Jump to content

Kotla UTurn on joining TDP


fan no 1

Recommended Posts

పత్తికొండ, డోన్‌ మాకే!
06-02-2019 04:45:08
 
అలాగైతే కోట్ల చేరికకు ఓకే.. కేఈ కుటుంబం గ్రీన్‌సిగ్నల్‌
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల వైరం స్థానంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త స్నేహాలు చిగురించే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుటుంబం టీడీపీలో చేరడానికి ఆమోదం తెలపాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం నిర్ణయుంచుకున్నట్లు సమాచారం. కాకపోతే సుదీర్ఘ కాలంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్‌, పత్తికొండ అసెంబ్లీ సీట్లను కోట్ల కుటుంబానికి ఇవ్వరాదని.. వేరే చోట ఎక్కడ ఇచ్చినా వారిని గెలిపించి తీసుకువస్తామని కేఈ కుటుంబం చెబుతోంది. కోట్ల కుటుంబానికి, కేఈ మాదన్న (కృష్ణమూర్తి తండ్రి) కుటుంబానికి ఎంతో కాలంగా రాజకీయ వైరం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి వైదొలగి.. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండలో తన కుమారుడు శ్యాంను నిలపాలని కేఈ అనుకుంటున్నారు.
 
ఈ దశలో సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం చేరికకు తాను అడ్డుపడడం భావ్యం కాదని ఆయన నిర్ణయించుకున్నారు. డోన్‌, పత్తికొండ తప్ప కోట్ల కుటుంబానికి మరెక్కడ సీట్లిచ్చినా వారి కోసం పని చేసి గెలిపిస్తామని ఆయన ఆంతరంగిక సంభాషణల్లో టీడీపీ నేతలకు చెబుతున్నారు. కర్నూలు ఎంపీ సీటును సూర్యప్రకాశ్‌రెడ్డికి ఇవ్వడానికి ఆయన అభ్యంతరం చెప్పడం లేదు. వారికి అసెంబ్లీ సీటు ఇవ్వాల్సి వస్తే ఆలూరు ఇస్తే మంచిదని, అక్కడ ఒక మండలంలో తమకు కూడా పట్టుందని.. కోట్ల కుటుంబానికి మంచి మెజారిటీ అందించగలమని కేఈ అంటున్నారు. ఇవే విషయాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వివరించేందుకు మంగళవారం ఆయన తన సోదరులు, కుమారుడితో కలిసి ఆయన వద్దకు వెళ్లారు. ఆ సమయానికి చంద్రబాబు కోల్‌కతా వెళ్లే హడావుడిలో ఉండడంతో భేటీ కుదరలేదు. బుధ/ గురువారాల్లో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

డోన్‌ స్థానంపై కోట్ల కుటుంబం కన్ను.. వదులుకోవడానికి సిద్ధంగా లేని కేఈ సోదరులు
06-02-2019 10:57:41
 
636850474617448523.jpg
  • ముఖ్యమంత్రిని కలిసిన కేఈ సోదరులు
  • డోన్‌ స్థానంపై కోట్ల కుటుంబం కన్ను
  • అమరావతి వెళ్లిన డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ
  • కేఈ ప్రతాప్‌కే ఇవ్వాలని ప్రతిపాదన
  • సీఎం చంద్రబాబు కోల్‌కతా పర్యటనతో సమావేశం నేటికి వాయిదా
తమ సీట్ల విషయంలో జోక్యం చేసుకోకపోతే కోట్ల కుటుంబం టీడీపీలో చేరికపై ఎలాంటి అభ్యంతరం లేదని కేఈ సోదరులు చెబుతున్నట్లు తెలిసింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేఈ ప్రతాప్‌కే డోన్‌ టికెట్‌ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, డోన్‌ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ మంగళవారం అమరావతికి వెళ్లి సీఎంను కలిశారు. అయితే కోల్‌కతా పర్యటన ఉండడంతో బుధవారం కలవాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీఎంతో చర్చించాక డోన్‌ టికెట్‌ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
 
