Jump to content

Rafale Scam Exposed


Yaswanth526

Recommended Posts

మోదీపై మరో బాంబు!
11-02-2019 13:56:12
 
636854901737234001.jpg
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందం వివాదాస్పందంగా మారడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వంపై ‘ది హిందూ’ పత్రిక తాజాగా మరో బాంబు పేల్చింది. ఈ ఒప్పందం సందర్భంగా అవినీతి వ్యతిరేక జరిమానాలకు సంబంధించిన కీలక నిబంధనలను రద్దు చేయడంతో పాటు తాకట్టు ఖాతా నుంచి చెల్లింపులు చేయాలన్న ఆర్ధిక సలహాదారుల సిఫారసులను సైతం కేంద్రం తోసిపుచ్చినట్టు  వెలుగులోకి తెచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో అంతర-ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ)కి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఈ వ్యవహారం నడిచినట్టు ‘ది హిందూ’ తాజా కథనంలో పేర్కొంది. అవినీతి నిర్మూలనే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
 
ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులు నేరుగా చర్చలు జరపడం, భారత చర్చల బృందాన్ని ‘‘తక్కువ చేసేలా’’ వ్యవహరిండంపై రక్షణ శాఖ అధికారులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసినట్టు ఇటీవల ‘ది హిందూ పత్రిక’ ఓ కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారంలోపే మోదీ ప్రభుత్వ మరో నిర్వాకం వెలుగుచూడడం గమనార్హం. రూ.58 వేల కోట్ల విలువైన రాఫెల్ ఒప్పందానికి కొద్దిరోజుల ముందు అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం చోటుచేసుకున్నట్టు హిందూ పత్రిక వెల్లడించింది. ‘‘మితిమీరిన జోక్యం, ఏజెంట్లు లేదా ఏజెన్సీలకు కమిషన్లు ఇవ్వడంపై జరిమానా విధించడం’’తో పాటు దసో ఏవియేషన్, ఎంబీడీయే ఫ్రాన్స్ ‘‘కంపెనీ ఖాతాల సమాచారం పొందడం’’ తదితర అంశాలు రక్షణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ (డీపీపీ)లో ప్రామాణిక నిబంధనలు. సరఫరా నియమావళిలోని ఈ కీలక అంశాలను భారత ప్రభుత్వం ఉపసంహరించుకునేలా రాజకీయ ఒత్తిళ్లు జరిగినట్టు ‘ది హిందూ’ వెల్లడించింది. 2016 ఆగస్టు 24న ఐజీఏ, అనుబంధ పత్రాలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగా.. 2016 సెప్టెంబర్‌లో నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సారథ్యంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) సైతం తలూపేసింది. యుద్ధ విమానాలను సరఫరా చేసే బాధ్యత దసోది కాగా, ఎంబీడీఏ ఫ్రాన్స్.. భారత రక్షణ శాఖకు ఆయుధ సరఫరాదారుగా ఉంది.
 
 
కాగా డీపీపీ నిబంధనలను పక్కనబెట్టడంపై ఎం.పీ.సింగ్ (ధరల సలహాదారు), ఏఆర్ సూలే (వైమానికదళ ఫైనాన్షియల్ మేనేజర్), రాజీవ్ వర్మ (జాయింట్ సెక్రటీ, వైమానికదళ ఎక్వైజేషన్స్ మేనేజర) సహా నాటి చర్చల బృందంలోని ముగ్గురు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినట్టు ‘ది హిందూ’ పేర్కొంది. ఐజీఏ ముసుగులో కమర్షియల్ కంపెనీలైన దసో, ఎంబీడీఏ ఫ్రాన్స్‌లతో నేరుగా చర్చలు జరపడం, నిబంధనలు తుంగలో తొక్కడం వివేకం కాదంటూ తమ అసమ్మతి లేఖలో వారు పేర్కొన్నట్టు వెల్లడించింది.
 
