Jump to content

dwcra cheques


Saichandra

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply
7 hours ago, sskmaestro said:

Okati feb okati mar inkoti April undenti?

 

and also amount kuda 28k, 17.5k and 12.5k unnayenti?

 

am I missing anything?

డ్వాక్రా ఆడపడుచులకు పంపిణీకి సిద్ధమైన చంద్రన్న పసుపు కుంకుమ చెక్కులు... 
01/02/2019 2500/-                       08/03/2019 3500/-                    

05/04/2019 4000/-

Link to comment
Share on other sites

రారండోయ్‌ పండుగ చేద్దాం!
 

పెంచిన పింఛన్ల మొత్తం 2 నుంచి పంపిణీ
సంబరంలా నిర్వహించనున్న అధికారులు
పసుపు-కుంకుమ చెక్కులూ అందజేత

weg-top1a_51.jpg

జిల్లాలో మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ సంబరంలా నిర్వహించడానికి  డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పసుపు-కుంకుమ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 10 వేల వంతున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి కూడా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళలకు పంపిణీ చెయ్యాల్సిన చెక్కులను సిద్ధం చేసే పనిలో ఆ శాఖాధికారులు తలమునకలై ఉన్నారు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు
వీరవాసరం, కుక్కునూరు - న్యూస్‌టుడే

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 78,218 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీరికి పదివేల చొప్పున రూ. 755 కోట్లు పంపిణీ చేయనున్నారు. గ్రామాలను మూడు క్లస్టర్లుగా విభజించి మూడో వంతు గ్రామాల్లో 2న, మరో మూడో వంతు  గ్రామాల్లో 3న, మిగిలిన గ్రామాల్లో 4న ఈ సమావేశాలు ఏర్పాటు చేసి చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులతోపాటు స్వీటు-హాటు, పసుపు కుంకుమ అందజేయనున్నారు.

అధికారుల హడావుడి
ఆయా స్వయం సహాయక సంఘాలు లావాదేవీలు సాగిస్తున్న బ్యాంకుల నుంచే చెక్కులు ఇస్తున్నారు.  ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, చైతన్య గోదావరి బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, డీసీసీబీ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, అలహాబాదు బ్యాంకు, కొటక్‌ మహీంద్రబ్యాంకు, యుకో తదితర బ్యాంకుల నుంచి ఇప్పటికే ఆ చెక్కులన్నీ డీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చాయి. భారీ ఎత్తున అందులోనూ తక్కువ సమయంలో ఈ కార్యక్రమం చేపట్టనుండడంతో డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అధికమొత్తంలో చెక్కులను సిద్ధం చేయాల్సి ఉండడంతో జిల్లాలోని పలు మండలాల నుంచి 100 మందికిపైగా వెలుగు సిబ్బందిని జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి తీసుకువచ్చారు. బ్యాంకుల వారీగా వచ్చిన చెక్కులను ఆయా గ్రామాల్లోని సంఘాలకు పంపిణీ చేయాల్సిన వాటిని వేర్వేరుగా విభజిస్తున్నారు. వీటన్నింటినీ గ్రామాల వారీగా విభజించడంతోపాటు సంఘాల వారీ తనిఖీ చేశారు. కొన్ని సంఘాల వారీగా ఉన్న సభ్యుల సంఖ్యకు సరిపడా మొత్తం వచ్చిందో లేదో పరిశీలిస్తున్నారు. వీటన్నింటినీ గురువారం సాయంత్రానికి ఆయా మండలాలు, పురపాలక సంఘాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్ధం చేస్తున్న 2.32 లక్షల చెక్కులు
జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 67508 సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో 10710 సంఘాలు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 78,218 సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానికి మూడేసి చెక్కులు ఇవ్వనున్నారు. వచ్చే 2వ తేదీతో రూ. 25000ల చెక్కు, మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరో రూ. 35000ల చెక్కు, ఏప్రిల్‌ 5వ తేదీతో రూ.40వేల చెక్కులను సిద్ధం చేశారు. ఈ మూడు చెక్కులను 2,3,4 తేదీల్లోనే ఇవ్వనున్నారు. గ్రామాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో పురపాలక సంఘాల కమిషనర్ల ఆధ్వర్యంలోనూ ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.

4.36 లక్షల మందికి పింఛన్లు పంపిణీ
ఇవే తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి నెల వరకు వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. దీన్ని రెట్టింపు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతనెలలో లబ్ధిదారులకు రూ. వెయ్యి మాత్రమే పంపిణీ చేశారు. ఆ నెల సొమ్ము వెయ్యి కలిపి పిబ్రవరిలో ఇవ్వనున్నారు. వృద్ధులు, వితంతువులకు 3వేల చొప్పున మంజూరు చేయనున్నారు. రెండు నెలల నుంచి తీసుకోకుండా ఉన్న లబ్ధిదారులకు రూ. 4 వేలు ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు. జిల్లాలో జనవరి నెల వరకు 4.13 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. ఈ సమయంలో జిల్లాలో రూ. 46 కోట్లు ఇచ్చేవారు.  జన్మభూమిలో 23,500 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. వీటన్నింటితో కలిపి రూ. 114 కోట్ల నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పింఛను సొమ్ముతోపాటు స్వీటు హాటు కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు.