కర్నూలు,(ఆంధ్రజ్యోతి)/డోన్‌: ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ నిర్ణయాన్ని విభేదించిన కోట్ల కుటుంబం.. టీడీపీలో చేరేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా డోన్‌ అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి పడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే డోన్‌ టికెట్‌ తమకు ఇవ్వాలని కోట్ల కుటుంబం సీఎం వద్ద ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. దీంతో దీనిపై స్పష్టత కోసం కేఈ సోదరులు మంగళవారం అమరావతిలో చంద్రబాబును కలిశారు. సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఈ సమావేశంలో డోన్‌ అసెంబ్లీ టికెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 
 
డోన్‌పై కోట్ల కుటుంబం కన్ను?
కోట్ల కుటుంబం ఇటీవలను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించింది. అమరావతిలో సీఎం చంద్రబాబును గత నెల 28వతేదీన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి కలిశారు. టీడీపీలో చేరికపై చర్చించారు. కర్నూలు లోక్‌సభతో పాటు డోన్‌, ఆలూరు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా కేఈ ప్రతాప్‌ ఉన్నారు. డోన్‌ టీడీపీ టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు.
 
 
అందరి చూపు.. అమరావతి వైపు
డోన్‌ నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం అందరి చూపు.. అమరావతి వైపు పడింది. సీఎం చంద్రబాబును మంగళవారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు సోదరులు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ కలిశారు. వీరితోపాటు కేఈ తనయుడు, పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు, ముఖ్య కుటుంబ సభ్యులు అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత లంచ్‌ విరామ సమయంలో సీఎంతో మాట్లాడారు. అయితే తాను కోల్‌కత్తా వెళ్తున్నానని, బుధవారం అన్ని విషయాలు మాట్లాడుదామని సీఎం చెప్పినట్లు తెలిసింది. దీంతో సమావేశం వాయిదా పడింది.
 
 
వేడి పుట్టిస్తున్న రాజకీయం..
కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరికపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా డోన్‌, పత్తికొండ సీట్లపై కేఈ కుటుంబ సభ్యులు గట్టిగానే పట్టుబడుతున్నారు. కోట్ల టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ విషయం తనకు తెలియదని, సీఎం చంద్రబాబు తనతో చర్చించలేదని డిప్యుటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంతో కేఈ కుటుంబం భేటీ కానుండటంతో జిల్లా రాజకీయాలు అమరావతి వేదికపై వేడి రాజేశాయి.
 
 
నేడు తేలిపోయే అవకాశం
సీఎం చంద్రబాబును కలిసిన కోట్ల కుటుంబం కర్నూలు లోక్‌సభ, ఆలూరు, డోన్‌ అసెంబ్లీ స్థానాలు అడిగినట్లు తెలుస్తోంది. పత్తికొండ నుంచి డిప్యుటీ సీఎం కేఈ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన తనయుడు కేఈ శ్యాంబాబును బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాలుగున్నరేళ్లుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబం డోన్‌ టికెట్‌ ఆశించినా.. వదులు కోవడానికి కేఈ కుటుంబం సిద్ధంగా లేదు. నేటి సీఎం భేటీలో డోన్‌తోపాటు పత్తికొండలో తన కుమారుడికి అవకాశంపై కేఈ స్పష్టత కోరే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు డోన్‌, పత్తికొండ కేఈ కుటుంబానికి, కర్నూలు లోక్‌సభ, ఆలూరు అసెంబ్లీ స్థానాలను కోట్ల కుటుంబానికి కేటాయిస్తే పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని సీనియర్‌ నాయకులు అంటున్నారు. డోన్‌ టికెట్‌ ఉత్కంఠకు బుధవారం తెరపడే అవకాశం ఉంది. తమ సీట్ల విషయంలో జోక్యం చేసుకోకపోతే కోట్ల కుటుంబం చేరికపై అభ్యంతరం లేదని సీఎంకు స్పష్టత ఇవ్వాలని కేఈ సోదరులు ఉన్నట్లు తెలిసింది.
 
 
సుదీర్ఘ రాజకీయ వైరం
కేఈ, కోట్ల కుటుంబాల మధ్య సుదీర్ఘ రాజకీయ వైరం కొనసాగుతోంది. అయితే ఈ రెండు కుటుంబాలు పలు ఎన్నికల్లో కలిసి పనిచేశాయి. 1978, 1983, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి డోన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1977, 1980, 1989 లోక్‌సభ ఎన్నికల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. ఈ మూడు ఎన్నికల్లో కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1994 ఉప ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...