1.jpg

ఈనాడు, గుంటూరు: ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే వరకు రోజూ రెండు గంటల సమయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రణాళికల రూపకల్పనకు కేటాయించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. మంగళవారం సాయంత్రం ఎంపీ జయదేవ్‌ తన తల్లి గల్లా అరుణకుమారితో కలసి ఉండవల్లిలో సీఎంని కలిసి, తన ఆలోచనలను పంచుకొన్నారు. అవి బాగున్నాయని ముఖ్యమంత్రి మెచ్చుకుంటూ పార్టీ కోసం సమయం వెచ్చించాలని సూచించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రిని ఎంపీ కోరారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విలేకరులతో జయదేవ్‌ మాట్లాడుతూ- గెలవలేనివారు పార్టీలు మారడం సహజమేనని వ్యాఖ్యానించారు. ఎంపీ రవీందర్‌ గంటల వ్యవధిలో పార్టీ మారిపోయారని, మంచి స్నేహితుడిగా మెలగిన రవీందర్‌ తనపై ఎందుకు విమర్శలు చేశారో అర్థం కాలేదన్నారు. పార్లమెంటు ఒక కళాశాల వంటిదని, అధ్యయనం చేసిన తర్వాతే తాను పార్లమెంటులో మాట్లాడతానని చెప్పారు. నిత్యం నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

నాగార్జున రాజకీయాల్లోకి వస్తారనుకోవడం లేదు
వైకాపా అధ్యక్షుడు జగన్‌ను సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసినంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాదని, తాను అలా ఆనుకోవడం లేదని జయదేవ్‌ చెప్పారు. అక్కినేని నాగార్జున తనకు మంచి స్నేహితుడని, ఏదైనా తనతో చర్చించే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ముఖ్యమంత్రికి ముదిరాజ్‌ల కృతజ్ఞతలు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముదిరాజ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు అఖిల భారత ముదిరాజ్‌ మహాసభ ఏపీ విభాగం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వారు సీఎంను కలిశారు.

Link to comment
Share on other sites

రేసు గుర్రాలు రెడీ!
21-02-2019 03:11:45
 
636863282228552933.jpg
  • కృష్ణా జిల్లాలో పది మందికి చంద్రబాబు పచ్చజెండా
  • వీరిలో 9 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలే
  • మైలవరం నుంచి దేవినేని..
  • బెజవాడ పశ్చిమలో జలీల్‌ కుమార్తె
  • బందరులో కొల్లు రవీంద్ర
  • మెజారిటీ సీట్లలో అభ్యర్థులపై స్పష్టత
  • 6 స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు
  • పెడన, గుడివాడ, కైకలూరుల్లో పోటీ
  • తిరువూరులో జవహర్‌కు చాన్సు?
  • పామర్రు, నూజివీడుపై అన్వేషణ!
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ముందడుగు వేశారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగే చాలామంది అభ్యర్థులను దాదాపు ఖరారుచేశారు. పది అసెంబ్లీ సీట్లలో స్పష్టత వచ్చిందని, ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పని చేసుకోవడానికి ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో మంగళ వారం రాత్రి పొద్దుపోయేవరకూ సీఎం సమీక్ష నిర్వహించారు. మరో ఆరు స్థానాలపై కసరత్తు నడుస్తోందని టీడీపీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని 16అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పది చోట్ల, నాటి మిత్రపక్షమైన బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. వైసీపీ ఐదు సీట్లు గెలిచింది. ఈ ఐదుగురిలో ఇద్దరు.. జలీల్‌ఖాన్‌, ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోయారు. బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఈసారి పోటీ చేయడం లేదన్నారు.
 
కాగిత వెంకట్రావు అనుమానమే..
సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పోటీ అనుమానాస్పదంగా ఉంది. ఆయన తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌, బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు కూడా ఆ సీటు ఆశిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు. పామర్రు సిటింగ్‌ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సీటు విషయంలోనూ స్పష్టత రాలేదు. తనకు గానీ, తన భర్త దేవీప్రసాద్‌కుగానీ ఇక్కడ అవకాశమివ్వాలని కల్పన కోరుతున్నారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
 
రావితో విడిగా మాట్లాడిన సీఎం..
వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న మూడు సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థిత్వాలపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. గుడివాడలో ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇవ్వడం అనుమానమేనని అంటున్నారు. సమీక్ష సమావేశంలో రావితో చంద్రబాబు విడిగా మాట్లాడారు. సర్వే నివేదికలు ఆయనకు అంత అనుకూలంగా లేవని చెప్పినట్లు సమాచారం. అక్కడ పోటీచేయాలని మరికొందరు ఆశిస్తున్నారు. వారితోనూ రెండు మూడు రోజుల్లో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్‌ పేరు కూడా ఇక్కడ ప్రచారంలోకి వస్తోంది.
 
