Jump to content

Lokesh Davos Tour


sonykongara

Recommended Posts

అదానీ గ్రూప్ ఎండీ అనిల్ సార్దానాతో లోకేశ్ సమావేశం
22-01-2019 17:54:57
 
636837765554276603.jpg
దావోస్‌: ఏపీలో డేటా సెంటర్ పార్క్ ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలాఖరులో డేటా సెంటర్ పార్క్‌కు భూమి పూజ చేస్తామన్నారు. అదానీ గ్రూప్ ఎండీ అనిల్ సార్దానాతో మంత్రి లోకేష్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పనులు వేగంగా పూర్తి చేసేందుకు సహకరిస్తామన్నారు. అమరావతిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనెక్టెడ్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకి అదానీ గ్రూప్ సహకారం అందిస్తుందన్నారు.
Link to comment
Share on other sites

విప్రో ప్రతినిధి రిషద్ ప్రేమ్‌జీతో లోకేష్ సమావేశం
22-01-2019 18:10:02
 
636837774034639025.jpg
దావోస్: విప్రో ప్రతినిధి రిషద్ ప్రేమ్‌జీతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఫింటెక్, బ్లాక్ చైన్, బిగ్ డేటా వంటి సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి అన్నారు. ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి కోసం నాస్కామ్ ఆధ్వర్యంలో ప్లాట్ ఫార్మ్ ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంచేలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామని లోకేష్ అన్నారు.
 

Advertisement

 

Link to comment
Share on other sites

I & PR Andhra Pradesh @IPR_AP 7m7 minutes ago

 
 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజీ డైలాగ్ ఆన్ ఇండియా సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. పారిశ్రామిక వృద్ధి,ఆర్థిక వృద్ధి కోసం తీసుకురావాల్సిన సంస్కరణలు,యువతి కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లాంటి అంశాల పై ప్రపంచ ఆర్థిక వేదిక పై చర్చ. ఎమ్ఎస్ఎమ్ఈ

1 reply 0 retweets 0 likes
 
 
 
 
 
 
 

కంపెనీలకు స్లాబ్స్ తరహాలో ప్రత్యేక ట్యాక్స్ విధానం ఉండాలి.ఈ విధానం వలన చిన్న కంపెనీలకు లబ్ది చేకూరుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్,ఇన్నోవేషన్ కి ప్రత్యేక రాయితీలు కల్పించాలి,ట్యాక్స్ నుండి మినహాయింపులు ఉండాలని కోరిన మంత్రి నారా లోకేష్. #iprap @naralokesh

DxhtO-UUcAAXFT_.jpg
DxhtO90UwAE2YTd.jpg
DxhtO-fVsAAa16L.jpg
Link to comment
Share on other sites

I & PR Andhra Pradesh @IPR_AP 17m17 minutes ago

 
 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తాం. టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మీరు ముందున్నారు. మీ సేవలు మరింత మెరుగుపరిచేందుకు డెలాయిట్ సహకారం ఉంటుందని తెలిపిన డెలాయిట్ గ్లోబల్ ఛైర్మెన్ డేవిడ్ క్రూక్ శాంక్. #iprap @naralokesh

DxhrZTLV4AAooda.jpg
DxhrZTaUcAEi0uF.jpg
DxhrZTwVAAIBXgt.jpg
DxhrZUHVsAEeHSL.jpg
Link to comment
Share on other sites

సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ,కేపీఎంజీ ఛైర్మెన్ అండ్ సీఈఓ అరుణ్ కుమార్ తో సమావేశమైన మంత్రి నారా లోకేష్,అధికారుల బృందం. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకివాల్సిన చర్యల పై చర్చ.

1 reply 0 retweets 0 likes
 
 
 
 
 
 
 

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా ,అభివృద్ధి వికేంద్రీకరణ విధానం అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మరింత పెట్టుబడులు ఏపీకి వచ్చేలా సిఐఐ,కేపిఎంజీ సహకరించాలని కోరిన మంత్రి నారాలోకేష్. #iprap @naralokesh

Dxhvkp8UwAAgf4P.jpg
DxhvkpGUwAAiCuX.jpg
DxhvkpkU0AIFLkq.jpg
DxhvkpcV4AAZa2q.jpg
Link to comment
Share on other sites

హ్యాపీగా ఏపీకి!
23-01-2019 02:26:26
 
636838071865998603.jpg
  • వేగంగా పనిచేసే సర్కారు, అధికారులున్న రాష్ట్రమది
  • దావోస్‌ వేదికగా అదానీ సీఈవో ఉద్ఘాటన
  • ఏపీకి జెన్‌ప్యాక్ట్‌.. పరిశీలనకు హామీ
  • డేటా సెంటర్‌ పెట్టాలని పలువురు సీఎంల ఫోన్లు
  • ఏపీకే ఎందుకని ప్రశ్నలు
  • త్వరలో డేటా సెంటర్‌కు భూమి పూజ జరుపుతాం
  • అమరావతి నిర్మాణానికీ సాయం అందిస్తాం: సార్దానా
  • దావోస్‌లో లోకేశ్‌తో భేటీ
  • స్విస్‌రే బీమా, డెలాయిట్‌ కంపెనీలతో మంత్రి చర్చలు
  • స్లాబ్‌ పన్నుల పద్ధతి కోసం స్వరం వినిపించిన లోకేశ్‌
 
