Jump to content

ఆ జనసేన “ఆశావహ అభ్యర్థి” హంతకుడు…! పోలీసులు పట్టేశారు..!


sonykongara

Recommended Posts

ఆ జనసేన “ఆశావహ అభ్యర్థి” హంతకుడు…! పోలీసులు పట్టేశారు..!

 
February 1, 2019
 
 
 
 
Janasena.jpg?resize=600%2C400&ssl=1
 

ఆయనో డాక్టర్. ఓ మరుమూల ప్రాంతంలో.. మల్టి స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి వైద్య సేవలందిస్తున్నారు. సేవాగుణం మెండుగా ఉంది కాబట్టి… జనసేనలోనూ పని చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నాయకుడిగా.. అనేక కార్యక్రమాలు చేపట్టారు. పవన్ ను కలిసి.. టిక్కెట్ కోసం ఓ దరఖాస్తు కూడా ఇచ్చేశారు. .. ఇది ఆ “ఫ్రంట్ సైడ్” కనిపించే మ్యాటర్..! ..

మరి తెర వెనుక ఉండేదేమిటి..? … డాక్టర్ వెంకటరమణ.. మనుషుల ప్రాణాల్ని కాపాడరు..తీస్తారు. అంటే మర్డర్ చేస్తారన్నమాట.. చేస్తారు కాదు.. చేశారు కూడా. పరిచయం అయిన వివాహితతో లైంగిక బంధం పెట్టుకుని… దానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి… ఆమె సాయంతోనే… ప్లాన్డ్ గా చంపించేశారు. చివరికి దొరికిపోయారు. కటకటాల వెనక్కి వెళ్లారు.

 

Janasena1.jpg?resize=200%2C400&ssl=1ప్రకాశం జిల్లా కంభంలో డాక్టర్ బాల వెంకటరమణ అనే డాక్టర్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఆస్పత్రి వెనుకాల జగన్మోహన్ రెడ్డి అలియాస్ జగన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అక్కడ జరిగిన పరిచయం కారణంగా.. జగన్ భార్యతో వెంకటరమణ వివాహేతర బంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి.. జగన్మోహన్ రెడ్డి భార్యను హెచ్చరించారు. భర్తకు తెలిసిపోయిందని.. ఆ మహిళామణి ఈ జనసేన నేతతో కలిసి.. భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ జనసేన నేత.. తన డాక్టరీ అనుభవంతో మత్తు మందు ఇచ్చి.. శ్రీశైలం వైపు అడవుల్లోకి తీసుకెళ్లి.. జగన్మోహన్ రెడ్డిని పైకి పంపించేశారు. హత్య చేసిన తర్వాత నేరుగా… జగన్మోహన్ రెడ్డి ఇంటికే వచ్చి… ఆయన భార్యతో గడిపి వెళ్లారు. చాలా ప్లాన్డ్ గా చేసినప్పటికీ.. ఓ చోట సీసీ కెమెరాల్లో… జనసేన నేత వెంకటరమణ .. జగన్‌ను తీసుకెళ్లడం రికార్డయింది. దాంతో పోలీసులు డొంక కదిలించారు.

జనసేన పేరుతో… గిద్దలూరులో.. డాక్టర్ వెంకటరమణ చాలా హడావుడి చేసేవారు. తానే అభ్యర్థి అన్నంతగా చెలరేగిపోయేవారు. ఇతర నేతలు ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్‌తో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ.. కొన్ని ఫోటోలతో ..భారీగా ఫ్లెక్సీలు వేయించారు. ఇప్పుడీ ఘటనతో… గిద్దలూరులో జనసేనకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. గతంలోనూ.. అనేక సార్లు జనసేన నేతలుగా చెలామణి అవుతూ… అక్రమాలకు పాల్పడిన కేసులు వెలుగు చూశాయి. జనసేనాధినేత ఇలాంటి వాళ్లను పార్టీలోనే ఉంచితే ఇబ్బంది తప్పదేమో..?

