Jump to content

రూ.60 వేల కోట్లతో గోదావరి-కావేరి అనుసంధానం

sonykongara

Recommended Posts

రూ.60 వేల కోట్లతో గోదావరి-కావేరి అనుసంధానం

గోదావరిపై అకినేపల్లి నుంచి నీటి మళ్లింపునకు నాలుగు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిన ఎన్‌డబ్ల్యూడీఏ
 భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయమే కీలకం

29hyd-main4a_2.jpg

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ భారత్‌లో నదుల అనుసంధానానికి ఆసక్తిచూపుతున్న కేంద్ర ప్రభుత్వం గోదావరి నీటిని కావేరి వరకు మళ్లించే అనుసంధానంపై కసరత్తును వేగవంతం చేసింది. గోదావరి నదిపై అకినేపల్లి వద్ద నుంచి నీటిని మళ్లించటానికి తెలంగాణ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సూచన మేరకు నాలుగు ప్రత్యామ్నాయాలపై జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) అధ్యయనం చేసి నివేదిక అందజేసింది. వారం పది రోజుల్లో దీనిపై చర్చించి ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాత గోదావరి బేసిన్‌లోని భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలను కోరే అవకాశం ఉంది. తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ పథకానికి సుమారు రూ.60వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది.

ఇదీ నేపథ్యం..
వర్షా కాలంలోనే 247 టీఎంసీల నీటిని గోదావరి నుంచి మళ్లించి మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయకట్టుకు  సరఫరా చేయడంతోపాటు 50 టీఎంసీల నీటిని కావేరి నదిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్టకు మళ్లించాలన్నది లక్ష్యం. గోదావరిలో మిగులు ఉండే నీరు, ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయింపు ఉండి వాడుకోలేని నీటితో కలిపి 147 రోజుల్లో 247 టీఎంసీల నీటిని మళ్లించడానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ తొలుత నివేదిక తయారు చేయించింది. దీని ప్రకారం గోదావరిపై తుపాకులగూడెం, దుమ్ముగూడెం ఆనకట్టకు మధ్యలో అకినేపల్లి వద్ద నుంచి కృష్ణాలోని నాగార్జునసాగర్‌కు, నాగార్జునసాగర్‌ నుంచి పెన్నాలోని సోమశిలకు, సోమశిల నుంచి కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటిని మళ్లించడానికి పథకాన్ని చేపట్టింది.

రెండో దశలో...
ఒడిశాలోని మహానది నుంచి గోదావరికి నీటిని మళ్లించాలన్నది లక్ష్యం. నదుల అనుసంధానంలో భాగంగా మహానది నుంచి గోదావరికి, గోదావరి నుంచి కృష్ణా-పెన్నా-కావేరికి మళ్లించాలన్నది ప్రణాళిక. అయితే, మహానదిలో నీటి లభ్యత లేదని ఒడిశా అభ్యంతరం చెప్పడంతో ఆ వివాదం పరిష్కారం అయ్యేలోగా గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టడానికి నివేదిక తయారు చేయించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అకినేపల్లి నుంచి నీటి మళ్లింపు ప్రణాళిక ముందుకు కదల్లేదు. అకినేపల్లికి ప్రత్యామ్నాయంగా మరో పథకాన్ని తయారు చేయడానికి నిపుణులతో జలవనరుల మంత్రిత్వశాఖ ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీ సూచన మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌ విభాగం అధ్యయనం చేసి నాలుగు ప్రత్యామ్నాయాలతో కేంద్రానికి నివేదిక ఇచ్చింది.

ఇవీ ఆ నాలుగు ప్రత్యామ్నాయాలు...
1. ఇచ్చంపల్లి దిగువ డ్యాం నుంచి మూసీ మీదుగా నాగార్జునసాగర్‌కు 2. తుపాకులగూడెం-మూసీ-నాగార్జున సాగర్‌(మధ్యలో ఓ లింక్‌ ద్వారా మునుగోడు తదితర ప్రాంతాలకు నీరివ్వడం) 3. జనంపేట-నాగార్జునసాగర్‌ (గ్రావిటీ కాలువద్వారా) 4. జనంపేట-నాగార్జునసాగర్‌(పైపులైన్‌ ద్వారా)
గతంలో ప్రతిపాదించిన అకినేపల్లికి దగ్గర్లోనే జనంపేట ఉంది. గ్రావిటీ కాలువ ద్వారా అయితే ఎక్కువ భూమిని తెలంగాణలో సేకరించాల్సి ఉంటుంది. కానీ ఈ పథకం ద్వారా తమకు వచ్చే ప్రయోజనం తక్కువంటూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జనంపేట నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని మళ్లించే పథకంపైనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరగనుంది.

