Jump to content

120 MPs plan to resign


venkatjampani

Recommended Posts

దాదాపు మూడు దశాబ్దాల కిందట.. 1989 జూలై నెలాఖరు! బోఫోర్స్‌ స్కాంలో ఆరోపణల నేపథ్యంలో రాజీనామాకు అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నిరాకరించారు. జేపీసీకీ తిరస్కరించారు! ఎన్టీ రామారావు నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ఊహించని నిరసనకు దిగింది. ఏకంగా 12 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 106 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాంతో, లోక్‌సభ సంక్షోభంలో పడింది. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు అచ్చు ఇటువంటి నిరసననే వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయా!? లోక్‌సభ ఎంపీల మూకుమ్మడి రాజీనామాలపై తర్జనభర్జనలు పడుతున్నాయా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
 
రాఫెల్‌ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించడానికి మోదీ సర్కార్‌ నిరాకరించడం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడం, దేశంలో ప్రతిపక్ష పార్టీలపై అణచివేత చర్యలకు పాల్పడడానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్‌సభ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. లోక్‌సభకు చివరి రోజు అయినా.. మోదీ సర్కారు తీరుపై ఆఖరి పోరాటంగా.. ప్రతిపక్షాలన్నీ సంఘటితమయ్యాయనడానికి సంకేతంగా రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. 
 
ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి వరకూ చర్చలు కొనసాగుతున్నాయని, బుధవారం ఉదయానికి గానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ లోక్‌సభకు చివరి సమావేశాల్లో చివరి రోజు రాజీనామాలు చేస్తే ఎంత మేరకు ప్రభావం ఉంటుంది!? అనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బోఫోర్స్‌ విషయంలో, ఎన్టీఆర్‌ హయాంలో అప్పట్లో 106 మంది ఎంపీలు రాజీనామా చేయగా.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దాదాపు 10 పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు రాజీనామాకు సిద్ధపడవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...