Jump to content

Distribution of Pensions & Pasupu - Kumkuma Cheques


sonykongara

Recommended Posts

ఈ పెద్దావిడ ఇంట్లో వాళ్లకు దూరంగా ఒక ఆశ్రమంలో తన జీవనం సాగిస్తోంది.మందుల ఖర్చులకు,బట్టల ఖర్చులకు మరియు రోజు పప్పు చారు తినలేక ఏదైన బయట తినాలని అనిపించినప్పుడు పెన్షన్ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వినండి మిత్రులారా.నిజంగా ఇటువంటి వృద్ధులను చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.నిజంగా ఇటువంటి వారికి ఎన్టీఆర్ భరోసా నిజమైన భరోసా కలిగిస్తుంది.

Link to comment
Share on other sites

1 hour ago, Saichandra said:

ఈ పెద్దావిడ ఇంట్లో వాళ్లకు దూరంగా ఒక ఆశ్రమంలో తన జీవనం సాగిస్తోంది.మందుల ఖర్చులకు,బట్టల ఖర్చులకు మరియు రోజు పప్పు చారు తినలేక ఏదైన బయట తినాలని అనిపించినప్పుడు పెన్షన్ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వినండి మిత్రులారా.నిజంగా ఇటువంటి వృద్ధులను చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.నిజంగా ఇటువంటి వారికి ఎన్టీఆర్ భరోసా నిజమైన భరోసా కలిగిస్తుంది.

Very happy to hear her words. God bless her and also CBN

Link to comment
Share on other sites

5 hours ago, Saichandra said:
ఈ పెద్దావిడ ఇంట్లో వాళ్లకు దూరంగా ఒక ఆశ్రమంలో తన జీవనం సాగిస్తోంది.మందుల ఖర్చులకు,బట్టల ఖర్చులకు మరియు రోజు పప్పు చారు తినలేక ఏదైన బయట తినాలని అనిపించినప్పుడు పెన్షన్ డబ్బులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వినండి మిత్రులారా.నిజంగా ఇటువంటి వృద్ధులను చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.నిజంగా ఇటువంటి వారికి ఎన్టీఆర్ భరోసా నిజమైన భరోసా కలిగిస్తుంది.

votes/politics pakkana pedithe ilanti vallaki entho mandiki food dorukutundi anedi :super:

Link to comment
Share on other sites

Sreeram expressed it perfectly.

CBN worked hard for this. He's not going to make the same mistake handing this over to bandits ... 

I have no qualms with his programs.

Remember 2004? You should.

padellu nana kasthalu padi develop chesthe ... donga lanjakodulu antha dochuku denkaru ... 

laksha kotlu ... muddi kinda vesukoni thiruguthunnadu aa jagan gadu ... 

CBN might as well distribute whatever wealth he created so far ... if you don't like it, shove it ... because that's how he's going to do things ... 

 

Link to comment
Share on other sites

1 hour ago, minion said:

Sreeram expressed it perfectly.

CBN worked hard for this. He's not going to make the same mistake handing this over to bandits ... 

I have no qualms with his programs.

Remember 2004? You should.

padellu nana kasthalu padi develop chesthe ... donga lanjakodulu antha dochuku denkaru ... 

laksha kotlu ... muddi kinda vesukoni thiruguthunnadu aa jagan gadu ... 

CBN might as well distribute whatever wealth he created so far ... if you don't like it, shove it ... because that's how he's going to do things ... 

 

 

Link to comment
Share on other sites

vallu okemata chepparu ... pillaru puttaru,vallaki pillaru puttaru ... vallake vesulubatu ledu nannem chusukuntaru ... nene sardukupothunna ... 

appude nirnainchukunna ... meeku pedda dikku ga undalani ... meeku pedda kodukuga undalani ... 

There is something in him ... 

Link to comment
Share on other sites

5 hours ago, minion said:

Sreeram expressed it perfectly.

CBN worked hard for this. He's not going to make the same mistake handing this over to bandits ... 

I have no qualms with his programs.

Remember 2004? You should.

padellu nana kasthalu padi develop chesthe ... donga lanjakodulu antha dochuku denkaru ... 

laksha kotlu ... muddi kinda vesukoni thiruguthunnadu aa jagan gadu ... 

CBN might as well distribute whatever wealth he created so far ... if you don't like it, shove it ... because that's how he's going to do things ... 

 

బాగా చెప్పావు. ఆయన కష్టాన్ని ఆయన పంచటంలో తప్పేమీ లేదు. 