జనంపేట పైపులైన్‌ పథకం స్వరూపం ఇదీ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనంపేట నుంచి పైపులైన్‌ ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించే పథకం వివరాలు...
తుపాకుల గూడెం నుంచి జనంపేట 76 కి.మీ. జనంపేట నుంచి దుమ్ముగూడెం 34 కి.మీ దూరం. వర్షాకాలంలో 96 రోజుల్లో 247 టీఎంసీల నీటిని మళ్లించడం లక్ష్యం. అంటే సరాసరిన రోజూ 2.7 టీఎంసీల నీటిని మళ్లించాల్సి ఉంటుంది. 242 కి.మీ దూరం పైపులైన్‌ ద్వారా నీటిని మళ్లిస్తారు. సుమారు 150 మీటర్ల వెడల్పుతో 17 వరుసల పైపులైన్లు వేయడంతో పాటు రెండు సొరంగమార్గాలు ఉన్నాయి. 120 మీటర్ల ఎత్తుతో లిఫ్టు కూడా ఉంది. భూగర్భంలో పైపులైన్‌ వేస్తారు కాబట్టి భూసేకరణ కొంత తగ్గుతుందని అంచనా. గ్రావిటీ ద్వారా అయితే 340 కి.మీ. వరకు కాలువ తవ్వాల్సి ఉంటుంది.

సాగర్‌ నుంచి సోమశిలకు...
నాగార్జునసాగర్‌ నుంచి సోమశిలకు 393.02 కి.మీ కాగా, ఇందులో సాగర్‌ కుడి కాలువకు సమాంతరంగా 202.75కి.మీ కాలువ తవ్వాల్సి ఉంటుంది.
సోమశిల నుంచి గ్రాండ్‌ ఆనకట్ట వరకు 529.190 కి.మీ. ఈ పథకానికి సుమారు రూ.60వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ ప్రతిపాదనలపై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత రాష్ట్రాల అభిప్రాయాలను కోరే అవకాశం ఉంది.

ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ వైఖరి ఏమిటో!
గోదావరి నుంచి కావేరి అనుసంధానం మొదట ప్రతిపాదించినపుడు ఛత్తీస్‌గఢ్‌కు ఇంద్రావతిలో ఉన్న కేటాయింపులను వినియోగించుకొనేలా నిర్ణయించారు. అప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో భాజపా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒప్పించవచ్చని కేంద్రజలవనరుల శాఖ మంత్రి భావించారు. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. 75 శాతం నీటి లభ్యత కింద తమకున్న కేటాయింపులను వదులుకోవడానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సిద్ధపడుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Link to comment
Share on other sites

This project is not needed.........single acre kuda ivvakudadu AP govt. or AP farmers....ee TN vallu AP ki sesina droham ki ade correct...

AP ki SCS ante addam paddaru vellu.....RS lo LS lo AP ki SCS kosam support seyyandra ante memenduku seyyali maaku avasaraam ledu annaru..aa MODI gaaditho kalisi naatakam aadaru.....chivariki chittoor dist lo Check dam kaduthunte daaniki kuda Supreme court daaka velli Case vesaru. adi kaaka TN schools lo telugu course kuda teesi dobbi telugu teaching staff ni kuda teesesaru...

Vellaki ila cooperate seyyadam waste...ee project ni teesi dobbandi pakkaki.

Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

AP need to make sure lifting/diversion can not start until water level at Polavaram dam is full.

dummugudem daggare kada tail pond katti wataer share sesukundam ani CBN proposal pettadu KCR ki...vaadu ego ki poyi motham project cancel sesadu kada inthaku mundu. malli vaadu ee moham pettukoni deeniki agree sesthadu?