Link to comment
Share on other sites

ఒంగోలు జిల్లా: ప్రియుడి మోజులో పడి మెగుడ్ని కడతేర్చింది ఓ భార్య. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిందీ ఘటన. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన రజనీ... తన భర్త జగన్మోహన్‌రెడ్డిని అతి కిరాతకంగా హత్య చేయించింది. హత్యలో ప్రధాన నిందితుడు రజనీ ప్రియుడు డాక్టర్ వెంకట నారాయణగా పోలీసులు తేల్చారు. కంభంలో వెంకటనారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. రజనీ, జగన్మోహన్‌రెడ్డి అతని కస్టమర్లు. కొంతకాలంగా రజనీతో అక్రమసంబంధం పెట్టుకున్న వెంకట నారాయణ... రజనీ సహకారంతో హత్యకు ప్లాన్‌ చేశాడు. ఇందుకు కిరాయి హంతకులకు పదిలక్షలు ఇచ్చినట్టు తేల్చారు. పథకం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి... ఆత్మకూరు ఫారెస్ట్‌కు తీసుకెళ్లి చంపేశారు. విచారణలో రజనీని జగన్‌మెహన్‌రెడ్డిని చంపి పడేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ శవం చూసి ఆమె నవ్వడం పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.

Link to comment
Share on other sites

అక్కడ శవం చూసి ఆమె నవ్వడం పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.

 
Ore simbu please do sequel to manmatha fdfs choosta artam kakPoyina
Link to comment
Share on other sites

10 minutes ago, John said:

అక్కడ శవం చూసి ఆమె నవ్వడం పోలీసుల్ని సైతం ఆశ్చర్యపరిచింది.

 
Ore simbu please do sequel to manmatha fdfs choosta artam kakPoyina

mogudu sontha bava anta

Link to comment
Share on other sites

జయరాం హత్య కేసులో మహిళ అరెస్టు

jayaram-case.jpg

నందిగామ : కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిఖా చౌదరి అనే మహిళను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. జయరాం హత్య కేసులో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. జయరామ్‌కు బంధువు, వ్యాపార భాగస్వామి అయిన శిఖా చౌదరిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుమార్జిన్‌ దిగి ఉన్న ఆయన కారు(ఏపీ16ఈజీ 0620)లో గురువారం అర్ధరాత్రి మృతదేహం కనిపించింది. వాహనంలో ఒక్కరే ఉండటం, డ్రైవర్‌ లేకపోవటం, మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

 

Link to comment
Share on other sites

చిగురుపాటి జయరామ్‌పై విష ప్రయోగం?
02-02-2019 12:01:15
 
636847056767071240.jpg
హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్‌పై విష ప్రయోగం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృత దేహం నీలం రంగులోకి మారడంపై పోలీసులు దృష్టి సారించారు. శాంపిల్స్‌ను ఫోరన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జయరామ్ ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మృతి చెందినప్పటి నుంచి కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయినట్లు సమాచారం. దీంతో పోలీసులు జయరామ్ కుటుంబసభ్యులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు.
 
జయరామ్ హత్య అటు ఏపీ, ఇటు తెలంగాణలో కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం గ్రామం శివారులో 65వ నెంబరు జాతీయరహదారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున జయరామ్ మృత దేహం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆయన కారు డ్రైవర్ సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరామ్.. భార్య పద్మజా ఇద్దురు పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఆయనకు బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. కృష్టాజిల్లా కేంద్రంగా ఏర్పాటైన కోస్టల్ బ్యాంక్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ టీవీ ప్రారంభించి మీడియా రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆ ఛానల్ మూతపడింది.
Link to comment
Share on other sites

జనసేన టికెట్ ఆశిస్తున్న ఈ డాక్టర్ చేసిన పాడు పని చూడండి!
02-02-2019 12:18:47
 
636847067287439769.jpg
  • కట్టుకున్న వాడినే మట్టుబెట్టించింది!
  • ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేయించిన భార్య
  • జగన్‌మోహన్‌రెడ్డి కిడ్నాప్‌ వ్యవహారం విషాదాంతం
  • కంభంలో కారులోనే మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చిన డాక్టర్‌ నారాయణ
  • అనంతరం గొంతు నులిమి చంపిన దుండగులు
  • నల్లమలలోని రోళ్లపెంట వద్ద లోయలో మృతదేహం
  • కర్నూలు జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌, కిరాయి హంతకుల ప్రమేయం
కంభం/ఒంగోలు : కంభంలో కలకలం రేపిన వ్యాపారి జగన్మోహన్‌రెడ్డి (36) కిడ్నాప్‌ వ్యవహారం విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు శ్రీశైలం అడవుల్లో రోళ్లపెంట వద్ద గుర్తించారు. జగన్‌మోహన్‌రెడ్డి భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టి నట్లు తెలుస్తోంది. అతడికి కంభంలో కారులోనే మత్తు ఇంజె క్షన్‌ ఇచ్చి ఆ తర్వాత గొంతు నులిమి చంపినట్లు తెలిసింది. అనంతరం మృతదేహాన్ని శ్రీశైలం ఘాట్‌రోడ్డుకు తరలించి రోళ్లపెంట వద్ద లోయలో పడేశారు. ఇందులో కర్నూలు జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌, ముగ్గురు కిరాయి హంతకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
 
