Jump to content

EVM hacking


sonykongara

Recommended Posts

ఈవీఎం దుమారం.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌
22-01-2019 02:43:38
 
636837218191039912.jpg
భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు నమ్మదగినవేనా? అవి ట్యాంపరింగ్‌కు, రిగ్గింగ్‌కు అతీతమేనా? లేక అతి తక్కువ పౌనఃపున్యం కలిగిన తరంగాల ద్వారా ఈవీఎంలలో ఓటింగ్‌ తీరును తలకిందులు చేయవచ్చా? సైబర్‌ నిపుణుడిగా చెప్పుకొంటున్న సయ్యద్‌ సుజా అనే వ్యక్తి సోమవారం లండన్‌లో వెల్లడించిన విషయాలు సరికొత్త సంచలన సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
  • సూత్రధారి బీజేపీ.. పాత్రధారి అనిల్‌ అంబానీ సంస్థ
  • సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ సుజా సంచలన వెల్లడి
  • ఈవీఎంలకు హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో రూపకల్పన
  • రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ కేంద్రాల నుంచి హ్యాకింగ్‌
  • అది తెలిసినందుకే మహారాష్ట్ర నేత ముండే హత్య
  • ఎన్‌ఐఏ అధికారి తంజీల్‌ను కూడా అందుకే చంపారు
  • కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య వెనుకా ఈ కోణం
  • 2014 హైదరాబాద్‌ మతఘర్షణల వెనుక ఉన్నదీ ఇదే!
  • నన్నూ చంపేస్తారన్న భయంతో అమెరికాకు వచ్చా
  • మహారాష్ట్ర, యూపీ, గుజరాత్‌ల్లోనూ రిగ్గింగ్‌
  • మిలటరీ గ్రేడ్‌ సంకేతాలు పంపడం ద్వారా ట్యాంపరింగ్‌
  • అప్పటి సీఈసీ సంపత్‌కూ ఈ విషయం తెలుసు
  • లండన్‌లో వెల్లడించిన సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ సుజా
  • అమెరికా ప్రభుత్వానికి తాను సాక్ష్యాలిచ్చినట్టు వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): సైబర్‌ హ్యాకింగ్‌తో నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారా?.... ఈవీఎంల హ్యాకింగ్‌ ఆయనకు దుర్నిరీక్ష్య విజయం సాధించిపెట్టిందా? అవునని చెబుతూ లండన్‌లో సోమవారం నాడు జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న తరుణాన పెను సంచలనం రేపే ఈ విషయాన్ని సయ్యద్‌ సుజా అనే సైబర్‌ నిపుణుడు బయటపెట్టాడు. భారత్‌లో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీస్థాయిలో ఎలకా్ట్రనిక్‌ ట్యాంపరింగ్‌ జరిగిందని, ఈవీఎంలన్నింటినీ తక్కువ పౌనఃపున్యం ఉన్న సిగ్నల్స్‌ ద్వారా హ్యాక్‌ చేశారని ఆయన లండన్‌లో ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు.
 
‘‘లో ఫ్రీక్వెన్సీ మిలటరీ గ్రేడ్‌ సిగ్నల్స్‌ను అనిల్‌ అంబానీ సంస్థ అయిన రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌ కామ్‌) అందజేసింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఈవీఎంలను సులువుగా హ్యాకింగ్‌ చేయడానికి వీలుగా రూపకల్పన చేశారు. ఇందులో లబ్ధిదారు బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం వెనుక జరిగినదిదే. ఇది ముమ్మాటికీ నిజం’’ అని సుజా పేర్కొన్నారు. ఈవీఎంలను నిషేధించి పాత పద్ధతిలో బ్యాలెట్‌ల రూపంలో ఎన్నికలు జరపాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్న సమయంలో సుజా వెల్లడించిన అంశాలు రాజకీయంగా దుమారాన్ని రేపడమే కాక- 2014 తరువాత జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు కలిగిస్తున్నాయి.
 
