Jump to content

కొడాలి నానిపై టీడీపీ నుంచి పోటీకి ఎవరంటే..


koushik_k

Recommended Posts

  • గుడివేడే
  • త్వరలోనే టీడీపీ అభ్యర్థికి టికెట్‌ ఖరారు చేసే అవకాశం
  • రెండు రోజుల్లో గుడివాడ నేతలతో చంద్రబాబు భేటీ
  • తుది పరిశీలనలో రావి.. అవినాష్‌ పేర్లు
  • నానికి చెక్‌ పెట్టడమే లక్ష్యంగా కసరత్తు
అభ్యర్థులను ప్రకటించడంలో ముందున్న టీడీపీ అధిష్ఠానం అదే దూకుడును కొనసాగిస్తోంది. పశ్చిమంలో తొలి టికెట్‌ను ఖరారు చేసిన ఆ పార్టీ అదే ఊపులో జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా మారిన గుడివాడ టికెట్‌ను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి కొడాలి నానీకి ఈసారి ఎలాగైనా చెక్‌ పెట్టాలన్న దిశగా పార్టీ అధిష్ఠానం వ్యూహరచన చేస్తోంది. ఇందుకు బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అందులో భాగంగా రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్‌ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
 
 
విజయవాడ, ఆంధ్రజ్యోతి: కృష్ణా జిల్లాలో తొలి టికెట్‌ను ఖరారు చేసిన టీడీపీ అధిష్ఠానం మలి టికెట్‌ను ఖరారు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. విజయవాడ పశ్చిమ టికెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్‌కు పార్టీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. అదే ఊపులో రెండు మూడు రోజుల్లో జిల్లాలో పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ టికెట్‌ను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొత్తం తొమ్మిది సార్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా రెండుసార్లు మినహా మిగిలిన అన్ని సార్లు టీడీపీ జెండానే ఎగిరింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని గెలుపొందారు. ఈసారి ఎలాగైనా నానికి చెక్‌ పెట్టాలన్న దిశగా పార్టీ అధిష్ఠానం వ్యూహరచన చేస్తోంది. నానిని ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అందులో భాగంగా రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్‌ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
 
 
గుడివాడ నియోజకవర్గానికి మూడో పర్యాయం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని తొలి రెండు పర్యాయాలు టీడీపీ తరఫున గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయడంలో నాని వైసీపీ అధినేత జగన్‌ కన్నా దూకుడు ప్రదర్శిస్తుంటారు. దీంతో ఎలాగైనా నాని దూకుడుకు చెక్‌ పెట్టాలని టీడీపీ అధిష్ఠానం యోచిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గుడివాడను తెలుగుదేశం ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది.
 
ఎన్నికల సమయంలో నాని వేసే ఎత్తులను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులకే ఈసారి ఛాన్స్‌ ఇవ్వాలన్నది పార్టీ నిశ్చితాభిప్రాయంగా చెబుతున్నారు. అందులో భాగంగా అన్ని రకాలుగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అన్ని వడపోతలు అయిన తర్వాత తుది పరిశీలనలో రావి వెంకటేశ్వరరావు, దేనినేని అవినాష్‌ పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన సర్వేలు రావికి సానుకూలంగా ఉన్నా ఆయన ఎంత వరకు నానిని ధీటుగా ఎదుర్కొనగలరన్న అంశాన్ని పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నాయి.
 
 
ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించే రావి నైజం ఆయనకు ప్రధాన ప్రతిబంధకంగా చెబుతున్నారు. అదే సమయంలో దేవినేని అవినాష్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. యువకుడు.. ఉత్సాహవంతుడైన అవినాశ్‌ గుడివాడ స్పీడ్‌కు సరిపోతాడన్న భావన్య పార్టీ వర్గాల్లో వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
 
ఏదేమైనా వీలైనంత త్వరగా గుడివాడ టికెట్‌ను ఖరారు చేయాలన్న యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు మూడు రోజుల్లో గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నేతలతోపాటు అవినాష్‌ను కూడా ఈ భేటీకి ఆహ్వానించే అవకాశం ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు చంద్రబాబు తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

Just now, Jaitra said:

Bezawada vallani dimpandi,Gdv batch ki nerputhaaru ela gelavaalo

Kikiki

Ela gelavalo ma gudivada vallaki teliyandi emi kadu.. anduke opposition lo unna oka dammunnodu gelusthunnadu 3 times ga ..      Bezawada bcom physics batch ni ennukonna valla nundi nerchukovalsina karma makendi bro .  ?    chacchu sannasini ennukovalsina avasaram ledu ankone TDP ni dooram pettaru inni days :D candidate marusthe gelupu conform. 

Link to comment
Share on other sites

7 minutes ago, TDP888 said:

Lokesh ki ivvochu ga gelisthey crttics musukuntaru debbaki

Lokesh enduk theskovali new comer ayi undi ?  balayya nilapadali leda NTR alludu ayna cbn nilapadali.  lokesh ki em samandam gudivada.. kuppam velli oka 70k majority tho assembly ki velthe chalu

Link to comment
Share on other sites

30 minutes ago, koushik_k said:

Ela gelavalo ma gudivada vallaki teliyandi emi kadu.. anduke opposition lo unna oka dammunnodu gelusthunnadu 3 times ga ..      Bezawada bcom physics batch ni ennukonna valla nundi nerchukovalsina karma makendi bro .  ?    chacchu sannasini ennukovalsina avasaram ledu ankone TDP ni dooram pettaru inni days :D candidate marusthe gelupu conform. 

Party important maaku, candidate tho Pani laadhu

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Lokesh enduk theskovali new comer ayi undi ?  balayya nilapadali leda NTR alludu ayna cbn nilapadali.  lokesh ki em samandam gudivada.. kuppam velli oka 70k majority tho assembly ki velthe chalu

Leader capability yeppatiki thelusthundi

Link to comment
Share on other sites

19 minutes ago, Kondepati said:

Anavasaram ga Avinash career ni endhuku end chestaru sami... gudivada nani confirm win ... kavalante Uma ni vesukondi akkada... mylavaram avinash ki ivvandi 

Okasari odipothe career emi end avadhu bro but avinash wrong choice e local feeling tho pada votes kuda potaye emo

Link to comment
Share on other sites

12 minutes ago, King Of Masses said:

Okasari odipothe career emi end avadhu bro but avinash wrong choice e local feeling tho pada votes kuda potaye emo

Last time kuda Modipoyadu ga vja lo... career starting ye 2 times loose aithe Inka evvadu pattinchukuntadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...