 
అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన జగన్మోహన్‌రెడ్డికి బేస్తవారపేట మండలం చిన్నఓబినేనిపల్లికి చెం దిన రజనితో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా కంభం వచ్చి స్థిరపడ్డారు. జేసీబీలు, ట్రాక్టర్లు, డోజర్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం ప్రారంభించాడు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. బుధవారం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించగా అవాక్కయ్యే అనేక నిజాలు వెలుగు చూశాయి.
 
 
జగన్మోహన్‌రెడ్డిని భార్య రజని ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమా చారం. కంభం వచ్చిన తర్వాత రజనికి ఎల్‌. కోట గ్రామానికి చెంది, పట్టణంలో వైద్యశాల నడుపుతున్న డాక్టర్‌ బాల వెంకటనారాయణ అలియాస్‌ నారాయణతో పరిచయం ఏర్ప డింది. ఇంటర్మీడియట్‌ ఇద్దరూ కలిసి కంభంలో చదువుకున్న ట్లు తెలిసింది. ఆ పరిచయంతో ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న జగన్మోన్‌రెడ్డి భార్యను మందలించినట్లు సమాచారం. దీంతో వారి మధ్య గొడవలు పెరిగాయి. దీంతో భర్తను అడ్డు తొలిగించుకోవాలని రజని నిర్ణయించుకుంది. ప్రియుడు డాక్టర్‌ నారాయణతో కలిసి భర్త జగన్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
 
 
పథకం ప్రకారం హత్య
జగన్‌మోహన్‌రెడ్డి హత్య పథకం ప్రకారం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. రూ. 15లక్షలకు సుపారీ కు దుర్చుకున్న కానిస్టేబుల్‌ మంగళవారం ముగ్గురు కిరాయి హం తకులతో కంభం వచ్చాడు. అక్కడి రెస్టారెంట్‌లో పీకలదాకా తాగారు. రాత్రి 11.30 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్‌ తన గుర్తింపు కార్డు చూపి నీతో మాట్లాడేందుకు పోలీసు అధికారి కారులో వచ్చాడని నమ్మబలికి బయటకు తీసుకువచ్చాడు. అతను కారు వద్దకు వచ్చిన తర్వాత లోపల ఉన్న వైద్యుడితోపాటు, ముగ్గురు కిరాయి హంతకులు జగన్‌మోహన్‌రెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించారు. లోపల ఉన్న వారు ఆయన్ను గట్టిగా పట్టుకోగా డాక్టర్‌ నారాయణ మత్తు ఇంజక్షన్‌ ఇచ్చినట్లు తెలిసింది. జగన్‌ మత్తులోకి జారుకోగానే గొంతునులిపి చంపినట్లు సమాచారం.
 
 
నల్లమల లోయలో మృతదేహం
కంభంలో జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేసిన నిందితులు కారులోనే మృతదే హాన్ని తీసుకుని దోర్నాలలోని కర్నూలు రోడ్డుకు వెళ్లారు. అక్కడి రోళ్లపెంట వద్ద కారును ఆపి 50 అడుగుల లోయలో మృతదేహాన్ని పడేసి కర్నూలు వెళ్లిపోయారు. ఈ హత్యకు వ్యూహం రచించిన డాక్టర్‌ను, మృతుడి భార్యను బుధవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం కర్నూలు నుంచి కానిస్టేబుల్‌ను కంభం తీసుకువచ్చారు. అత ని సహకారంతో శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం కోసం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన నాగులవరం తీసుకువచ్చి అంత్యక్రియలు చేయనున్నట్లు తెలిసింది.
 