Link to comment
Share on other sites

5 minutes ago, LuvNTR said:

dummugudem daggare kada tail pond katti wataer share sesukundam ani CBN proposal pettadu KCR ki...vaadu ego ki poyi motham project cancel sesadu kada inthaku mundu. malli vaadu ee moham pettukoni deeniki agree sesthadu?

vadu ala cheyabatte pattiseema vachindi fast ga...also vadu ala cheyabatte vykuntapuram kuda born ayyindi...

inko 5k(adi kuda ap 100% bearing ani offer) tho dummagudem ayipoydi...

Link to comment
Share on other sites

13 minutes ago, LuvNTR said:

This project is not needed.........single acre kuda ivvakudadu AP govt. or AP farmers....ee TN vallu AP ki sesina droham ki ade correct...

AP ki SCS ante addam paddaru vellu.....RS lo LS lo AP ki SCS kosam support seyyandra ante memenduku seyyali maaku avasaraam ledu annaru..aa MODI gaaditho kalisi naatakam aadaru.....chivariki chittoor dist lo Check dam kaduthunte daaniki kuda Supreme court daaka velli Case vesaru. adi kaaka TN schools lo telugu course kuda teesi dobbi telugu teaching staff ni kuda teesesaru...

Vellaki ila cooperate seyyadam waste...ee project ni teesi dobbandi pakkaki.

enti gadakri garu cheppagane kattesthunnaru ane feeling loki vachava. ma nayane. vadu modi ni minchina sunta gadu. vadu urin to urea chesthanu ani 3 years back cheppadu. water cargo expand chesthanu ani pedda hand ichhadu. polavram dpr-2 2 weeks lo chesthaa annadu. toll gate edo bridge ki tesi vesha ani nenu teeyanu ippudu annadu.this plan is going from so long. don't expect this will be done in another 50 years.

Link to comment
Share on other sites

2 hours ago, Bollu said:

bro, you forgot every week/month polavaram visit ? 

Eee db lo konthamandi appatlo chalaa jackey lu petti lepeyvaru ithanni..useless fellow manavaraku atleast, don't know about other states.

Link to comment
Share on other sites

2 hours ago, Bollu said:

enti gadakri garu cheppagane kattesthunnaru ane feeling loki vachava. ma nayane. vadu modi ni minchina sunta gadu. vadu urin to urea chesthanu ani 3 years back cheppadu. water cargo expand chesthanu ani pedda hand ichhadu. polavram dpr-2 2 weeks lo chesthaa annadu. toll gate edo bridge ki tesi vesha ani nenu teeyanu ippudu annadu.this plan is going from so long. don't expect this will be done in another 50 years.

Link to comment
Share on other sites

3 hours ago, LuvNTR said:

This project is not needed.........single acre kuda ivvakudadu AP govt. or AP farmers....ee TN vallu AP ki sesina droham ki ade correct...

AP ki SCS ante addam paddaru vellu.....RS lo LS lo AP ki SCS kosam support seyyandra ante memenduku seyyali maaku avasaraam ledu annaru..aa MODI gaaditho kalisi naatakam aadaru.....chivariki chittoor dist lo Check dam kaduthunte daaniki kuda Supreme court daaka velli Case vesaru. adi kaaka TN schools lo telugu course kuda teesi dobbi telugu teaching staff ni kuda teesesaru...

Vellaki ila cooperate seyyadam waste...ee project ni teesi dobbandi pakkaki.

True Bro,  Tamil vaallaki telugu vaallu ante kullu + chulakana 

Telugu Ganga water isthunnaa,  vaalla edupu aagaledu,  Telugu school s theesesaaru,  Chidambaram provoked TG movement wantedly. 

Madras was developed by both Telugu and Tamil people,  but still they don't accept Telugu as brothers . 

Please no support to  Kaveri interlink

Link to comment
Share on other sites

5 hours ago, Bollu said:

enti gadakri garu cheppagane kattesthunnaru ane feeling loki vachava. ma nayane. vadu modi ni minchina sunta gadu. vadu urin to urea chesthanu ani 3 years back cheppadu. water cargo expand chesthanu ani pedda hand ichhadu. polavram dpr-2 2 weeks lo chesthaa annadu. toll gate edo bridge ki tesi vesha ani nenu teeyanu ippudu annadu.this plan is going from so long. don't expect this will be done in another 50 years.

నిజం. చెప్పగానే కట్టేసే పనైతే నా దేశం ఇలా ఉండేదా.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...