‘‘ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చన్న విషయం బీజేపీకి బాగా తెలుసు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నందువల్లే 2014లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ టాంపరింగ్‌ వల్ల కాంగ్రెస్‌ 201 సీట్లు కోల్పోయింది. హ్యాకింగ్‌ను నడిపించిన రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌కు దేశవ్యాప్తంగా 9 చోట్ల కేంద్రాలున్నాయి. తక్కువ స్థాయి మిలటరీ గ్రేడ్‌ సిగ్నల్స్‌ పంపడం ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే పని అక్కడి ఉద్యోగులకూ తెలుసు’’అని సుజా పేర్కొన్నారు. ఆనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంపత్‌కు కూడా ఈవీఎంల టాంపరింగ్‌ గురించి తెలుసునన్నారు. ‘సంపత్‌ ఆధ్వర్యంలోనే ఈవీఎంల ప్రాసెసింగ్‌ జరిగింది. ముండేకు, ఆయనకు అన్ని విషయాలూ తెలుసు’’ అని పేర్కొన్నారు.
 
‘‘2014 సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు, 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ మేం ఆ సిగ్నల్స్‌ను అడ్డుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించగలిగింది. 2014 మహారాష్ట్ర, 2017లో ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను సైతం బీజేపీ రిగ్గింగు చేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ల్లో జరిగిన ఎన్నికల్లో సైతం ఎలకా్ట్రనిక్‌ రిగ్గింగ్‌కు, ఈవీఎంల హ్యాకింగ్‌కు బీజేపీ ప్రయత్నించింది. అయితే మేం వారి సిగ్నల్స్‌ను మధ్యలోనే అడ్డుకోగలిగాం’’ అని సుజా చెప్పుకొచ్చారు. ‘‘ఈ హ్యాకింగ్‌ విషయం బీజేపీ నాయకుడు గోపీనాథ్‌ ముండేకు తెలుసు. ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకొన్న 15 రోజులకే హత్యచేశారు.
 
రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు చూపినప్పటికీ అది నిజానికి హత్య. దానిపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి తంజీల్‌ అహ్మద్‌ -ముండే మరణం హత్యేనని తేల్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి సిద్ధమవుతున్న దశలో ఆయననూ హత్యచేశారు. బెంగళూరులో రచయిత్రి, సామాజిక కార్యకర్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌కు ఈ విషయం చెప్పాం. ఆమె ద్వారా ఈ హ్యాకింగ్‌ వ్యవహారాన్ని భారత్‌లోనే బయటపెట్టాలనుకున్నాం. ఆమె కూడా మా కథనాన్ని ప్రచురించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆమెను కూడా చంపేశారు. టీవీ చర్చల్లో పెద్దగా అరుస్తూ పాల్గొనే ఓ జర్నలిస్టుకు ఈ విషయం చెప్పాం. ఆయన పట్టించుకోలేదు. మా టీమ్‌ సభ్యులందరిపైనా దాడులు జరిగాయి.
 
2014లో హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో జరిగిన మత ఘర్షణల వెనుక కూడా ఈ కోణం ఉంది. మమ్మల్ని టార్గెట్‌ చేసే క్రమంలో ఆ మతకల్లోలాల సృష్టి జరిగింది. మొత్తం మీద-మమ్మల్ని చంపేస్తారన్న విషయం అర్థమయింది. విషయం తెలిసున్న ఒకరొకరుగా హత్యకు గురవుతుండడంతో నేను ప్రాణ భయంతో దేశం విడిచి అమెరికాకు పారిపోయాను. అమెరికాలో ఆశ్రయం పొందుతున్నా’’ అని సుజా వివరించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ కూడా పాల్గొన్నారు. ఆయన వస్తారన్న విషయమే మొదట మీడియాకు చేరింది. తర్వాత ఈవీఎంల వ్యవహారాన్ని తెలియపర్చారు.
 