 
శభాష్‌.. మెడ్‌టెక్‌!
‘‘అంతర్జాతీయ ప్రమాణాలతో, భారతదేశానికే గర్వకారణంగా ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ నిలవబోతోంది. దావోస్‌ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్‌ను చూస్తేనే ఆ విషయం అర్థమయిపోతుంది. ఆ రంగంలో చక్కటి ఇన్నోవేషన్‌ క్లస్టర్‌గా ఇది పేరొందడం ఖాయం’’.
-సెహ్వాగ్‌
 
 
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్‌ పెట్టాలని నిర్ణయించాక చాలా ఫోన్లు వచ్చాయి. ‘ఆ రాష్ట్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు? మా రాష్ట్రానికి రావొచ్చు కదా’ అని కొందరు ముఖ్యమంత్రులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం-అక్కడి అధికారులు పనిచేసినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని వారికి మేం స్పష్టం చేశాం’’ అని అదానీ కంపెనీ సీఈవో అనిల్‌ సార్దానా వెల్లడించారు. అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉండడం వేరు, అమలు చేయడం వేరని, అలాంటి అమలు సంకల్పం కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర మాత్రమే చూశామని దావోస్‌ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత భారీ డేటా సెంటర్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ఆదానీ కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
 
 
ఆ డేటాసెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో పాటు మరిన్ని విషయాలను దావోస్‌ పర్యటనలో ఉన్న ఐటీ శాఖమంత్రి లోకేశ్‌ బృందంతో సార్దానా పంచుకొన్నారు. రాష్ట్రంలో చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నారని, అంతే వేగంతో డేటా సెంటర్‌ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని లోకేశ్‌కు తెలిపారు. అమరావతి అభివృద్ధిలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
 
‘‘కనెక్టెడ్‌ స్మార్ట్‌ నగరాల ఏర్పాటులో అదానీ సర్వీసెస్‌ సేవలు అందిస్తోంది. విద్యుత్‌ సరఫరా, ఫైబర్‌ కనెక్టివిటీ, టెలిఫోన్‌, తాగునీటితో పాటు పార్కింగ్‌, స్ర్టీట్‌ లైలింగ్‌, ఏసీ ఇలా అనేక సర్వీసులు కలిపి ప్రజలకు అందించే వ్యవస్థ ప్రస్తుతం భారత్‌లో లేదు. ఈ సర్వీసులన్నీ కలిపి ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తాం’’ అని సార్దానా పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్‌ పార్కు ఏర్పాటును వేగవంతం చేయాలని, అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు ఈ నెలాఖరులోగా కల్పిస్తామని ఆయనకు లోకేశ్‌ తెలిపారు. జనవరి నెలాఖరుకు భూమిపూజ పనులు ప్రారంభించాలనగా, సార్దానా సానుకూలంగా స్పందించారు. అమరావతిలో డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ ఏర్పాటుచేస్తున్నామని, అన్ని సర్వీసులు కలిపి అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారని, ఈ పనిలో అదానీ సహకారం అందించాలని లోకేశ్‌ కోరారు.
 
 
‘యువనేస్తం’తో విప్రో
రాజధానిలో అవకాశాలపై డెలాయిట్‌ గ్లోబల్‌ చైర్మన్‌ డేవిడ్‌ క్రూక్‌ శాంక్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. 21 రోజుల్లోనే కంపెనీలకు కావాల్సిన అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో బిగ్‌ డేటా అనాలిసిస్‌, రియల్‌ టైం గవర్నెన్స్‌ అమల్లో డెలాయిట్‌ సహకారం కావాలని కోరారు. ఏపీ అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తామని క్రూక్‌ శాంక్‌ హామీ ఇచ్చారు. విప్రో చీఫ్‌ స్ర్టాటజీ ఆఫీసర్‌, నాస్కామ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో లోకేశ్‌ భేటీ అయ్యారు.
 
యువనేస్తంలో చేరిన యువతీ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు సహకారం అందించాలని కోరారు. మెడికల్‌ ఎలక్ర్టానిక్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను నాస్కామ్‌ ఏపీలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని మంత్రి ప్రతిపాదించగా, ఈ సెంటర్‌ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రేమ్‌జీ హామీ ఇచ్చారు. స్విస్‌ రే ఇన్సూరెన్స్‌ కంపెనీ రీజనల్‌ లీడర్‌, పబ్లిక్‌ సెక్టార్‌ సొల్యూషన్స్‌ ఈవో మెన్జింగర్‌తో లోకేశ్‌ భేటీ అయ్యారు. త్వరలో ఏపీకి తమ బృందం వస్తుందని మెన్జింగర్‌ తెలిపారు. జెన్‌ ప్యాక్ట్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో త్యాగరాజన్‌ను కలుసుకొని రాష్ట్రంలో ఐటీ రంగంలో సాధిస్తున్న విజయాలను లోకేశ్‌ వివరించారు. ఎజైల్‌ గవర్నెన్స్‌ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. కంట్రీ స్ర్ట్టాటజీ డైలాగ్‌ ఆన్‌ ఇండియా సమావేశంలోనూ లోకేశ్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడికి కట్టుబడ్డాం 

