Jump to content

#మళ్ళీనువ్వేరావాలి


Saichandra

Recommended Posts

  • Replies 118
  • Created
  • Last Reply

చంద్రబాబు ఇష్టం లేని ఓ పెద్ద మనిషి తాను ఇప్పుడు ఎందుకు సపోర్టు చేస్తున్నాడో వివరిస్తూ రాసిన ఓ పోస్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అయింది. చదవండి ఇదే అది “చంద్రబాబు నాయుడు అంటే నాకు అంత ఇష్టం లేదు. కారణం కూడా ఎందుకు అంటే నేను చెప్పలేను. నేను స్వతహాగా గాంధేయవాదిని. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాడిని. కానీ ఈ రాష్ట్రంలో ఈనాటి ప్రస్తుత పరిస్థితులలో ఆయన తప్ప వేరే గత్యంతరం లేదు.BJP తమ కుయుక్తులతో వేరే వారిని సీన్ లో కి తెచ్చే ప్రయత్నం చేస్తే , 2009 లో మాదిరే మరల చరిత్ర పునరావృతం అవుతుంది . ఒకవేళ పొరబాటున ఏ జగనో వచ్చాడనుకోండి. మంగలి కృష్ణ , మద్దెలచెరువు సూరి, భానుకిరణ్ , jail లోనే హత్య చేయబడ్డ మొద్దు శీను , 250 పైగా హత్య చేయబడ్డ ఇతర పార్టీ కార్యకర్తల కథనం , రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు, officers ను భయభ్రాంతులు చేసి black mail చేసి పనులు చేయించుకొని మరల వారు జైలు కెళ్ళిన ఉదంతం మొదలైన incidents అన్నీ కళ్ళలో మెదుల్తున్నాయి . అంటే జగన్ బయట ఉండే అన్ని జరిగాయంటే….. పొరబాటున అధికారంలోకి వచ్చేస్తే సగటు మనుషుల ధన మాన ప్రాణాలకు కూడ గ్యారంటీ ఉండదనిపిస్తుంది . ఇక జనసేన PK అంటారా ఏం చేస్తాడో తెలియదు , ఏం మాట్లాడతాడో తెలియదు,కాని ముద్రగడ ఆడిన నాటకం వలన తన caste వాళ్ళ ఓట్లు తప్ప ఏ ఇతర కులాల వాళ్ళ ఓట్లు పడవు . అన్ని కులాల వాళ్ళని కలుపుకోని వెళ్ళే వాళ్ళకే ఓట్లు పడతాయి . అందుకే….. బాబు . అయినా…1.నేను బాబు పర్ఫెక్ట్ అని భావిస్తున్నానా? –లేదు , 2.బాబులో లోపాలు లేవు అనుకుంటున్నానా ? –లేదు , 3.బాబు తప్పులు చేయడు అనుకుంటున్నానా? — లేదు , 4.బాబు ప్రభుత్వంలో లోపాలులేవు అంటున్నానా?–లేదు , 5.బాబు ఆంధ్రని సింగపూర్ చేయగలడు అని భావిస్తున్నానా ?–లేదు , 6.బాబు అవినీతిని పోగొట్ట గలడు అని అనుకుంటున్నానా? — లేదు , 7.బాబు స్వర్గం సృష్టిస్తాడు అని నమ్ముతున్నానా?–లేదు , మరి బాబు ని ఎందుకు సమర్థిస్తూన్నాను? ఎందుకంటే….

1.బాబు పట్టుదల కలిగిన మనిషి ,

2.బాబు విజన్ ఉన్న నాయకుడు ,

3.రేపటికి ఏమి కావాలో తెలిసిన వ్యక్తీ

4.సంపద సృష్టి ద్వారానే సంపద పంపకం జరుగుతది అని తెలిసిన వ్యక్తీ

5.ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకొని రాష్ట్రం ని ప్రగతిపధం లో నడిపిన వ్యక్తి ,

6.సైబరాబాద్ ఆనే నగరం కి రూప శిల్పి ,

7.40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పాలన అనుభవం ఉన్న వ్యక్తీ ,

8.ప్రజలకు రాష్ట్రానికి ఏమి కావాలో తెలిసిన వ్యక్తీ ,

9.ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కేవలం , కేవలం ఆయన మాత్రమె చేయగలడు కనుక ,

10.అన్నిటికి మించి ప్రజలంటే భయం ఉన్న వ్యక్తీ .

11.రాజ్యాంగ వ్యవస్థలు నిలబడాలి అని కోరుకునే వ్యక్తీ ,

ఇక తప్పులు అంటారా… తప్పులు చేయనిది ఎవరు అందరం చేస్తూనే ఉంటాం . ఆయనా మనిషే . ఆయన నిర్ణయాలలో తప్పులు జరుగుతాయి.కానీ జరిగిన తప్పుని సరిదిద్ఢుకునే తత్త్వం ఆయనకి ఉంది. పాలనలో టెక్నాలజీని ప్రవేశ పెట్టి అవినీతిని తగ్గించే ప్రయత్నం కొంత ఫలించ వచ్చు , ఇంకా చేయాల్సినది చాలా ఉండి ఉండవచ్చు .ఆయన ఈ నాలుగేళ్లలో ఈ పసిగుడ్డు రాష్ట్రంని ఎంత అభివృద్ధి పధం లో పెట్టాడో మనం చూశాము . అప్పులతో మొదలయిన ఈ రాష్ట్రంని పట్టాలు ఎక్కించాడు . కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్రం , ప్రజలు అని పరితపించడం అందరం చూశాము . ఆరోగ్యంని కూడా లెక్క చేయకుండా రాష్ట్రం కోసం , పరిశ్రమల స్థాపన కోసం… ఎక్కే మెట్టు , దిగే మెట్టు.. అయినా అలసట కనిపించనివని వ్యక్తీ. కనీసం law and order ఐనా సవ్యంగా ఉంటుంది . ఆయన పట్టుదలకు పట్టి సీమే ఉదాహరణ . దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయవేత్తల లో ఒకడు . అనుకున్నది సాధించే వరకు పట్టువదలని వ్యక్తి . కేంద్రం సహకారం లేకున్నా kia motors , Hero motors వస్తున్నాయి .Ex RBI Governor సహాయంతో ISB కి తీసి పోని educational institute శ్రీ సిటీకి రాబోతుంది. మరి దొంగలు, ముఠాకోర్లు, దగాకోర్లు, హత్యాకార్లు పొరబాటున నాయకులైతే పైన తెలిపినటువంటివి రావు . సరి కదా “లాలూ బీహార్” లా అయిపోయి బంగాళా ఖాతంలో కలవడం ఖాయం . అందుకే మనందరికి చంద్రబాబు నచ్చినా నచ్చక పోయినా ఈసారి రాష్ట్ర , మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆయన నాయకత్వం అవసరం .

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...