అమెరికా ప్రభుత్వానికి సాక్ష్యాలిచ్చా
న్యూయార్క్‌లో తనను హత్య చేసేందుకు కొందరు ఆఫ్రికన్‌ అమెరికన్లను రంగంలోకి దింపారని, తాను బయటపడ్డానని సయ్యద్‌ సుజా చెప్పుకొచ్చాడు. భారత్‌లో ఆనాడు ట్యాంపరింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలు, డాక్యుమెంట్లను అమెరికా ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశానని తెలిపాడు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మధ్య వ్యత్యాసాలు బయటపడకుండా బీజేపీ కుట్ర పన్నిందన్న సుజా.. వీవీప్యాట్లలో ఓట్ల లెక్కింపుకు బీజేపీ నిరాకరించడం వెనుక కారణం ఇదేనన్నారు.
 
 
చాలా పార్టీలు సంప్రదించాయి
ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో తెలుసుకునేందుకు తనను బీజేపీ మాత్రమే కాక- ఇతర పార్టీలు కూడా సంప్రదించినట్లు సుజా తెలిపారు. ‘‘ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఇందులో ఉంది. అయితే వారి లక్ష్యం ఈవీఎంల సాయంతో గెలవడం కాదు, ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తున్న విషయాన్ని ప్రపంచానికి తెలియపర్చడమే’’ అని ఆయన వివరించారు. ఎస్పీ, బీఎస్పీ కూడా తనను సంప్రదించాయన్నారు.
 
 
ఎలా చేశారు?
‘‘2009-2014 మధ్య కాలంలో నేను ఈసీఐఎల్‌, ఈసీ కోసం పనిచేశాను. మా బృందంలో మొత్తం 14 మంది సభ్యులున్నారు. ‘‘ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా?’’ అన్నది పరిశీలించి సాంకేతిక వివరాలు ఇవ్వాలని మమ్మల్ని కోరారు. చేయవచ్చని మేం చేసి చూపాం. 2014 ఎన్నికలను రిగ్గింగ్‌ చేసే లక్ష్యంలోనే ఎన్నో లక్షల కంప్యూటర్లను, కనెక్టర్లను ఉత్పత్తి చేశారు. 2014 ఏప్రిల్‌ 30న హైదరాబాద్‌లో ఓటింగ్‌ జరిగినపుడు ఈవీఎంల నుంచి తక్కువ పౌనః పున్యం ఉన్న ఫ్రీక్వెన్సీ వెలువడుతున్నట్లు గమనించాం. ఓ మాడ్యులేటర్‌ సాయంతో బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తున్నట్లు గ్రహించాం. ఇది తెలిసిన వెంటనే నేను, నా బృంద సభ్యులు ఈ ప్రాజెక్టునుంచి తప్పుకున్నాం. 2014 మే 14న ట్యాంపరింగ్‌ వివరాలు తెలుసుకుందామని నేను, నా బృందసభ్యులు హైదరాబాద్‌ శివార్లలోని ఓ బీజేపీ నాయకుడి దగ్గరకు వెళ్లాం...
 
కానీ ఆయన తన గన్‌మ్యాన్‌తో మాపై కాల్పులు జరిపించాడు. నేను గాయపడి, తప్పించుకున్నాను. కానీ నా టీమ్‌ సభ్యుల్లో కొందరు మరణించారు. ఈఘటనను కప్పిపుచ్చేందుకే ఆనాడు కిషన్‌ బాగ్‌లో మతఘర్షణలు జరిగినట్లు చిత్రీకరించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు, 17 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో నా టీమ్‌ సభ్యులున్నారనే ఆనాడు కర్ఫ్యూ విధించారు. దాడి తర్వాత నేను నా మిత్రుల సాయంతో ఢిల్లీకి చేరి-అక్కడి నుంచి అమెరికా చేరుకున్నాను’’ అని సుజా వివరించారు. ‘‘మా బృందంలో అజాస్‌, వంశీ, కేశవ్‌, ప్రకాశ్‌, హంజాస్‌ మొదలైన వారుండేవారు. ట్యాంపరింగ్‌ వివరాలను మేమెక్కడ బయటపెడతామేమోనని బీజేపీ నేతలు మా బృంద సభ్యులను టార్గెట్‌ చేశారు. ప్రస్తుతం 14 మంది సభ్యుల్లో ముగ్గురం మాత్రమే బతికున్నాం.. మిగిలిన వారిని బీజేపీ నేతలే హత్యచేయించారు’’ అని ఆయన ఆరోపించారు.
 
