Jump to content

పేరేచర్ల - కొండమోడు రహదారి విస్తరణకు పరిపాలన అనుమతి


sonykongara

Recommended Posts

పేరేచర్ల - కొండమోడు రహదారి విస్తరణకు పరిపాలన అనుమతి
12-02-2019 09:01:12
 
  • టోల్‌ పద్ధతిన పనులు
  • త్వరలో ఏజన్సీ ఖరారు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నకరికల్లులో శంకుస్థాపన చేసిన పేరేచర్ల - కొండమోడు రహదారి నాలుగు వరసల విస్తరణ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు వెలువరించారు. మొత్తం రూ.735.37 కోట్ల అంచనా విలువతో ఈ ప్రాజెక్టు డీబీఎఫ్‌వోటీ(టోల్‌) పద్ధతిన నిర్మాణం జరగనుంది. పరిపాలన అనుమతి వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
 
 
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారిగా పేరేచర్ల - కొండమోడుకు పేరుంది. కేవలం రెండు వరసలుగా మాత్రమే ఈ రహదారి ఉండటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతూ వాహ నదారులు, పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గుంటూరు - హైదరాబాద్‌ రహదారిలో భాగంగా ఈ రోడ్డు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయలేదు.
 
 
ఈ ప్రాజెక్టు ఆవశ్యకత గురించి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదించి ప్రాజెక్టుని మంజూరు చేయించారు. ఇటీవలే గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు నకరికల్లులో సీఎం శంకుస్థాపన చేసిన సందర్భంలో కొండమోడు - పేరేచర్ల రోడ్డుని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పునాదిరాయి వేశారు. ఇంచుమించుగా 50 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారిని విస్తరించి అభివృద్ధి చేయాలి. అయితే నిధులు అంత పెద్దమొత్తంలో ప్రభుత్వం వద్ద అందుబాటులో లేని కారణంగా పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయించింది.
 
 
భూసేకరణకు రూ.180.66 కోట్లు, పునరావాసానికి రూ.40 కోట్లు, విద్యుత్‌ స్తంభాలు, కేబుల్స్‌ వంటివి పక్కకు మార్చేందుకు రూ.10 కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.504.71 కోట్ల నిధులు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ సంస్థల నుంచి ఆర్‌అండ్‌బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రతిపాదనలను ఆహ్వానించారు. త్వరలో ఏజెన్సీని ఖరారు చేసి రోడ్డు నిర్మాణ బాధ్యతలను కేటాయిస్తారు. ఆ సంస్థ రహదారి నిర్మాణం అనంతరం టోల్‌ఫీజు వసూలు చేసుకొంటుంది. దీని వలన ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...