ఫ్రాన్స్ నుంచి బ్యాంకు గ్యారంటీతో సంబంధం లేకుండా ఫ్రాన్స్ ప్రధాని నుంచి చట్టపరంగా ఎలాంటి బలంలేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్‌’తో భారత ప్రభుత్వం సరిపుచ్చుకోవడానికి వెనుక ఈ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న కంపెనీలు రెండూ ప్రైవేటు కంపెనీలు కాబట్టి వాటికి చెల్లింపులు చేసేందుకు తాకట్టు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఈ ఖాతా నుంచి భారత ప్రభుత్వం తొలుత ఫ్రాన్స్ ప్రభుత్వానికి డబ్బు పంపితే... అది సమయానుకూలంగా సదరు కంపెనీలకు చేరుకోవడం ద్వారా ఆర్ధికంగా భారత్‌కు భరోసా లభిస్తుంది. ఆర్థిక సలహాదారులు చేసిన ఈ సిఫారసులను సైతం కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
Link to comment
Share on other sites

  • Replies 90
  • Created
  • Last Reply

As usual half knowledge NRam Expose is not an expose and went to bottom of page by end of the day. Of course mana half knowledge newspapers will have on tomorrow's news papers.

G2G deals don't have integrity clauses. Worldwide they follow same thing. Recent deals we did with US and Russia don't have integrity clauses as well.

 

 

 

 

Link to comment
Share on other sites

14 minutes ago, Bollu said:

hindi vadu already mention chesadu ga, we will release more and more articles on rafeal ani.. bakths prathi roju raktha kanneru pettisthunnadu..thanks ram.

Manufactured articles konthamandhi perception marchochu, but technically cinema ledhu. As long as there is no investigation ordered by SC the ruling party will be fine.

Link to comment
Share on other sites

3 minutes ago, Rajakeeyam said:

 Manufactured articles konthamandhi perception marchochu, but technically cinema ledhu. As long as there is no investigation ordered by SC the ruling party will be fine.

justice chalameshawar gariki chief justice vahinattu aithe order vesevadu, but gogai doubt ne. ivvala cag report releae chesthamannaru vachinda?

 

4. Once every 6 months, a meeting between India and France at the strategic partnership level is held. This also reviews the Rafale deal process.

emi chestharu, tea -coffee tagi hi bye ani cheppukoni evaru illaki vallu vaelthara?

 

Link to comment
Share on other sites

Papam congress vallu pichola laga case lu vesaru 2g meeda ee pushpala laga judiciary system,media,cag parliament ni kuda bull doze cheyalani teliyaka poye aalaki chesi unte ippudu ee feku gadini mose gosa tappedi  ...next term cong will do the same dari chupincharu ga erri pushpalu  ..ippudu support chestuna pushpalu appudu kuda support chestaro leka kotha sollu cheputaro chudali ?

Link to comment
Share on other sites

రాఫెల్ వివాదం ఊహించని మలుపు... మరో బాంబు పేల్చిన రాహుల్...!
12-02-2019 13:10:43
 
636855742243841262.jpg
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న వివాదాస్పద రాఫెల్ ఒప్పందం రోజురోజుకు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తనవాదనకు తాజాగా మరింత పదును పెంచారు. ఇది కేవలం అవినీతికి సంబంధించిన విషయం మాత్రమే కాదనీ... ఈ ఒప్పందం సందర్భంగా ప్రధాని మోదీ ‘‘రాజద్రోహానికి’’ కూడా పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ ఒప్పందంపై సంతకాలు జరగక ముందే దీని గురించి రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీకి తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఈ ‘‘రాజద్రోహాన్ని’’ నిరూపించేందుకు తమ వద్ద ఈ మెయిల్ సైతం ఉందంటూ మీడియా ముందు ప్రదర్శించారు. అవినీతి, చర్చల ప్రక్రియ, దేశ భద్రతను పణంగా పెట్టడం సహా ఈ వ్యవహారంలోని మొత్తం మూడు అంశాలపై విచారణ జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు.
 
