Jump to content

Aahara butta


Yaswanth526

Recommended Posts

ఈ పథకంలో భాగంగా 6 రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో ప్రారంభించారు.

గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇప్పటికే గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాల ద్వారా బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం.

7 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలోని గిరిజన కుటుంబాలకు, గిరిజన జనాభా 40శాతం కన్నా అధికంగా ఉన్న వివిధ జిల్లాల్లోని 41 మండలాల్లోని వారికి నెలనెలా ఈ ఆహారబుట్టలు ఇస్తారు. ఐటీడీఏల పరిధిలోని రేషన్‌ దుకాణాలు, గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధీనంలోని డీఆర్‌ డిపోల ద్వారా అందిస్తారు.

ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది.

ఒక్కో బుట్టలో 2 కిలోల రాగిపిండి, 2 కిలోల కందిపప్పు, కిలో వేరుశెనగ, కిలో బెల్లం, ఒక లీటరు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఐరన్, అయోడిన్ లను కలిగిన కిలో ఉప్పును ఇస్తారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

పోషకాహారంపై సరైన అవగాహన లేని కారణంగా తరచూ అనారోగ్యాలకు గురవుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు పోషకాహారాన్ని అందించి వారి జీవన ప్రమాణ స్థాయిని మెరుగు పరచడానికి చంద్రన్న ప్రభుత్వం కొత్తగా ‘గిరి ఆహార భద్రత’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ పథకానికి ఈనెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. పథకంలో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి రూ.532 విలువైన వివిధ నిత్యావసరాలతో కూడిన ఆహారబుట్ట (ఫుడ్ బాస్కెట్)ను ఒక్కో గిరిజన కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఒక్కో బుట్టలో 2 కిలోల రాగిపిండి, 2 కిలోల కందిపప్పు, కిలో వేరుశెనగ, కిలో బెల్లం, ఒక లీటరు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, ఐరన్, అయోడిన్ లను కలిగిన కిలో ఉప్పును ఇస్తారు.

ప్రతి నెలా మొత్తం 2,00,668 కుటుంబాలకు లబ్ధి. పతి నెలా ఆహారబుట్టలు ఇవ్వడానికి రూ.10.67 కోట్ల వ్యయం అవుతోంది. 2018-19 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది.

https://pbs.twimg.com/media/D0f_ywvVYAE1pvo.jpg:large

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...