 
2014 జూన్‌ 3
మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్‌ ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
సుజా ఆరోపణ: ఈవీఎంల రిగ్గింగ్‌ తెలిసినందుకే ముండేను చంపేశారు.
 
 
2016 ఏప్రిల్‌ 2
ఎన్‌ఐఏలో కీలక అధికారి తంజీల్‌ అహ్మద్‌ ఆగంతుకుల కాల్పుల్లో చనిపోయారు. ఆయన శరీరంలో 22 బుల్లెట్లు దిగాయి.
సుజా ఆరోపణ: ముండే హత్య రహస్యాలను ఛేదించినందుకే తంజీల్‌ను చంపారు.
 
 
2017 సెప్టెంబరు 5
కన్నడ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో చనిపోయారు.
సుజా ఆరోపణ: ఈవీఎంల కేసును తవ్వుతున్నందుకే ఆమెను చంపేశారు.
 
 
ప్రెస్‌మీట్‌లో సస్పెన్స్‌!
నిజంగా సయ్యద్‌ సుజా ప్రెస్‌మీట్‌ ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో ఆయన స్వయంగా ప్రదర్శించి చూపుతారని మీడియాకు తొలుత సమాచారం అందింది. ఈ ప్రెస్‌మీట్‌కు ఈసీతోపాటు ప్రధాన భారత రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించారు. భారతీయ జర్నలిస్టుల సంఘం(ఐరోపా చాప్టర్‌) ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. సుజా ఎప్పుడొస్తారా..అని మీడియా ఎదురుచూస్తున్న సమయంలో ఆయన ప్రతినిధులు- ఆయనను వీడియో కాల్‌ ద్వారా కలిపారు. స్కైప్‌ ద్వారా ఆయన పాల్గొంటున్నారని, ప్రత్యక్షంగా మీడియా ముందుకు రావడం లేదని అనౌన్స్‌ చేశారు. కాలిఫోర్నియాలో ఓ గుర్తుతెలియని ప్రదేశం నుంచి సుజా మాట్లాడారు. ఓ పొడవైన సోఫా మీద ఆయన కూర్చొని ఉన్న ఆయన పరిసరాలు ఏవీ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ‘‘నాలుగురోజుల కిందటే న్యూయార్క్‌లో నాపై దాడి జరిగింది. దీని వల్ల నేను డిమాన్‌స్ట్రేషన్‌ చెయ్యలేకపోతున్నాను. వీడియో ద్వారానే పాల్గొంటున్నాను’’ అని వివరించారు. తప్పితే- ఆయన ఆ వీడియో కాల్‌లో ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో ప్రదర్శించలేదు.
Link to comment
Share on other sites

18 hours ago, katti said:

bro... we get a time of a minute or two before EVM for casting the vote. can we update software in that time?

Software would have updated which can be made to work in certain way at scheduled time slots . Or it can be made to work in a certain way from the 1st minute of polling itself. These are all easy things to do in Information Technology world

Link to comment
Share on other sites

"The records of this company have been verified and it is found that Syed Shuja has neither been on the rolls of ECIL as a regular employee nor was he in any way associated in the design and development of EVMs in ECIL produced between 2009 to 2014," read a statement from ECIL.  

Shuja had mentioned a few names claiming to be his team. The names were Prakash, Keshav, Vamshi, Amjas. And none of these people or engineers with such names were employed with the team, the company further said.

??

 

Link to comment
Share on other sites

1 hour ago, Hello26 said:

Software would have updated which can be made to work in certain way at scheduled time slots . Or it can be made to work in a certain way from the 1st minute of polling itself. These are all easy things to do in Information Technology world

hmmm... do you really think this is practically possible with EVMs...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...