Jump to content

2345 crs deposited in banks by govt


Saichandra

Recommended Posts

ఇక డబ్బు తీసుకోండి 

04 Feb 19, 02:16 AM 

  • 36 బ్యాంకుల్లో రూ.2,345 కోట్లు జమ
  • వెలుగు సిబ్బందికి జమ సర్టిఫికెట్ల ప్రతులు
  • ‘పసుపు-కుంకుమ’పై ప్రభుత్వం జాగ్రత్తలు
  • కొత్తగా చేరిన సభ్యులకూ చెక్కులు
  • జనవరి 18 నాటికి చేరిన అందరికీ డబ్బు
  • స్తబ్దుగా ఉన్న సంఘాలకూ కానుక వర్తింపు
  • సభ్యులు చనిపోయినా చెల్లించాలి : సీఎం
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘పసుపు-కుంకుమ’ కింద డ్వాక్రా మహిళలకు ఇస్తున్న చెక్కుల్లో తొలి విడతకు అవసరమైన డబ్బు బ్యాంకులకు చేరింది. చెక్కుల పంపిణీకి ముందే రూ.2345కోట్లను మొత్తం 36 బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి ఆయా బ్యాంకు అధికారుల నుంచి తీసుకున్న సర్టిఫికెట్ల ప్రతులను వెలుగు సిబ్బందికి పంపారు. తమకు ఇంకా డబ్బు రాలేదని స్ధానికంగా ఉండే బ్యాంక్‌ మేనేజర్లు సాకులు చెప్పే అవకాశం లేకుండా వాటిని పంపినట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. డ్వాక్రా మహిళలకు మొత్తం మూడు చెక్కులు ఇస్తున్నారు. ఇందులో ఒకదాన్ని వెంటనే బ్యాంకులో వేసి డబ్బు తీసుకొనే అవకాశం కల్పించారు. మిగిలిన రెండు చెక్కుల్లో ఒకదానిపై మార్చి 8, రెండోదానిపై ఏప్రిల్‌ 5వ తేదీ వేశారు. ఆ తేదీలకు కొద్దిగా ముందుగా అవసరమైనంత డబ్బును బ్యాంకులకు అందిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘రాష్ట్రం మొత్తం మీద ఒక్క చెక్కు కూడా తిరస్కారం కాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. బ్యాంకులకు డబ్బు కూడా వెళ్లింది. శనివారం ఇచ్చిన చెక్కులను ఇప్పటికే కొందరు బ్యాంకుల్లో వేసుకొని నగదు తీసుకొన్నారు. అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు’ అని ఒక సీనియర్‌ అధికారి వెల్లడించారు.
 
 
కొత్తవారికీ కానుక
డ్వాక్రా సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు కూడా పసుపు-కుంకుమ కానుక వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కానుకపై విధాన నిర్ణయం తీసుకున్న జనవరి 18వ తేదీని కటా్‌ఫగా తీసుకొని ఆ రోజుకు సభ్యులుగా చేరినవారందరికీ రూ.పది వేల కానుక ఇవ్వనున్నారు. గత మూడు నాలుగు నెలల్లో కొత్తగా చేరినవారు దాదాపు 3లక్షల మంది ఉంటారని అంచనా. ప్రస్తుతం వారి ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. ఒక వారంలో వారికి కూడా ఈ కానుక అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం మరికొంత అదనపు నిధులు అవసరమైతే ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కాగా, డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిద్దరు చనిపోయినా చెక్కులు ఇవ్వడం ఆపొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సభ్యులు మరణించిన సంఘాలకు శనివారం కొన్నిచోట్ల చెక్కుల పంపిణీని నిలిపివేశారు. దీనిపై ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ ‘ఒకరిద్దరు సభ్యులు చనిపోతే మిగిలినవారికి కానుక ఆపాల్సిన అవసరం లేదు. చెక్కులు ఇచ్చేయండి. చనిపోయిన సభ్యుల పేరుమీద జారీ అయిన మొత్తం ఇతరులు తీసుకోకుండా జాగ్రత్త వహించండి. వాటిపై తర్వాత నిర్ణయిద్దాం’ అని సూచించారు. అలాగే ఏ కార్యకలాపాలూ లేకుండా స్తబ్దుగా ఉన్న సంఘాల సభ్యులకూ కానుక ఇవ్వాలని మరో నిర్ణయం తీసుకొన్నారు. దీనివల్ల ఆ సంఘాలు క్రియాశీలమై అందులోని సభ్యులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఆదివారం నాటికి పసుపు-కుంకుమ కింద 9.5లక్షల సంఘాలకు గాను 5.7లక్షల సంఘాలకు చెక్కులు జారీ చేశారు. ఒక్కో సంఘానికి మూడు పోస్ట్‌ డేటెట్‌ చెక్కులు ఇచ్చారు. ఇక పెరిగిన పింఛన్లు 54లక్షల మందికి వర్తిస్తుండగా అందులో 24,07,930మందికి ఒక్కొక్కరికి రూ.3వేలు చొప్పున బ్యాంకులో దాదాపు రూ.732కోట్లు డిపాజిట్‌ చేశారు. 
 
Link to comment
Share on other sites

పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఆడుకోమని వైసిపి నాయకులకు ఎవరు సలహాలు ఇచ్చారో గాని వారు స్వయంగా చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసి నట్టు అయింది .
తమకు డబ్బులు వస్తున్నాయి దాన్ని వైసిపి వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే భావన మహిళల్లో కి బాగా వెళ్ళింది అది చాలు వారి సమాధి వారు తవ్వుకున్నాటున్నారు అనడానికి.

Link to comment
Share on other sites

2 hours ago, Saichandra said:

పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఆడుకోమని వైసిపి నాయకులకు ఎవరు సలహాలు ఇచ్చారో గాని వారు స్వయంగా చంద్రబాబు నాయుడు నెత్తిన పాలు పోసి నట్టు అయింది .
తమకు డబ్బులు వస్తున్నాయి దాన్ని వైసిపి వాళ్ళు అడ్డుకుంటున్నారు అనే భావన మహిళల్లో కి బాగా వెళ్ళింది అది చాలు వారి సమాధి వారు తవ్వుకున్నాటున్నారు అనడానికి.

:bhangra:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...