ఎవరు బలమైన అభ్యర్థి అయితే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. తిరువూరు నియోజకవర్గంపైనా రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి స్వామిదా్‌సకు పార్టీ వర్గాల నుంచి పూర్తి స్ధాయిలో మద్దతు లభించడం లేదు. ప్రత్యామ్నాయంగా ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ పేరు ప్రచారంలోకి వస్తోంది. మహిళా నేత పద్మజ పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారు. నూజివీడు, కైకలూరు స్థానాలు ఏలూరు లోక్‌సభ సీటు పరిధిలో ఉన్నాయి. ఈ రెంటిపై చంద్రబాబు ఇంకా సమీక్ష జరపలేదు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌ పేర్లు వినవస్తున్నాయి. నూజివీడులో ప్రస్తుత ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు పార్టీవర్గాల నుంచి పూర్తిస్ధాయిలో మద్దతు రావడం లేదు.
 
స్పష్టత వచ్చిన సీట్లు
మైలవరం దేవినేని ఉమా
మచిలీపట్నం కొల్లు రవీంద్ర
అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్‌
విజయవాడ తూర్పు గద్దె రామ్మోహనరావు
విజయవాడ సెంట్రల్‌ బొండా ఉమా
జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య
నందిగామ తంగిరాల సౌమ్య
గన్నవరం వల్లభనేని వంశీ
పెనమలూరు బోడె ప్రసాద్‌
విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్‌
 
Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:
రేసు గుర్రాలు రెడీ!
21-02-2019 03:11:45
 
636863282228552933.jpg
  • కృష్ణా జిల్లాలో పది మందికి చంద్రబాబు పచ్చజెండా
  • వీరిలో 9 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలే
  • మైలవరం నుంచి దేవినేని..
  • బెజవాడ పశ్చిమలో జలీల్‌ కుమార్తె
  • బందరులో కొల్లు రవీంద్ర
  • మెజారిటీ సీట్లలో అభ్యర్థులపై స్పష్టత
  • 6 స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు
  • పెడన, గుడివాడ, కైకలూరుల్లో పోటీ
  • తిరువూరులో జవహర్‌కు చాన్సు?
  • పామర్రు, నూజివీడుపై అన్వేషణ!
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా ముందడుగు వేశారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగే చాలామంది అభ్యర్థులను దాదాపు ఖరారుచేశారు. పది అసెంబ్లీ సీట్లలో స్పష్టత వచ్చిందని, ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు పని చేసుకోవడానికి ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో మంగళ వారం రాత్రి పొద్దుపోయేవరకూ సీఎం సమీక్ష నిర్వహించారు. మరో ఆరు స్థానాలపై కసరత్తు నడుస్తోందని టీడీపీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని 16అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ పది చోట్ల, నాటి మిత్రపక్షమైన బీజేపీ ఒకచోట విజయం సాధించాయి. వైసీపీ ఐదు సీట్లు గెలిచింది. ఈ ఐదుగురిలో ఇద్దరు.. జలీల్‌ఖాన్‌, ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోయారు. బీజేపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఈసారి పోటీ చేయడం లేదన్నారు.
 
కాగిత వెంకట్రావు అనుమానమే..
సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పోటీ అనుమానాస్పదంగా ఉంది. ఆయన తన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ పార్టీ నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌, బంద రు ఎంపీ కొనకళ్ల నారాయణరావు కూడా ఆ సీటు ఆశిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు. పామర్రు సిటింగ్‌ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన సీటు విషయంలోనూ స్పష్టత రాలేదు. తనకు గానీ, తన భర్త దేవీప్రసాద్‌కుగానీ ఇక్కడ అవకాశమివ్వాలని కల్పన కోరుతున్నారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
 
రావితో విడిగా మాట్లాడిన సీఎం..
వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న మూడు సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థిత్వాలపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. గుడివాడలో ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుకు అవకాశం ఇవ్వడం అనుమానమేనని అంటున్నారు. సమీక్ష సమావేశంలో రావితో చంద్రబాబు విడిగా మాట్లాడారు. సర్వే నివేదికలు ఆయనకు అంత అనుకూలంగా లేవని చెప్పినట్లు సమాచారం. అక్కడ పోటీచేయాలని మరికొందరు ఆశిస్తున్నారు. వారితోనూ రెండు మూడు రోజుల్లో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్‌ పేరు కూడా ఇక్కడ ప్రచారంలోకి వస్తోంది.
 
