Jump to content

టీడీపీ నుంచి ఆహ్వానం.. వచ్చే ఎన్నికల్లో పోటీ తథ్యం..’


KING007

Recommended Posts

టీడీపీ నుంచి ఆహ్వానం.. వచ్చే ఎన్నికల్లో పోటీ తథ్యం..’

1/24/2019 3:02:48 PM

636839392393332089.jpg

 

రానున్న ఎన్నికల్లో పోటీ తథ్యం: మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి
తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం
 
ఉగ్ర వెంటేనంటూ అభిమానుల శపథం
కనిగిరిలో సభ విజయవంతం
 
కనిగిరి, ప్రకాశం : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వనం అందిందని, పార్టీ పిలుపు మేరకు తాను రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను కూడా తెలుగుదేశంతోనే పయనించాలన్న నిర్ణయంతో ముందుగానే తన ఉద్ధేశాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు వెల్లడించారు. తాను తీసుకునే రాజకీయ నిర్ణయానికి ఉగ్రసేన సభ్యులు, అభిమానులు అంతా మద్దత్తు పలకడం అనందంగా ఉందన్నారు. బుధవారం కనిగిరిలోని పవిత్ర పంక్షన్‌హాలులో ఉగ్రసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి ఆనాడే నిమ్జ్‌ను ప్రతిపాదించి కనిగిరి ప్రాంతానికి తీసుకువచ్చానన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ది కంటే తిరిగి మరింత అభివృద్ది సాధిస్తానని, ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించి ప్రజల నీటి కష్టాలు తొలగిస్తానన్నారు.
 
 
ఏనిర్ణయమైనా మీ వెంటే: ఉగ్రసేన నేతలు
మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని సమావేశంలో ఉగ్రసేన నాయకులు ప్రకటించి తీర్మానించారు. సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఉగ్రసేన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అత్యధిక గ్రామాల నుంచి కూడా అభిమానులు హాజరుకావడం విశేషం. నియోజకవర్గంలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. హాజరయిన వారిలో హనుమంతునిపాడు, వెలిగండ్ల, పీసీపల్లి మండలాల వారు ఎక్కువమంది కనిపించారు. ఆతర్వాత పామూరు, కనిగిరి నగర పంచాయతీల నుంచి అధికంగా వచ్చారు. ఇటు తెలుగుదేశంతోపాటు అటు వైసీపీ అభిమాన శ్రేణులు ఈ సమావేశానికి హాజరుకావడం విశేషం. పార్టీ రహితంగా ఉండే మేధావి వర్గానికి చెందినవారు హాజరయ్యారు. సమావేశంలో ఉగ్రసేన నాయకులు షేక్‌ బుడేసాహెబ్‌, సానికొమ్ము రాఘవరెడ్డి, అట్లా మాలకొండారెడ్డి, బోయిళ్ళ తిరుపతిరెడ్డి, కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Just now, nareshtdp said:

Kadiri is good in person but most of time in Hyderabad and not available to care and not aggressive on supporting cadre ,slow guy where ugra is so aggressive 

Ok geliche vallaki ticket isthe parledule.. alaane markapuram and yerrangondapalem kudaa kocnhem manchi leaders ni chusthe better emo.. 

Link to comment
Share on other sites

36 minutes ago, anil Ongole said:

Ok geliche vallaki ticket isthe parledule.. alaane markapuram and yerrangondapalem kudaa kocnhem manchi leaders ni chusthe better emo.. 

yerragondapalem lo gelavali ante dabbu kummarinchali David raju ki SN padu ku tesukuvachi strong ST ni kanisam 10cr kummarinchadevadini pedithe kani kastam

Link to comment
Share on other sites

ప్రకాశం జిల్లాలో ముగ్గురు అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌!
24-01-2019 14:52:15
 
636839384074857570.jpg
  • శిద్దా, ఏలూరి, అశోక్‌లకు గ్రీన్‌సిగ్నల్‌
  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచిన బాబు
  • నేతలతో విడివిడిగా మాట్లాడిన ముఖ్యమంత్రి
  • ముగ్గురికి నియోజకవర్గ పరిస్థితుల నివేదిక అందజేత
 
ఒంగోలు: రాష్ట్రంలోని పదిహేనుమంది టీడీపీ నేతలకు బుధవారం ముఖ్యమంత్రిని కలవాలన్న సమాచారం అందింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలకు సీఎం ఫేషీ నుంచి పిలుపొచ్చింది. ముగ్గురు నేతలతో బుధవారం రాత్రి ఆయన విడివిడిగా మాట్లాడారు. తొలుత మంత్రి శిద్దాతో బాబు మాట్లాడారు. ముందుగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని కూడా శిద్దా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అనంతరం దర్శి విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ రావచ్చు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండని సూచించినట్లు తెలిసింది. ప్రత్యేక నివేదికలను ఆయనకు అందజేశారు. ఎంత మెజారిటీ సాధించగలమన్న నమ్మకం ఉందో తెలపాలంటూ శిద్దా చెప్పిన సమాచారానికి బదులుగా ఇంకా మెజారిటీ పెరగాలని సూచించినట్లు తెలిసింది. ఆయా అంశాలకు సంబంధించిన సమాచారంతో కూడిన నివేదికను కూడా ఇచ్చినట్లు తెలిసింది.
 
 
ఎమ్మెల్యే ఏలూరికి ఓకే
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోటీకి సిద్ధం కమ్మని స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటంతో పాటు పలురకాల అంశాలకు సంబంధించి ఏలూరి ద్వారా తెలుసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి సాధనలో ముందున్నారు, రాజకీయంగా నిర్థిష్ట విధానంతో నడుస్తున్నారు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే చక్కగా పరిష్కరించుకుంటున్నారు అని అంటూ గతం కన్నా మెజారిటీ పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఏలూరి నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకులు నిర్వహిస్తున్న అసమ్మతి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వారిని కలుపుకునేందుకు నావంతు ప్రయత్నం నేను చేస్తున్నా, రాష్ట్ర పార్టీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లా వారూ ప్రయత్నిస్తున్నారని చెప్పటంతో పాటు అవకాశం ఉంటే మీరు కూడా వారిని పిలిపించి మాట్లాడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఏలూరికి కూడా పలు అంశాలకు సంబంధించిన నివేదికను ఇచ్చి వాటిని పరిశీలించి అనుసరించమని ఆదేశించినట్లు తెలిసింది.
 
 
చివర్లో అశోక్‌తో..
బాగా పొద్దుపోయిన తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. తిరిగి గిద్దలూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే పలు అంశాలపై సూచనలు, జాగ్రత్తలు చెప్పినట్లు తెలిసింది. తాజా పరిస్థితులను అశోక్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకెళ్తూ కిందిస్థాయిలో పలు చేర్పులుమార్పులు ఉండవచ్చని అయినా గెలుపు మనదేనని అంటూ అందుకు ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మేము అన్నీ గమనిస్తున్నాం. అనేక సర్వేలు చేశాం ఈ నివేదికలు పరిశీలించి పూర్తిజాగ్రత్తలు తీసుకోండని సూచించినట్లు తెలిసింది. కాగా రోజువారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్న సీఎం మిగిలిన వారిని కూడా పిలిపించుకునే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. అయితే ముందుగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినందున మరోసారి వారిని పిలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...