Saichandra 1,123 Posted February 12 ముజఫర్పుర్ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్కే శర్మను బదిలీ చేసి సీబీఐ అదనపు డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు గానూ ఆయనకు న్యాయస్థానం అసాధారణ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానాతో పాటు నేటి కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశించింది. ముజఫర్పుర్ అత్యాచారాల కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి నాగేశ్వరరావు తాను తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న సమయంలో ఎస్కే శర్మను దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు నేడు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కేకే వేణుగోపాల్ న్యాయస్థానానికి విన్నవించారు. అయితే దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది కోర్టు ధిక్కారం కాకపోతే మరేంటీ..? దీనికి శిక్ష పడాల్సిందే. నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం. దీంతో పాటు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు వెళ్లి కోర్టు గదిలో ఓ పక్కన కూర్చోండి’ అని ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు తాను తప్పు చేశానని అంగీకరించిన నాగేశ్వరరావు క్షమాపణ కోరుతూ కోర్టులో నిన్న ప్రమాణపత్రాన్ని సమర్పించారు. Share this post Link to post Share on other sites
Saichandra 1,123 Posted February 12 E edavani cbi director ga vesaru Share this post Link to post Share on other sites
RKumar 604 Posted February 12 4 hours ago, John said: Manodega Manodaina pagodu vadalakoodadu ee Baffas ni. Share this post Link to post Share on other sites
sonykongara 1,343 Posted February 12 avinthi aropanalu unna vadi ki pilichi ichhadu modi Share this post Link to post Share on other sites
sonykongara 1,343 Posted February 12 5 hours ago, John said: Manodega TG ga Share this post Link to post Share on other sites
swarnandhra 300 Posted February 12 7 hours ago, John said: Manodega there is no scam in India without a Telugu guy somewhere in the scheme. Share this post Link to post Share on other sites