ఎవరు బలమైన అభ్యర్థి అయితే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది. తిరువూరు నియోజకవర్గంపైనా రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి స్వామిదా్‌సకు పార్టీ వర్గాల నుంచి పూర్తి స్ధాయిలో మద్దతు లభించడం లేదు. ప్రత్యామ్నాయంగా ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ పేరు ప్రచారంలోకి వస్తోంది. మహిళా నేత పద్మజ పేరును కూడా కొందరు ప్రతిపాదిస్తున్నారు. నూజివీడు, కైకలూరు స్థానాలు ఏలూరు లోక్‌సభ సీటు పరిధిలో ఉన్నాయి. ఈ రెంటిపై చంద్రబాబు ఇంకా సమీక్ష జరపలేదు. ఏలూరు ఎంపీ మాగంటిబాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌ పేర్లు వినవస్తున్నాయి. నూజివీడులో ప్రస్తుత ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు పార్టీవర్గాల నుంచి పూర్తిస్ధాయిలో మద్దతు రావడం లేదు.
 
స్పష్టత వచ్చిన సీట్లు
మైలవరం దేవినేని ఉమా
మచిలీపట్నం కొల్లు రవీంద్ర
అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్‌
విజయవాడ తూర్పు గద్దె రామ్మోహనరావు
విజయవాడ సెంట్రల్‌ బొండా ఉమా
జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య
నందిగామ తంగిరాల సౌమ్య
గన్నవరం వల్లభనేని వంశీ
పెనమలూరు బోడె ప్రసాద్‌
విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్‌
 

నందిగామ సౌమ్యం ఓకే na? 

Link to comment
Share on other sites

అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు కసరత్తు
21-02-2019 10:23:52
 
636863414330832883.jpg
అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేపట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చలు జరుపనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కడప, రాజంపేట పార్లమెంటు నేతలతో బాబు మరోసారి సమావేశమవుతారు. అలాగే సాయంత్రం 4 గంటలకు కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలపై వేర్వేరుగా భేటీ అవనున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు
Link to comment
Share on other sites

4 minutes ago, Siddhugwotham said:

8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం

I heard that Husband of Pamarru MLA Uppuleti Kalpana would contest as MP for Bapatla...

yes marchutaru ani antunnaru

Link to comment
Share on other sites

రాజంపేట పార్లమెంటు స్థానంపై ముగిసిన సీఎం సమీక్ష..

రాజంపేట పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో పలు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి..

పీలేరు-నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.

రాజంపేట-చెంగల్రాయుడు

రాయచోటి-రమేష్ రెడ్డి

పుంగనూరు-అనూష రెడ్డి

రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్

మదనపల్లె, తంబాలపల్లె సీట్లపై త్వరలోనిర్ణయం..

Link to comment
Share on other sites

మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించిన తెదేపా

 

అమరావతి: కడప జిల్లా రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్ష ముగిసింది. అసెంబ్లీ‌ నియోజకవర్గాల వారీగా నేతలతో చంద్రబాబు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత రాజంపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును ప్రకటించారు. అనంతరం పీలేరు అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌ రెడ్డి, రాయచోటి అభ్యర్థిగా రమేశ్‌కుమార్‌ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూషరెడ్డి, రైల్వేకోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు నరసింహ ప్రసాద్‌· పేర్లను సమావేశంలోనే సీఎం ఖరారు చేశారు. తంబళ్లపల్లి అభ్యర్థి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈస్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా శంకర్‌యాదవ్‌ ఉన్నారు. మిగతా అభ్యర్థుల విషయంలో వారంలోపు నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సర్వేల ఫలితాలు, స్థానిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణల్ని బేరీజు వేసుకుని ఆయన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నారు.  

మరోవైపు కడప పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల నేతలతోనూ సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కడప జిల్లా మైదుకూరు టికెట్‌ను తనకు కేటాయించాలని కోరుతూ మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి నిన్నరాత్రి చంద్రబాబును కలిశారు. అదే సీటు కోసం తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ కూటా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిన తర్వాత కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...