Jump to content

గణాంకాల సంఘానికి ఇద్దరు సభ్యుల రాజీనామా


vinayak

Recommended Posts

This is result of the Modi govt’s mad method of manipulation of statistics to show progress and growth where there is none or weak! Intellectuals cannot be slavish to any govt. They should be independent and forth right! Kudos to these two individuals who stood their ground and refused to be cowed down to the govts whims and wishes!

 

 

గణాంకాల సంఘానికి ఇద్దరు సభ్యుల రాజీనామా

 

30brk-nsc.jpg

దిల్లీ: జాతీయ గణాంకాల సంఘం(నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌) నుంచి ఇద్దరు స్వతంత్ర సభ్యులు రాజీనామా చేశారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వీరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వీరిలో ఒకరు తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ పీసీ మోహనన్‌ కాగా.. మరొకరు స్వతంత్ర సభ్యురాలు జేవీ మీనాక్షి.

ఇటీవల గణాంకాల కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాల డేటాపై ప్రభుత్వం, కమిషన్‌ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు రాజీనామా చేశారు. రాజీనామాపై మోహనన్‌ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో గణాంకాల కమిషన్‌ సమర్థవంతంగా పనిచేయట్లేదు. అంతేగాక గత కొన్ని నెలలుగా కమిషన్‌లో మమ్మల్ని పక్కనబెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా బాధ్యతలను మేం సరిగా నిర్వర్తించలేమని భావించాం. అందుకే మా పదవుల నుంచి తప్పుకొంటున్నాం’ అని చెప్పారు. మోహనన్‌, మీనాక్షి 2017 జూన్‌లో కమిషన్‌ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. వీరి పదవీకాలం 2020 జూన్‌ వరకు ఉంది.

గణాంకాల కమిషన్‌లో ఏడుగురు సభ్యులు ఉండాలి. అయితే ఇప్పటికే ఇందులో మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా వీరి రాజీనామాతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఇద్దరికి పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన గణాంకాల అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ, నీతీ ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సభ్యులుగా ఉన్నారు.

Link to comment
Share on other sites

ఉద్యోగాలను సృష్టించలేనివృద్ధి ఇది: రఘురాం రాజన్‌

 

ఉద్యోగాలను సృష్టించలేనివృద్ధి ఇది: రఘురాం రాజన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ఆర్థిక వృద్ధి ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని  రిజర్వు బ్యాంక్‌ మాజీ  గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ వెల్లడించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఒక ఆంగ్ల వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జీడీపీ వృద్ధిరేటుకు తగినట్లు ఉద్యోగాలు పెరగట్లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘ నాకు తెలిసి ఇంత వృద్ధి రేటు నమోదు చేస్తున్నా ప్రజలకు అవసరమైన విధంగా ఉద్యోగాలు పెరగకపోవడం ఆందోళనకరం. ఈ దశలో కూడా ద్ర్యవోల్బణం బలంగా ఐదుశాతానికి పైగా ఉంది. మనం మరింత వేగంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉందని తరచూ చెబుతుంటాము. కానీ వాస్తవంగా ఆ  పరిస్థితి ఉందా..? వచ్చే బడ్జెట్‌లో గతంలో కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉండవచ్చు. ఈ దశలో వేగంగా వృద్ధి సాధించడం సాధ్యమవుతుందా..?’’  అని ప్రశ్నించారు.

ఆర్థిక వృద్ధి విషయంలో కాగ్‌ విధానాలకు రాజన్‌ మద్దతు పలికారు. ప్రస్తుతం కనిపిస్తున్న దాని కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉందని రాజన్‌ అభిప్రాయపడ్డారు. వాస్తవం కంటే కేవలం సగం మాత్రమే చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మందగమనం తీవ్రమైందని అన్నారు. ప్రస్తుత ధరల కంటే వాణిజ్య యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై ఉంటుందని  పేర్కొన్నారు. దీంతో పాటు భౌగోళిక రాజకీయాలు కూడా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయన్నారు.

Link to comment
Share on other sites

11 minutes ago, sskmaestro said:

Some one will come now to prove that they are Congress men! The proof will be a website link of course!

Opposition parties meeda abaddalu tho dummetti poyataniki BJP central office lo recruitments chupetti Jobs provide chesaru ani cheptara yendi.....

 

Abaddalanu nijaluga cheppamani recruit chesukunna janalani 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...