Jump to content

మోదీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు..


KING007

Recommended Posts

మోదీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు..
08-02-2019 22:59:04
 
636852636008817401.jpg
గుంటూరు: జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ప్రధాని మోదీపై రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మోదీ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. రాష్టానికి అన్యాయం చేసిన మోదీ ఏ ముఖం పెట్టుకుని గుంటూరుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 10న నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపడతామని టీడీపీ నేతలు తెలిపారు.
Link to comment
Share on other sites

గో బ్యాక్ మోదీ..ఎలా వస్తారంటూ నిరసన
08-02-2019 20:03:25
 
636852530762784997.jpg
తిరుపతి: ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారనే సమాచారం నేపథ్యంలో  ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నిరసనకు పూనుకుంది. గో బ్యాక్ మోదీ అంటూ యూనివర్శిటీ పరిపాలన భవనం ముందు అన్ని పార్టీల విద్యార్థినీ, విద్యార్థులు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు ఎస్వీ యూనివర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన సభలో శ్రీవారి పాదాల సాక్షిగా ఇచ్చిన మాటను తప్పిన మోదీ.. ఎలా మళ్లీ ఏపీకి వస్తారని ప్రశ్నించారు. తమ నిరసనను శనివారం నుంచి విన్నూత్న రీతిలో కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. 
Link to comment
Share on other sites

మోదీ పర్యటనకు నిరసనగా ఏపీలో ఆందోళనలు
09-02-2019 13:43:13
 
636853165922368721.jpg
విజయవాడ: ప్రధాని మోదీ గుంటూరు జిల్లా పర్యటనకు నిరసనగా ఏపీలో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. లెనిన్ సెంటర్‌లో వామపక్ష పార్టీలు మట్టికుండలు పగులగొట్టి మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
Link to comment
Share on other sites

ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ ? ప్రతి ఆంధ్రుడూ ఈ పోస్టర్స్ మీ వాల్ మీద పోస్ట్ చేయండి ! కవర్ పేజ్ లో పెట్టండి. మీ వాట్సప్ లో ఇతరులకి పంపండి. నిరసన సెగ తగలాలి

Dy8iHxeVAAEUcLX.jpg
Dy8iINGUcAAibnm.jpg
Dy8iIkqUYAEReak.jpg
Dy8iJEWU0AAqK0d.jpg
Link to comment
Share on other sites

దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలి:చంద్రబాబు

9brk-chandrababu1a.jpg

హైదరాబాద్‌: విభజన గాయాలపై కారం జల్లి ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తూ మోదీ నోరు పారేసుకుంటున్నారని, రేపు గుంటూరు వచ్చి అదే ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తారని సీఎం దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో శనివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో రేపు, ఎల్లుండి ఒక చీకటి దినంగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు.

ఎల్లుండి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్థానికంగా ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిరసనలు తెలపాలన్నారు. చేసిన దుర్మార్గం చూసేందుకు మోదీ వస్తున్నారని, రాష్ట్రంలో మరో వ్యక్తి ఆయనకు సహకరిస్తున్నాడని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రాల్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు మానసికంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో చేశారు.. రేపు ఇక్కడా చేస్తారని.. దేనికీ అదిరేది లేదని తేల్చి చెప్పారు.

మోదీ ద్రోహంపై జగన్ ఒక్కమాట అనరని విమర్శించారు. భాజపా, వైకాపా కుమ్మక్కుకు అదే రుజువన్నారు. రఫేల్‌ బురదలో మోదీ కూరుకుపోయారని, దొంగే దొంగా అన్నట్లుగా ప్రధాని వ్యవహారశైలి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రఫేల్‌ వ్యవహారంలో పీఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ఠ అని మండిపడ్డారు. మోదీ అడుగులు ఆంధ్రప్రదేశ్‌ను అపవిత్రం చేస్తాయని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా వైకాపా 4 సెషన్లకు డుమ్మా కొట్టిందన్నారు. ఇలాంటివాళ్లు ప్రజాసేవకే అనర్హులు, రాజకీయాలకే అనర్హులని తేల్చి చెప్పారు. మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానం లేదన్నారు. అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

Link to comment
Share on other sites

మోదీ గో బ్యాక్‌’.. ఏపీలో నిరసనలు

09brk-95b.jpg

అమరావతి: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

ప్రధాని పర్యటించనున్న గుంటూరు నియోజకవర్గంలో నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ ఏపీలో అడుగు పెట్టవద్దని తెదేపా నేతలు స్పష్టం చేశారు. మోదీని ప్రజలు స్వాగతించరని తెలుగు యువత నేతలు ఆగ్రం వ్యక్తంచేశారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. మోదీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా, వామపక్షాల నేతలు కలిసి ఆందోళనలు చేపట్టారు.

09brk-95a.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి మోదీ పర్యటన పట్ల శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

 

Link to comment
Share on other sites

Hope these hoardings are not removed and gets national attention! 

Monna North east lo black flags.... ippudu AP lo nirasanaa....

 

reyyy Modi gaaaa nee antha erri flower evadu undadu ra! Nammakamaina mitrapakshalanu BJP ki dooram chesav! It’s a huge loss to BJP in long run.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...