Jump to content

Tirupati to Kuwait via Vijayawada


sonykongara

Recommended Posts

1/2 తిరుపతి నుండి కువైట్ వయా విజయవాడ కు నేరుగా విమాన సర్వీసులు కావాలా? విమానాలను నడిపే విషయంలో ఉన్న ప్రాధాన్యత తెలిసేలా సర్వే నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూర్పొరేషన్ లిమిటెడ్ సూచించింది. ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి మీ ఓట్ వేయండి https://www.apnrt.com/flight_survey 

Dx-sn4LUYAA5ki5.jpg
Link to comment
Share on other sites

ఇకపై తిరుపతి నుంచి కువైత్‌కు విమాన సర్వీస్
28-01-2019 13:27:11
 
636842788323182318.jpg
  • విమాన సర్వీసు నడపడానికి సూత్రప్రాయ అంగీకారం
  • ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో ఏపీఎన్‌ఆర్‌టీ అధికారుల భేటీ
 
రాజంపేట(కడప జిల్లా): తిరుపతి నుంచి విజయవాడ ద్వారా కువైత్‌ దేశానికి విమాన సర్వీసు నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఏపీఎన్‌ఆర్‌టీ ప్రతినిధులు రాజశేఖర్‌, ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి లక్షలాది మంది కువైత్‌ దేశానికి వెళ్లి జీవనం సాగిస్తున్నారని, వీరిని దృష్టిలో ఉంచుకొని అతి దగ్గర తిరుపతి ఎయిర్‌ పోర్టు నుంచి విజయవాడ మీదుగా కువైత్‌కు విమాన సర్వీసు నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరడం జరిగిందన్నారు. తమ విన్నపాన్ని మన్నించి ప్రజల ద్వారా సర్వే చేసి వచ్చే స్పందనను బట్టి త్వరలో కువైత్‌కు ప్రత్యేక సర్వీసును నడపడానికి ఎయిర్‌ పోర్టు అధికారులు అంగీకరించారన్నారు.
 
 
విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇటీవల ప్రారంభించిన విమాన సర్వీసుకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం జరిగిందన్నారు. ప్రతి రోజూ చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి అనేక విమానాల ద్వారా కడప, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలకు సంబంధించిన గల్ఫ్‌ దేశాల్లోని ప్రధానంగా కువైత్‌ దేశం నుంచి వేలాది మంది ప్రతి రోజూ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. వీరికి తిరుపతి నుంచి విమానం నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము తెలియజేశామన్నారు. తమ విన్నపాన్ని స్వీకరించి ప్రజలతో సర్వే నిర్వహించి ఆ స్పందనను బట్టి త్వరితగతిన తిరుపతి నుంచి విమాన సర్వీసు నడపడానికి ఏపీ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అంగీకరించారన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా నిర్వహించే సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తే త్వరితగతిన ఈ సౌకర్యం ఏర్పడుతుందన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...