Link to comment
Share on other sites

మీ కోసం శ్రమించా.. నా కోసం కష్టపడండి 

 

ఈ 75 రోజులు కేటాయించండి 
భాజపా, వైకాపాలకు బుద్ధి చెప్పాలి 
మీకు చేసే సాయం రుణం కాదు.. తిరిగి చెల్లించాల్సిన పని లేదు 
కేసరపల్లి పసుపు-కుంకుమ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

2ap-main3a_2.jpg

ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ‘నాలుగున్నరేళ్లు మీకోసం కష్టపడ్డాను.. 75రోజులు నా కోసం కేటాయించి కష్టపడండి...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను కోరారు. ‘మహిళలకు తగిన గుర్తింపు, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని డ్వాక్రా సంఘాలు పెట్టాను. వారికి పసుపు-కుంకుమ పథకం కింద మూడు విడతల్లో రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. మేం ఉచితంగా ఇస్తున్న సొమ్మును కొందరు రుణమని దుష్ప్రచారం చేస్తున్నారు.   అది నిజం కాదు. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆర్థిక సాయం చేస్తున్నాం. మహిళలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మూడు చెక్కులను ఈ నెలలో రూ.2,500, మార్చి 8న రూ.3,500, ఏప్రిల్‌ 5న రూ.4వేలు చొప్పున ఇస్తున్నాం. కొంతమంది మహిళలు వారికి ఇచ్చే పింఛనును కూడబెట్టి రాజధానికి విరాళంగా ఇస్తుంటే.. కేంద్రం సాయం చేయకుండా మనల్ని విమర్శిస్తోంది...’ అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లిలో శనివారం నిర్వహించిన పసుపు-కుంకుమ సంబరం, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వం వ్యయం రూ.6,720 కోట్ల నుంచి రూ.13,440 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 26,769 మందికి చంద్రన్న పెళ్లికానుక ద్వారా రూ.114 కోట్లు అందజేశాం. శ్రామికులకు ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లు,  బీసీలకు 21 కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం. ఈనెల 9న ఒకేరోజు నాలుగు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేపట్టి ప్రపంచచరిత్రలో నిలవనున్నాం. పట్టిసీమను పూర్తి చేసి రైతులకు నీరిచ్చాం. చంద్రన్నబాటలో సీసీ రోడ్లు వేశాం. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవ్వరూ చేయని సాహసం చేశా. రూ.50 వేల కోట్ల విలువైన 34 వేల ఎకరాల భూమిని నాపై ఉన్న నమ్మకంతోనే రైతులు ఉచితంగా ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాటిని అభివృద్ధి చేసి ఇచ్చా. ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. అయితే... తెదేపా ఓడిపోతే మా పరిస్థితి ఏమిటని కొందరు పెట్టుబడిదారులు అడిగారు. తెదేపా ఓడిపోదు. మీ పెట్టుబడులు ఎక్కడికీ పోవని వారికి భరోసా ఇచ్చాను...’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

2ap-main3b_1.jpg

తప్పుడు సర్వేలతో మభ్యపెడుతున్నారు 
‘కొందరు సర్వేలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రిగా మళ్లీ మీరే రావాలి అంటుంటే.. వైకాపా నేతలు తామే గెలుస్తామని పగటి కలలు కంటున్నారు. ప్రజా సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగిలే పార్టీలు మనకు అవసరమా? నిరంతరం మీకోసం కష్టపడిన అన్నకు అండగా ఉంటారా?...’ అని సీఎం చంద్రబాబు అడిగారు. ‘రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రానికి ఎవరూ సహకరించవద్దు. కేంద్రం నుంచి రూ.80 వేల కోట్లు రావాల్సి ఉందని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి నాటకం ఆడుతున్నారు. రాష్ట్రంలో ఇక భాజపా ఆటలు సాగనివ్వకండి. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించి.. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలి. కుట్రలు, కుతంత్రాలు చేసిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అందుకే కలిసి పనిచేస్తున్నాం...’ అని చంద్రబాబు వివరించారు.  కార్యక్రమంలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, అధికారులు పాల్గొన్నారు.