 
నారాయణది మొదటి నుంచీ వక్రబుద్ధే!
కంభం మండలం ఎల్‌.కోట గ్రామానికి చెందిన డాక్టర్‌ బాలవెంకటనారాయణది వక్రబుద్ధి అని తెలుస్తోంది. డాక్టర్‌ పట్టా పుచ్చుకున్నాక కంభం ప్రభుత్వ వైద్యశాలలో చేరిన ఆయన అక్కడ ఒకరిద్దరు నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించి చీవాట్లు తిన్నట్లు సమాచారం. అనంతరం గుంటూరులోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో చేరి అక్కడ కూడా మహిళా పేషెంట్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించి దేహశుద్ధి చేయించుకుని పరారై ఒంగోలు చేరినట్లు తెలిసింది. అయితే డాక్టర్‌ నారాయణ భార్యకు మంచి వైద్యురాలిగా, సర్జన్‌గా పేరు ఉండటంతో దాన్ని ఉపయో గించుకొని కంభంలో మల్టీస్పెషాలిటీ వైద్యశాలను ప్రారంభించాడు. అయితే తన బుద్ధి మార్చుకోని డాక్టర్‌ వైద్యశాలలో పని చేసే మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. బుద్ధిగా ఉంటానని చెప్పి పది రోజుల క్రితమే ఆమెను తిరిగి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ తరఫున గిద్దలూరు నుంచి టికెట్టు ఆశిస్తున్న డాక్టర్‌ నారాయణ విస్తృత ప్రచారం చేస్తున్నాడు. మన సేవా చారిటబుల్‌ ట్రస్టు పేరుతో పేదలకు సహాయం చేస్తున్నట్లు చెప్పు కుంటున్న ఆయన వికృతబుద్ధి ఇప్పుడు బయటపడింది.
 
 
గిద్దలూరు సీఐ పర్యవేక్షణలో భారీ బందోబస్తు
కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల్లో మంచి వ్యాపారిగా పేరొందిన జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు గురైనట్లు తేల డంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కంభంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గిద్దలూరు సీఐ వి. శ్రీరామ్‌ పర్యవేక్షణలో కొమరోలు, అర్ధవీడు ఎస్‌ఐలు, 20 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 20 మంది హోంగార్డులు శాంతిభద్రతల్లో నిమగ్నమయ్యారు.
 
 
హత్యకు రూ. 15లక్షల కిరాయి
జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు డాక్టర్‌ నారాయణ కర్నూలుకు చెందిన హంతకులతో రూ. 15లక్షలకు కిరాయి కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ కానిస్టేబుల్‌ కీలకపాత్ర పోషించాడు. జగన్‌మోమన్‌రెడ్డిని అంతమొందించాలని నిర్ణయించుకున్న డాక్టర్‌ నారాయణ తొలుత కర్నూలు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తన సమీప బంధువును కంభం పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. కిరాయి హంతకులు తనకు బాగా తెలుసని, రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుందని ఆ కానిస్టేబుల్‌ చెప్పగా ఆ మొత్తం ఇచ్చేందుకు డాక్టర్‌ అంగీకరించాడు. ఆతర్వాత ఆ కానిస్టేబుల్‌ రంగంలోకి దిగాడు.
 
 
గతంలోనూ హత్యకు ప్రయత్నం
డాక్టర్‌ నారాయణ, రజనిలు గతంలోనూ జగన్‌మోహన్‌రెడ్డి హత్యకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం కంభం వచ్చిన ఆరంభంలో నారాయణ నడుపుతున్న వైద్యశాల వెనుక వైపు ఉండేవారు. ఆ సమయంలో రజనికి, అతనికి పరిచయం ఏర్పడింది. ఇది తెలియని జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ నారాయణతో సన్నిహితంగా ఉండేవాడు. అనారోగ్యంగా ఉంటే ఆయన వద్దే చూయించుకునే వాడు. దీన్ని ఆసరా చేసుకుని నారాయణ మత్తుకు సంబంధించిన టాబ్లెట్లు ఇవ్వగా రజని రోజూ వాటిని జగన్‌మోహన్‌రెడ్డితో మింగించేది. ఇలా డోస్‌ పెంచుతూ ఇవ్వడంతో నారాయణరెడ్డి గతంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఒంగోలులోని వైద్యశాలలో చికిత్స పొందాడు. ఆతర్వాత విషయం తెలుసుకుని నారాయణకు దూరంగా ఉంటున్నాడు.
 
