Jump to content

జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ


sonykongara

Recommended Posts

గన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ

27brk-jagan1a.jpg

హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. కుమారుడు హితేశ్‌తో కలిసి లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసంలో ఆయన్ను కలిశారు. వైకాపాలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ప్రకాశం జిల్లాలో వైకాపా టికెట్‌ ఇచ్చే అంశంపై జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెంకటేశ్వరరావు సతీమణి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్నారు.

 
Link to comment
Share on other sites

కారంచేడు మారణఖాండని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకెంచి చెంచురామయ్య గారిని దూషించిన YSR 

అదే చెంచురామయ్య గారి మనవడిని కౌగిలించుకున్న జగన్ రెడ్డి 

పావురాలగుట్ట మీదుగా ఇడుపులపాయకి చిందులు తొక్కుకుంటూ వెళ్తున్న YSR ఆత్మ

Link to comment
Share on other sites

అమ్మ బిజేపీ అయ్య కాంగ్రెస్ కొడుకు YCP ముగ్గురూ మూడు జెండాల పైన .. రామారావు బొమ్మెట్టుకొని.. చంద్రబాబు TDP జెండా మీద .. NTR బొమ్మెట్టటంవల్ల..NTR ఆత్మక్షోబిస్తంది అని ఏడుస్తారు

Dx6LLPQU0AAoxKA.jpg
Link to comment
Share on other sites

అమరావతి: వైసీపీలో దగ్గుబాటి కుటుంబం చేరికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని, దగ్గుబాటి మారని పార్టీలు లేవని ఆయన విమర్శించారు. సోమవారం ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ మొదలు అన్నిపార్టీల చుట్టూ దగ్గుబాటి ప్రదక్షిణలు చేశారన్నారు. కాంగ్రెస్‌లో  కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లారని సీఎం విమర్శించారు.
 
 
ఇప్పుడు దగ్గుబాటి మళ్లీ వైసీపీ గూటికి చేరారని చంద్రబాబు అన్నారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. వాళ్లు అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ బయోపిక్‌తో పాటు.. మళ్లీ ఎన్టీఆర్‌పై బయోపిక్‌ తీయాలని కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
Link to comment
Share on other sites

ఇదెక్కడి రాజకీయం.. దగ్గుబాటిపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
28-01-2019 10:32:55
 
636842683758766662.jpg
  • రాజకీయ నిబద్ధత అంటే ఇదేనా?
  • దగ్గుబాటిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఏలూరి వ్యాఖ్య
ఒంగోలు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీలో పురందేశ్వరి, లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ చెంత కుమారుడు హితేష్‌. వీరందరికీ పెద్దగా డాక్టర్‌ వెంకటేశ్వర రావు. ఇదెక్కడి రాజకీయం. నిబద్ధత నిజాయితీ రాజకీయమంటే ఇదేనా’ అని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్‌తో కలవడం, కుమారుడు హితేష్‌ జగన్‌తో కలిసి పనిచేస్తాడని ప్రకటించడం, సతీమణి పురందేశ్వరి బీజేపీలోనే ఉంటారని వెల్లడించిన నేపథ్యంలో ఏలూరి సాంబశివరావు ఈ వ్యాఖ్యానం చేశారు.
 
రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ, వైసీపీల అపవిత్ర కలయిక ఎలా ఉందో దీని ద్వారా తేలిపోయిందన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న జగన్‌తో జత కట్టడం ద్వారా డాక్టర్‌ దగ్గుబాటి రాజకీయం అనుమానాస్పదంగా మారిందన్నారు. ఈ వ్యవహారాలను పర్చూరు ప్రజానీకం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. చైతన్యవంతమైన పర్చూరు ప్రజానీకానికి ఏపార్టీ ఏంటో, నాయకులు ఎంటో స్పష్టంగా తెలుసని, వారు తప్పటడుగు వేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.
 
 
టీడీపీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులే కాకుండా సాధారణ ప్రజానీయకం కూడా ఈ విషయంలో ఎలాంటి ఉత్తేజానికి గురికారని భావిస్తున్నానని తెలిపారు. బీజేపీ, వైసీపీల మధ్య అపవిత్ర కలయికకు దర్పణం పట్టే ఈ చర్యను ప్రజలు అర్థం చేసుకుంటారని, రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆదరిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని కూడా దగ్గుబాటి తప్పుపట్టడం సమంజసం కాదని, ఎవరెన్ని విమర్శలు చేసినా డ్వాక్రా మహిళల ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి అన్నారు.
Link to comment
Share on other sites

నాకొక డౌటనుమానం:

      ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడాలి కదా!!

   రేపు ఎన్నికలలో ధగ్గుపాటి పురంధేశ్వరి గారు వారి ఓటు ఎవరికి వేస్తారు??

    కొడుకుకి ఓటేస్తే పార్టీని మోసం చేసినట్లు..

      పార్టీకి కట్టుబడి, పార్టీకే ఓటేస్తాను అంటే......

 పో పోవమ్మా నీ ఓటే వేయనపుడు మేమెందుకేయాలి అంటారు జనం.....

ఇపుడెలాగబ్బా!!!!!

Link to comment
Share on other sites

ee COUGH paati family ki silent ga undey logic thelidhaa...antha capacity untey independent ga contest cheyochu gaa...??

asalu think chesthaadaa ledha....evadu patinchukotleydhu ani ekkuva think chesi ee decisions theesukuntaadaa....

COughBaati son ki ayina manchi future untadhi independent ga chesthey

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...