Jump to content
Sign in to follow this  
BalayyaTarak

Andhra Samajam

Recommended Posts

నాకు తెలిసి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి ముందు చివరి సారిగా ప్రజలు కానీ, ఏదైనా పార్టీ శ్రేణులు కానీ సీరియస్ గా రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చినది..లక్ష్మి పార్వతి ఎపిసోడ్ అప్పుడు హరి కృష్ణా పర్యటన సందర్భం గానే, దానికి ముందు గాట్ ఒప్పందం అప్పుడు, మండల్ కమిషన్ అప్పుడు కూడా విడి వీడి గానో, కలిసొ  అన్ని వర్గాలు స్వచ్చందంగా వచ్చారు.
 
ఆ తర్వాత చంద్రబాబు పాలన వచ్చాక కొన్ని ఏళ్ల లోనే ఈ ముఖ చిత్రం మారిపోయింది, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తో పాటు, బాబు ఫోకస్ ఏరియా వేరే వుండటం, Y2k టైమ్ కి సాఫ్ట్వేర్ లోనూ, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రంగంలో లోనూ ఉద్యోగాలు , తద్వారా ఇండిరెక్ట్ గా కలిగే ఉపాధి తో పాటు రియల్ ఎస్టేట్ ఇలా రాష్ట్ర జనాభా ఫోకస్ ఏరియా కూడా సంపాదన వైపు మళ్ళింది. జనాల్లో వేడి తగ్గి, తూకం వేసుకోవటం పెరిగింది, డబ్బులు ఆదాయం తో పాటు పిల్లలు కాన్వెంట్ చదువుల ఔట్ కం రావటం కూడా మొదలు అయ్యింది. పోర్షన్ ఇళ్ళ నుంచి అపార్ట్మెంట్ లోకి మారటం, వ్యక్తిగత సంబంధాలు స్థానాన్ని క్రెడిట్ కార్డ్ లు రీప్లేస్ చెయ్యటం మొదలు అయ్యింది ఆ టైమ్ లోనే, కడుపు నిండటం తో కుల పిచ్చా ఎక్కువ అవ్వటం కూడా. 
 
వీటన్నిటి కి కూడా అప్పటికే విద్యా రంగం లో ముందు వున్న ఆంధ్రా ప్రాంతం సహజం గానే అంది పుచ్చుకు దూసుకు పోయింది. లిటరేచర్, కల్చర్, చరిత్ర పట్ల అవగాహన, ఆత్మ గౌరవం అన్నీ వెనక్కి వెళ్లిపోయి కేవలం కమర్షియల్ అస్పెక్ట్ ఏ ముఖ్యం అయ్యి పోయింది. ప్రవాహం లో కొట్టుకు పోతూ ఎవరూ దానిని పట్టించుకోలేదు.
 
కాలక్రమం లో ఈ ప్రాంతం లో వీటి వల్ల వచ్చిన  ఉదాసీనత వల్లే రాష్ట్ర విభజన సందర్భం లోనూ, ఆ ముందు ఆ సో కాల్డ్ ఉద్యమం పేరు లో జరిగిన అవాస్తవ ప్రచారాలను  ఎదుర్కోలేక అలా వదిలేసి ఉదాసీనంగా వుండి పోయి, విభజన కి గురి అయ్యింది..విభజన సందర్భం గా కూడా ఘోరం గా నష్ట పోయింది. తర్వాత సమైక్య ఉద్యమం పేరు తో ఏదో కొంత హడావిడి చేసినా, అది ఎప్పుడూ నిజం గా ఉద్యమం అయ్యింది లేదు. వున్నది కూడా వూడ కొట్టుకొని లోటు బడ్జెట్, రాజదాని, సరి అయిన విద్యా, వైద్యలాయాలు కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఆ రోజూ చంద్ర బాబు లాంటి నేత విభజన కి అభ్యంతరం లేదు కానీ 5 లక్షల లోటు నీ కేంద్రం ఇవ్వాలి అంటే సరిగ్గా స్పందన కూడా ఇవ్వకుండా కులం మాటున దాక్కున్నది ఆంధ్ర సమాజం.
 
ఇప్పుడు ఇంత జరిగాక,అదే మనిషి ఒక వ్యవస్థ గా మారి మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్ట టాని కి కష్ట పడుతూ, రాజీ పడుతూ, పోరాడుతూ పాటు పడుతుంటే, మన ఉదాసీన పోటు గాళ్ళు మళ్ళీ కులం, మతం వెనక దాక్కుని , ముందుకు పోయె వాడిని కిందకి లాగుతూ, మనం కూర్చున్న కొమ్మన్ని మనమే నారుకునే విధం గా సాగుతూ వుంటే..
 
ఇలానే వుంటే...నపుంసక సమాజం గా మిగిలి పోవటం ఖాయం. ఆంధ్రులు ఏనాడు తల వగ్గిన్నా అది తాత్కాలికమే, అంతిమంగా తల ఎగరేసి నిలబడి హస్తిన నీ గెలిచిన చరిత్రే మనది. మరి ఇప్పుడూ అదే చేయగలమా లేదా? మన తరం లో మనలో ఆ సత్తా , సత్తువా మిగిలి వుందా లేదా? మన నాయకుడికి 68 ఏళ్ల వయసులో వున్న పోరాట స్పూర్తి, జాతి అభివృద్ది పట్ల వున్న కాంక్ష, దార్శినికత మన కి వున్నయ్యా? లేవా? 
 
ఆలోచించండి..అందరూ ఆలోచించండి.
కళ్యాణ్

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×