Jump to content

kotla surya prakash reddy into TDP


sonykongara

Recommended Posts

  • Replies 80
  • Created
  • Last Reply
త్వరలో టీడీపీలో చేరుతాం: కోట్ల తనయుడు
15-02-2019 10:53:57
 
636858250619941206.jpg
కర్నూలు : తమ కుటుంబం త్వరలో టీడీపీలో చేరబోతోందని కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమ్మ కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని వెల్లడించారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. కోట్ల హర్ష వర్దన్‌రెడ్డికి తమకు వ్యక్తిగత విబేధాలు లేవని, రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు.
 

Advertisement

Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:
త్వరలో టీడీపీలో చేరుతాం: కోట్ల తనయుడు
15-02-2019 10:53:57
 
636858250619941206.jpg
కర్నూలు : తమ కుటుంబం త్వరలో టీడీపీలో చేరబోతోందని కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమ్మ కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని వెల్లడించారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. కోట్ల హర్ష వర్దన్‌రెడ్డికి తమకు వ్యక్తిగత విబేధాలు లేవని, రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు.
 

Advertisement

:terrific:

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
త్వరలో టీడీపీలో చేరుతాం: కోట్ల తనయుడు
15-02-2019 10:53:57
 
636858250619941206.jpg
కర్నూలు : తమ కుటుంబం త్వరలో టీడీపీలో చేరబోతోందని కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, అమ్మ కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారని వెల్లడించారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. కోట్ల హర్ష వర్దన్‌రెడ్డికి తమకు వ్యక్తిగత విబేధాలు లేవని, రాజకీయ విబేధాలు మాత్రమే ఉన్నాయని కోట్ల రాఘవేంద్రారెడ్డి తెలిపారు.
 

Advertisement

:terrific:

Link to comment
Share on other sites

తెదేపాకి కోట్ల.. విపక్షాలకు?

కోట్ల కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల వ్యూహాలు

15knl87.jpgఇంటర్నెట్‌డెస్క్‌: కర్నూలు జిల్లా రాజకీయం రోజురోజూకు వేడెక్కుతోంది. కోట్ల కుటుంబ తెదేపాలో చేరేందుకు సిద్ధమవ్వడంతో ఒక్కసారిగా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెదేపా తరపున కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖరారైంది. కందనవోలుపై పూర్తి ఆధిపత్యం కలిగిన కోట్ల కుటుంబం ఇక్కడి నుంచి తొమ్మిది సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ డిపాజిట్లు దక్కకపోయినా సూర్య ప్రకాశ్‌రెడ్డి 1.16లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలవడం.. కోట్ల కుటుంబంపై ఇక్కడి ప్రజలకు ఉన్న మమకారానికి నిదర్శనం. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పేరు ఉండడంతోపాటు వారికంటూ సొంతవర్గం ఉంది. కోట్ల కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పార్టీలోకి వెళ్లినా వర్గమంతా ఆ కుటుంబం వెన్నంటి ఉంటారు. తెదేపా నుంచి ఆయన విజయం నల్లేరుపై నడకేనని అధికార పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది.

మరోపక్క కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని ఎదుర్కొనే దీటైన వ్యక్తి కోసం వైకాపా అన్వేషిస్తోంది. కర్నూలు ఎంపీ టికెట్‌ బీసీ అభ్యర్థికి ఇస్తామని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. బీసీల్లో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జనలు నడుస్తున్నాయి. వాల్మీకి ఓట్లు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో ఇదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. వైకాపా నుంచి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బీవై రామయ్య టికెట్‌ ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వైకాపాలో చేరారు.