 
నిందితులను కఠినంగా శిక్షిస్తాం
కంభంకు చెందిన జగన్‌మో హన్‌రెడ్డి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. కర్నూలు నుంచి మార్కాపురం వస్తున్న ఆయన జగన్‌ మోహన్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం సీఐలు శ్రీధర్‌రెడ్డి, మారుతీకృష్ణ, దోర్నాల ఎస్సై సుబ్బారావు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు.
Link to comment
Share on other sites

14 minutes ago, sonykongara said:
జయరాం హత్య కేసులో మహిళ అరెస్టు

jayaram-case.jpg

నందిగామ : కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం (55) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శిఖా చౌదరి అనే మహిళను కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. జయరాం హత్య కేసులో 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నాయి. జయరామ్‌కు బంధువు, వ్యాపార భాగస్వామి అయిన శిఖా చౌదరిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయరహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుమార్జిన్‌ దిగి ఉన్న ఆయన కారు(ఏపీ16ఈజీ 0620)లో గురువారం అర్ధరాత్రి మృతదేహం కనిపించింది. వాహనంలో ఒక్కరే ఉండటం, డ్రైవర్‌ లేకపోవటం, మృతదేహం పడి ఉన్న తీరును బట్టి హత్యగా భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

 

Lady sikha chowdary model lekka untadi

Link to comment
Share on other sites

ఆ టీవీ ఛానల్ చైర్మన్ మర్డర్ కేసులో వైసీపీ నేత ఉన్నారా..? పోలీసులేం చెబుతున్నారు..?

 
 
 

ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఓ వైసీపీ నేత పేరు ప్రముఖంగా బయటకు వస్తోంది. నెంబర్ టూ గా ప్రసిద్ధి చెందిన ఆ నేతను చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యే ముందు.. చివరి సారిగా కలిశారు. జనవరి 30న జూబ్లిహిల్స్ లోని హోటల్ దసపల్లాలో..ఈ భేటీ జరిగింది. అక్కడ ఎక్స్‌ప్రెస్ టీవీ గురించిన చర్చలను కొందరు వ్యక్తులతో జరిపినట్లు చెబుతున్నారు. దసపల్లా హోటల్ లో ఓ మహిళా యాంకర్ పేరుతో.. రూమ్ బుక్ చేశారు. దాదాపుగా వారం రోజుల పాటు .. మహిళా యాంకర్ పేరు మీదనే ఉందని చెబుతున్నారు. ఆ రూమ్ లోనే కొంత మందితో జయరాం చర్చలు జరిపారని అనుమానిస్తున్నారు. ఆ రూమ్ మిస్టరీ ఏమిటో తేలితే.. కేసు తేలిపోతుందని పోలీసులు భావిస్తున్నారు.

jaya-prakesh.jpg

 

జయరాం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి నుంచి జనవరి 30వతేది మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లారు. నేరుగా దసపల్లా హోటల్ కు వెళ్లారు. అదే రోజు రాత్రి విజయవాడకు బయలుదేరారు. ఈ మధ్యలో.. దసపల్లా హోటల్ కు తన సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకున్నారని పోలీసులు గుర్తించారు..ఆ వ్యక్తి ఆరులక్షల రూపాయలు తీసుకుని వచ్చి జయరాంకు అప్పగించారు. హఠాత్తుగా జయరాం ఆరు లక్షల రూపాయలను ఎందుకు తెప్పించుకున్నారు? ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ysrcp2-2.jpg

జయరాంను హత్య చేసిన వ్యక్తులు హైదరాబాద్ కు చెందిన వారేనని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ప్రాధమికంగా జయరాం మేనకోడలు శిఖా చౌదరినే ఈ కేసులో ప్రధాన అనుమానితురాలని పోలీసులు ఓ అంచనాకు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జయరాంతో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న మేనకోడలు శిఖా చౌదరినే పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆర్ధిక వ్యవహరాలకు సంబంధించి అకౌంటెంట్ వేణు ను కూడా పోలీసులు ప్రశ్నించారు .శిఖా నోరు విప్పితే చాలా విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.జయరాం.. చివరి సారిగా.. విజయసాయిరెడ్డిని కలిసినట్లుగా తేలడంతో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...