Jump to content

ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న


sonykongara

Recommended Posts

ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న

2509slider-pranab1a.jpg

దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ అత్యున్నత పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో పాటు మరో ఇద్దరిని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది. నానాజీ దేశ్‌ముఖ్‌, భూపెన్‌ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాలు దక్కాయి. రాజకీయాల్లో, ప్రభుత్వరంగంలో అనేక విధాలుగా సేవలందించిన ప్రణబ్‌కు మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా మంచి పేరుంది. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఆయన సేవలను కొనియాడటంతో పాటు రక్షణ మంత్రిగా, ఆర్థికమంత్రిగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన వ్యక్తిగా ఆయన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారానికి ప్రణబ్‌ను కేంద్రం ఎంపిక చేసింది.  

bharatna1.jpg

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు. అలాగే ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా సేవలందించి ఆ పదవికే వన్నె తెచ్చారు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని చాటారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పిస్తూ తన ప్రత్యేకత నిలుపుకొన్నారు. అలాంటి ప్రణబ్‌కు భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అసోంకు చెందిన భూపెన్‌ హజారికా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, కవిగా గుర్తింపు పొందారు. ఆయన పాటలు బెంగాలీ, హిందీ వంటి భాషల్లోకి తర్జుమా అయ్యాయి.

 
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న ki enduku

Asalu emie chesadu Anie ivathaniki anna ghariki ichie vuntey bagundedhe worst yadavalu ........

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...