గత ఎన్నికల్లో వైకాపా నుంచి విజయం సాధించిన బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త అయినా.. కింది స్థాయి కార్యకర్తలు సమష్టిగా పనిచేసి ఆమె విజయానికి కారకులయ్యారు. ఈసారి అదే ఓటు బ్యాంకు తమను గెలిపిస్తుందని వైకాపా ధీమాగా ఉంది. జిల్లాలో రెండు వర్గాలు ఉన్నచోట్ల కేఈ కుటుంబాలు కలిసి పనిచేస్తే తెదేపా బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కర్నూలు సీటుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టిన జగన్‌ కోట్లను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. కర్నూలులోని ఆయుష్మాన్‌ ఆసుపత్రి అధినేత సంజీవ్‌కుమార్‌ వైకాపా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటు అభ్యర్థిని త్వరగా తేల్చేస్తే క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు సమయం దొరుకుతుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Link to comment
Share on other sites

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతాం: కోట్ల కుటుంబం
20-02-2019 15:06:34
 
636862719958046138.jpg
కర్నూలు: ఈ నెలాఖరులో తాము టీడీపీలో చేరనున్నట్లు కోట్ల కుటుంబం ప్రకటించింది. కోడుమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతామని కోట్ల తనయుడు రాఘవేంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నాన్న సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీచేస్తారు. మా అమ్మ సుజాతమ్మ డోన్ లేదా ఆలూరు నుంచి పోటీ చేస్తారు’’ అని అన్నారు. త్వరలో ఎల్లెల్సీ కాలువ పైప్‌లైన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుండ్రేవుల పనులకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారని రాఘవేంద్రా రెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

తెదేపాలో కోట్ల చేరికకు ముహూర్తం ఖరారు

02002brkk134a.jpg

కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తెదేపాలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెలం 28న కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్వహించనున్న తెదేపా భారీ బహిరంగ సభలో కుటుంబ సమేతంగా ఆయన పార్టీలో చేరనున్నారు. కోడుమూరు సభలో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు లక్ష మందిని ఈ సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

తనకు కర్నూలు లోక్‌సభ స్థానంతో పాటు తన సతీమణి కోట్ల సుజాతమ్మకు డోన్‌ లేదా ఆలూరు నియోజకవర్గాల్లో ఒకదాన్ని కేటాయించాలని సూర్యప్రకాశ్‌రెడ్డి కోరుతున్నారు. ప్రధానంగా డోన్‌పైనే ఆయన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు తెదేపా అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఉపముఖ్యమంత్రి కేఈ కుటుంబం కూడా డోన్‌ను కోరుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటు కర్నూలు జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకి పైపులైన్‌ వేయాలనే డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి కోట్ల తీసుకెళ్లారు. ఇప్పటికే వేదవతికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఎల్‌ఎల్‌సీ పైపు లైన్‌, గుండ్రేవుల ప్రాజెక్టుల శంకుస్థాపనకు సీఎం హామీ ఇచ్చినట్లు కోట్ల అనుచరులు చెబుతున్నారు. తెదేపాలో చేరికపై కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన అనుచరులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.

Link to comment
Share on other sites

కేఈ కుటుంబంతో కలిసి పనిచేస్తాం: కోట్ల

02102brkk-152a.jpg

కర్నూలు: ఈనెల 28వ తేదీన తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాల్వ పైపు లైను నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల కల నెరవేరినందుకు కర్నూలు జిల్లా రైతుల తరఫున సీఎంకు కోట్ల కృతజ్ఞతలు తెలిపారు. కోడుమూరులో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని.. అక్కడి నుంచే మూడు సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని కోట్ల వివరించారు.

గతంలోనూ కేఈ కుటుంబంతో కలిసి పనిచేశామని.. ఇప్పుడు కూడా వారితో తమకు ఏ ఇబ్బందీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీట్ల విషయంపై ఇంత వరకు సీఎంతో మాట్లాడలేదని.. ఒకే కుటుంబం నుంచి మూడు సీట్లు కోరడం భావ్యం కాదన్నారు. తాను కర్నూలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని కోట్ల స్పష్టం చేశారు. రేపు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు రైతులు బ్రహ్మరథం పడతారని సూర్యప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 
Link to comment
Share on other sites

కోట్లా వెంటే మేము.. టీడీపీలో చేరుతాం.."
24-02-2019 11:58:17
 
636866062965139626.jpg
  • కాంగ్రెస్‌ పార్టీకి మంత్రాలయం
  • ఎమ్మిగనూరు నాయకుల రాజీనామాలు 
 
ఎమ్మిగనూరు/కర్నూలు : జిల్లాలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. పార్టీలు మారడం సర్వసాధారణమైనా అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌ అంటేనే కోట్ల.. కోట్ల అంటేనే కాంగ్రెస్‌లా బంధం ఉండేది. కోట్ల కాంగ్రెస్‌ పార్టీని వీడుతుండడంతో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు కూడా రాజీనామాలు చేస్తూ కోట్ల సూర్యప్రకా‌ష్‌రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. శనివారం ఎమ్మిగనూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మిగనూరు, మంత్రాలయానికి చెందిన మండల బాధ్యులు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు చేశారు.
 