గతానికి.. నేటికీ తేడా
ఇప్పటివరకూ పంపిణీ కార్యక్రమం ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే జరిగేది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్లి, చడీచప్పుడు కాకుండా పంచిపెట్టేవారు. ఇప్పుడు పెరిగిన పింఛనల దరిమిలా, కొన్ని పంచాయతీలను, ఒకచోట ఓ వేడుక వాతావరణంలో పంపిణీచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా మండలాల్లో పంచాయతీల సంఖ్యను బట్టి, ఈ మూడు రోజుల్లో పంపిణీ పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ తయారు చేసుకోవాలని జిల్లాయంత్రాంగం నుంచి మండల అధికారులకు వర్తమానం అందింది. ఉదాహరణకు 5 పంచాయతీలను ఒక చోట చేరిస్తే, మండలంలోని అందరు కార్యదర్శులు అక్కడే ఉండి, ఒకేరోజు ఆ అయిదు పంచాయితీలలోని అందరు పింఛనుదారులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

weg-top1b_14.jpg

Link to comment
Share on other sites

6 minutes ago, swarnandhra said:

does it include the votes BJP got in those 12 seats they contested? or YSRCP total was from 163 or 175 seats?

It also includes anti BJP vote that went for YSRCP. My own friend who is a Muslim voted for YSRCP as CBN joined Modi. I tried to convince him but he said just one line “Modi gadu sadist guru, you people will know later”. I confronted with him before 2024 elections. Now I feel sorry and apologized him last year. Harsh fact in my personal life!

Link to comment
Share on other sites

7 minutes ago, swarnandhra said:

does it include the votes BJP got in those 12 seats they contested? or YSRCP total was from 163 or 175 seats?

No they are separate, 76.80% of the 3.68 crore voters exercised their franchise if we consider current AP. So may be this time with new voters coming into play 3.5 crore voters may exercise their vote.

Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

It also includes anti BJP vote that went for YSRCP. My own friend who is a Muslim voted for YSRCP as CBN joined Modi. I tried to convince him but he said just one line “Modi gadu sadist guru, you people will know later”. I confronted with him before 2024 elections. Now I feel sorry and apologized him last year. Harsh fact in my personal life!

yup, BJP valla vacchina votes kante poyina votes ekkuva vuntayemo.

Link to comment
Share on other sites

పసుపు - కుంకుమ చెక్కులు సిద్ధం

 

ap-state1a_4.jpg

ఈనాడు, అనంతపురం: పసుపు-కుంకుమ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వయంసంఘాల మహిళలకు ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా సర్కారు నుంచి ప్రతి మహిళకు రూ. పది వేలు చొప్పున అందుతాయి. ఫిబ్రవరిలో రూ.2500, మార్చిలో రూ.3500, ఏప్రిల్‌లో రూ.4000 చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యే సంబంధిత సొమ్ముకుగాను ఒకే దఫా చెక్కులను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని సమాఖ్య కార్యాలయాలకు బ్యాంకుల నుంచి ఇప్పటికే ఆయా చెక్కులు చేరాయి. అనంతరం వీటిని మండలాల్లోని వెలుగు కార్యాలయాలకు పంపుతారు. ఈ క్రమంలో గురువారం అనంతపురం పట్టణంలోని సమాఖ్య కార్యాలయానికి చేరిన పసుపు-కుంకుమ చెక్కులను డీఆర్‌డీఏ సిబ్బంది ఇలా పంపిణీకి సిద్ధం చేశారు. పుట్టింటి కానుకగా చంద్రన్న వరం పేరిట ఆడపడచులకు వాటిని అందజేసేందుకు సీఎం చంద్రబాబు చిత్రంతో ప్రత్యేకంగా కవర్లనూ ముద్రించారు.

‘పసుపు-కుంకుమ’కు రూ.9361 కోట్లు 
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ-2 పథకంలో భాగంగా ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు వీలుగా 2018-19 బడ్జెట్‌ కేటాయింపుల నుంచి రూ.9361.12 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Link to comment
Share on other sites

 

brahmi-siggu-padutu.gif

 

:clickhere:

చంద్రన్న చెల్లెల్లు అమరావతి యాత్ర... బస్సు టాప్ పైకి ఎక్కి మరి అస్వాదిస్తునారు అమరావతి పనులు 

 

brahmi1.gif

 

 

Link to comment
Share on other sites

13 hours ago, AnnaGaru said:

చంద్రన్న చెల్లెల్లు అమరావతి యాత్ర... బస్సు టాప్ పైకి ఎక్కి మరి అస్వాదిస్తునారు అమరావతి పనులు 

 

brahmi1.gif

 

 

Idhi kada manam expect chestundhi. Excellent ???

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...