 

 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

పసుపు-కుంకుమ సంబరం

 

సంప్రదాయ వేడుకలా సాగిన చెక్కుల పంపిణీ
భారీగా హాజరైన డ్వాక్రా మహిళలు
ర్యాలీలు, పాలాభిషేకాలు, బాణసంచా చప్పుళ్లతో పండగ

2ap-main9a_2.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: స్వయంసహాయక సంఘ మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం శనివారం చేపట్టిన రెండో విడత పసుపు-కుంకుమ సాయం పంపిణీ సంబరం అంబరాన్ని తాకింది. గ్రామగ్రామాన పండగ వాతావరణంలో చెక్కుల పంపిణీ సాగింది. సభావేదికల వద్ద రంగవల్లులు, పూలతోరణాలు, కోలాటాలు, చెక్కభజనలతో హడావుడి కనిపించింది. ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించారు. బాణసంచా పేలుళ్లు వినిపించాయి. డ్వాక్రా మహిళలు భారీగా హాజరై ఎన్టీఆర్‌ విగ్రహానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ‘చంద్రన్న నిన్ను మరవం’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఇంట శుభకార్యానికి వచ్చిన మహిళలను గౌరవించే విధంగా ప్రతి డ్వాక్రా సభ్యురాలికి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలమిచ్చి పల్లెంలో పూలు, స్వీట్‌, హాట్‌తోపాటు సాయం చెక్కుకు, ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని జత చేసి ఇచ్చారు. కొన్ని చోట్ల చీరె, రవికెలు, గాజులు, పండ్లు కూడా ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు భోజనాలు పెట్టించారు. శుక్రవారమే సంఘ నాయకురాళ్లు సభ్యుల ఇళ్ల వద్దకెళ్లి మహిళల నుదుట బొట్టు పెట్టి వేడుకకు ఆహ్వానించారు.

2ap-main9b_1.jpg

పంపిణీ ఇలా.....
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండలాలను మూడు క్లస్టర్లగా విభజించి పంచాయతీలవారీగా చెక్కుల పంపిణీని ప్రారంభించారు. ఆయా పంచాయతీల్లో సభలు ఏర్పాటుచేసి పదిమంది సభ్యులున్న సంఘాన్ని ప్రాతిపదికగా తీసుకుని చెక్కులనందించారు. పంపిణీ పర్యవేక్షణకు మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలోని పంచాయతీల్లో ఒక్కోరోజు పాటు 2, 3, 4 తేదీల్లో చెక్కులనిస్తారు. పట్టణాల్లో వార్డులవారీగా ఇస్తారు. గత ఆరు నెలల్లో కొత్తగా డ్వాక్రా సంఘాల్లో చేరిన నాలుగు లక్షల మంది సభ్యుల వివరాలు సెర్ప్‌ డేటాబేస్‌లో నమోదు కానట్లు గుర్తించిన అధికారులు ఒక్క రోజులోనే (జనవరి 31) నమోదు చేయించి చెక్కులు సిద్ధం చేశారు.

* కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత మహిళలకు చెక్కులనిచ్చారు.

* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మూడువేల మందికిపైగా డ్వాక్రా మహిళలు రెండు కి.మీ.మేర భారీ ర్యాలీ నిర్వహించారు.

2ap-main9d.jpg

 

 

 

చెక్కులు అందె..ఆనందం వెల్లివిరిసె..

2ap-main9c_1.jpg

శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వయంసహాయక సంఘాల మహిళలకు పసుపు-కుంకుమ రెండో విడతకు సంబంధించిన చెక్కులు అందించారు. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించారు. ఈ క్రమంలో చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని దొడ్డిపల్లి గ్రామంలో జరిగిన సభలో.. స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలకు నగదు పంపిణీకి సంబంధించి చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అనంతరం వాటిని ఆయా మహిళలు ఇలా చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు.   

 -ఈనాడు, చిత్తూరు

 

తెదేపా, వైకాపా అనుచరుల మధ్య ఘర్షణ

చంద్రగిరి, న్యూస్‌టుడే: పసుపు-కుంకుమ పథకంలో భాగంగా మహిళా సంఘాలకు చెక్కులు, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శనివారం తెదేపా, వైకాపా నేతలు ఘర్షణకు దిగారు. ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు, లబ్ధిదారులు హాజరయ్యారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు పాఠశాల ప్రాంగణంలోనే మరో టెంట్‌ వేసుకుని మహిళా సంఘసభ్యులకు పసుపు-కుంకుమ పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టడంతో.. ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘర్షణలో వైకాపా నాయకుడు శివశంకర్‌రెడ్డికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. కొందరు వైకాపా కార్యకర్తలు సోషల్‌ మీడియాలో తెదేపా నాయకుల్ని దూషిస్తూ పోస్టింగ్‌లు పెట్టడంతో రెడ్డివీధి కూడలిలో వారి మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుంది. సీఐ ఈశ్వరయ్య అక్కడికి చేరుకోవడంతో వైకాపా నాయకులు పారిపోయారు. పలువురు స్థానిక తెదేపా నాయకులను పోలీసులు చితకబాదారు. దీంతో తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని కూడలిలో ఆందోళన చేపట్టారు. వైకాపా నాయకుల్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...