 
వీరిలో పీసీసీ సభ్యుడు, మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి బూదూరు లక్ష్మీకాంత్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కె. పార్థసారధిరెడ్డి, డీసీసీ కార్యదర్శి సుధాకర్‌శెట్టి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌, పట్టణ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ఆదెన్న, ఎమ్మిగనూరు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నారాయణ కోటేకల్లు సింగిల్‌ విండో మాజీ ప్రెసిడెంట్‌ నాగిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అయ్యలప్ప పార్టీకి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి పంపారు.
 
 
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా
నందవరం మండల పరిధిలోని సింగిల్‌విండో డైరెక్టర్‌ రమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, సింగిల్‌విండో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి, డైరెక్టర్‌ పదవికి రాజీనామా పత్రాన్ని జిల్లా సహకార కేంద్రానికి పంపినట్లు తెలిపారు. కోట్ల ఎక్కడ ఉంటే అక్కడే తాను ఉంటానన్నారు.
 
Tags : telugudesam, kurnool
Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబును కలిసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
25-02-2019 22:36:50
 
636867311807172812.jpg
కర్నూలు: అమరావతిలో సీఎం చంద్రబాబును కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కలిశారు. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినందుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సీట్ల కేటాయింపుపైనా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో చంద్రబాబు చర్చించారు. అనంతరం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 2న కోడుమూరు పర్యటనకు రావాలని చంద్రబాబును ఆహ్వానించినట్లు తెలిపారు.
Link to comment
Share on other sites

కాంగ్రెస్‌ను వీడటం బాధే

 

మార్చి 2న సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలోకి
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వెల్లడి

27ap-politics3a.jpg

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు విజయరాఘవరెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, తదితరులు కూడా రాజీనామా చేసినట్లు బుధవారం సాయంత్రం కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో కోట్ల వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందేలా ఏఐసీసీకి ఆన్‌లైన్‌లో రాజీనామా అందజేస్తామన్నారు. ఎన్నో ఏళ్ల అనుబంధం కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తుంటే బాధగా ఉందని చెప్పారు. రైతుల సమస్యలు తీరుతాయన్న ఉద్దేశంతోనే తెదేపాలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మార్చి 2న కోడుమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తెదేపా పుంజుకుంటుందని, రానున్న ఎన్నికల్లో ఊహించని ఫలితాలొస్తాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో వైకాపాకు గతంలో 11 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో ఇది తారుమారు అవుతుందని జోస్యం చెప్పారు. తనతో పాటు రాష్ట్రంలో సీనియర్‌ నేతలు కిషోర్‌ చంద్రదేవ్‌, కొణతాల రామకృష్ణ, పనబాక లక్ష్మి వంటి వారు తెదేపాలోకి వస్తున్నారని వివరించారు. చంద్రబాబుకు తప్పుడు జీవోలు విడుదల చేసే ఖర్మ పట్టలేదని, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో తుంగభద్ర బోర్డు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడి గుండ్రేవుల, ఎల్లెల్సీ పనులు మొదలు పెడతామని స్పష్టంగా ఉందని వివరించారు. రైతుల సమస్యలపై చెప్పగానే వేదవతి, ఆర్డీఎస్‌, ఎల్‌ఎల్సీ కాల్వ, గుండ్రేవులకు  రూ.8,500 కోట్లను చంద్రబాబు కేటాయించడం చరిత్రలో మిగిలిపోయే విషయమని తెలిపారు. ఇవి పూర్తయితే కర్నూలు పార్లమెంటు పరిధిలో  6 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయన్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...