Jump to content

Youth for Andhra


Yaswanth526

Recommended Posts

ప్రజల గొంతు నొక్కుతున్న పాలకులకు భిన్నంగా ప్రజలే ముందు అంటోంది తెలుగుదేశం. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించిన ప్రభుత్వం.. యువతను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి నూతనంగా ‘యూత్‌ ఫర్‌ ఆంధ్రా’ అనే యువ సాధికారతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కాదలచుకున్న యువతను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై శిక్షణ ఇస్తారు. ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే బాధ్యతను ఆ యువతీయువకులకే అప్పగిస్తారు. అంటే ప్రభుత్వానికి వీరే బ్రాండ్ అంబాసిడర్లన్న మాట.

తొలి విడతగా పది వేల మందిని లక్ష్యంగా పెట్టుకుని ఎంపిక నిర్వహిస్తున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన వంద మందిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీడియో కాన్ఫెరెన్స్‌ ఏర్పాటు చేస్తారు.

మీరు కూడా ‘యూత్‌ ఫర్‌ ఆంధ్రా’లో చేరాలనుకుంటే... 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న యువత తమ పేర్లను ఆన్‌లైన్‌ ద్వారా https://youth4ap.ncbn.in  వెబ్‌సైట్లలో నమోదు చేసుకోండి. రాష్ట్ర ప్రగతికి, మార్పుకి బ్రాండ్ అంబాసిడర్ లు కండి.

https://pbs.twimg.com/media/DzlPGwRUYAEsZ_P.jpg:large

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...