ఈ మెయిల్‌కి సంబంధించిన ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ట్విటర్లో పోస్టు చేశారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు కొద్ది రోజుల ముందు 2015 మార్చి 28న ఈ మెయిల్ పంపినట్టు కనిపిస్తోంది. యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీ ఎయిర్‌బస్‌కి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ పంపినట్టు భావిస్తున్న ఈమెయిల్‌లో... నాటి ఫ్రాన్స్ రక్షణ మంత్రి సహాయకుడితో తాను ఫోన్‌లో మాట్లాడినట్టు ఉంది. ఫ్రాన్స్ రక్షణ మంత్రి కార్యాలయానికి అనిల్ అంబానీ వెళ్లారనీ... ప్రధాని పర్యటనలో సంతకం చేయాల్సిన ఎంవోయూ (అవగాహన పత్రం) సిద్ధమవుతోందని ఫ్రాన్స్ మంత్రి సహాయకుడు తనతో చెప్పారని ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ ఆ ఈమెయిల్‌లో రాశారు.
 
వాస్తవానికి 2015 ఆగస్టు 10న ప్రధాని మోదీ తన ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఎంవోయూ గురించి ప్రకటించారు. దసో ఏవియేషన్ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనేందుకు భారత్ సుముఖంగా ఉందని వెల్లడించారు. దీనికి ముందే ఎంవోయూ గురించి అనిల్ అంబానీకి తెలియడం అంటే... కచ్చితంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమేనని రాహుల్ గాంధీ ఇవాళ పేర్కొన్నారు. ‘‘ఇకపై ఇది కేవలం అవినీతి కేసు మాత్రమే కాదు... ఇది రాజద్రోహం కేసు కూడా.... ప్రధానమంత్రి మోదీ ఓ గూఢచారి మాదిరిగా వ్యవహరించారు. ఈ ఒప్పందం సంగతి రక్షణ మంత్రి, హెచ్ఎఎల్, విదేశాంగ కార్యదర్శికి సైతం తెలియకుండా కేవలం అనిల్ అంబానీకి 10 రోజుల ముందే ఎలా తెలిసింది? ’’ అని రాహుల్ ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Another day Another lie from Rahul baba's lie factory

'Rafale' e-mail is an 'Airbus' e-mail: How Rahul Gandhi got it all wrong in this game of obfuscation

Rahul Gandhi's email 'expose' has no reference to Rafale; he just picked on the line "Mentioned a MoU in preparation and the intention to sign during the PM visit" as referring to the Rafale MoU.

https://www.businesstoday.in/opinion/business-wise/rafale-email-airbus-email-how-rahul-gandhi-got-wrong-in-this-game-of-obfuscation/story/318537.html

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రఫేల్‌ పత్రాలు చోరీకి గురయ్యాయి

సుప్రీంకోర్టుకు వెల్లడించిన ప్రభుత్వం

6brk-rafale.jpg

దిల్లీ: రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్‌ చిట్ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. రఫేల్‌ ఒప్పందం పత్రాలు చోరీకి గురయ్యాయని, దానిపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.

రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను ఇటీవల ‘ద హిందూ’ పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన కేకే వేణుగోపాల్‌.. ‘రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయి. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం.. ఇలాంటి పత్రాలు ఉంచుకోవడం నేరం. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు వెల్లడించాలని ఆదేశించారు. 

అంతకుముందు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపించారు. డిసెంబరు 14, 2018న రఫేల్‌పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రఫేల్‌ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాలు చేస్తూ వచ్చిన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌, అరుణ్‌ శౌరీ కూడా ఉన్నారు. ఈ పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.

 
Link to comment
Share on other sites

orini e data brach gola lo padi e gola evadu pattinchukoledu. are modi ga vadileyatainiki adi emina pellam anukunnava? asalu intha dikku malina thoughts etta vasthayi ra. thu nee brathuku cheda. papers ne kapada lenodivi desanni emi kapadathavu anta.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...