 

ఎన్ని ఫోన్లొచ్చినా  నిర్ణయం మార్చుకోలేదు 
విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుపై  అదానీ సంస్థల సీఈవో అనిల్‌ సార్దానా 
దావోస్‌లో మంత్రి లోకేశ్‌తో భేటీ 
ఇతర సంస్థల ప్రముఖులతోనూ  రాష్ట్ర బృందం చర్చలు 
ఈనాడు - అమరావతి

22AP-main3a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాక మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమను ఆహ్వానించారని, అధికారుల నుంచీ అనేక ఫోన్లు వచ్చాయని.. అదానీ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో అనిల్‌ సార్దానా అన్నారు. అయినా తమ నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పారు. 
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన... ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, అధికారుల బృందం మంగళవారం అక్కడ అదానీ సంస్థల ఎండీ, సీఈవోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సార్దానా మాట్లాడుతూ...ఏపీ ప్రభుత్వం, అధికారులు ఎంతో వేగంగా పనిచేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు లేవని ఆయా రాష్ట్రాలకు చెప్పినట్టు వివరించారు. వేగంగా విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధిలోనూ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని, కనెక్టెడ్‌ స్మార్ట్‌ సిటీల ఏర్పాటులో అదానీ గ్రూపు సేవలు అందిస్తుందని హామీ ఇచ్చారు. విద్యుత్తు సరఫరా, ఫైబర్‌ అనుసంధానం, తాగునీరు, వీధిదీపాలు వంటి అనేక సేవలు కలిపి ప్రజలకు అందించే వ్యవస్థ ఇప్పటివరకు భారత్‌లో లేదని.. అదానీ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈ విషయంలో తగిన సహకారాన్ని అందిస్తుందని అనిల్‌ చెప్పారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. దావోస్‌ వచ్చిన అదానీ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని కూడా మంత్రి లోకేశ్‌ కలిశారు.

ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ... 
  దావోస్‌లో వివిధ సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్‌ బృందం సమావేశమైంది. ఆ సందర్భంగా వారు పలు హామీలిచ్చారు. అవి.. 
* ఏపీ అభివృద్ధికి సహకారం అందిస్తామని డెలాయిట్‌ గ్లోబల్‌ ఛైర్మన్‌ డేవిడ్‌ క్రూక్‌ శాంక్‌ హామీ ఇచ్చారు. 
* విప్రో, నాస్కామ్‌ తరఫున భవిష్యత్తు నైపుణ్య అవసరాలకు వీలుగా... యువనేస్తంలో నమోదైన యువతకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలో పూర్తిస్థాయి ప్రణాళికలతో వస్తామని విప్రో చీఫ్‌ స్ట్రాటజీ అఫీసర్‌, నాస్కామ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీలు చెప్పారు. ఏపీలో మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుపై త్వరలో నిర్ణయాన్ని తీసుకుంటామని రిషద్‌ ప్రేమ్‌జీ తెలిపారు. 
* వివిధ దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినపుడు అందిస్తున్న బీమా సదుపాయాన్ని ఏపీలోనూ అమలుకు అధ్యయనం చేస్తామని ... స్విస్‌ రే ఇన్స్యూరెన్స్‌ కంపెనీ రీజనల్‌ లీడర్‌, పబ్లిక్‌ సెక్టార్‌ సొల్యూషన్స్‌ సీఈవో మెన్జింగర్‌ చెప్పారు. 
* ఏపీలో సంస్థను నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తామని జెన్‌ప్యాక్ట్‌ సీఈవో త్యాగరాజన్‌ హామీ ఇచ్చారు.

సంస్కరణలతో సుస్థిర వృద్ధి: లోకేశ్‌ 
సుస్థిర వృద్ధి, శీఘ్ర పారిశ్రామిక అభివృద్ధి సాధనకు మరిన్ని సంస్కరణల అవసరం ఉందని దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన మంత్రి లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం ‘కంట్రీ స్ట్రాటజీ డైలాగ్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన గోష్ఠిలో ఆయన మాట్లాడారు. అత్యుత్తమ సులభతర వాణిజ్య విధానాలతో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తే భారతదేశం రెండంకెల వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని మంత్రి అన్నారు. ప్రధానంగా కార్పొరేట్‌ పన్నులు తగ్గించడం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు శ్లాబ్‌ తరహాలో ప్రత్యేక పన్ను విధానాన్ని అమలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే సానుకూల ప్రభుత్వ విధానాలను అమలు చేయాలని సూచించారు.

ప్రత్యేక ఆకర్షణగా ఏపీ లాంజ్‌ 
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు, రియల్‌ టైం గవర్నెన్స్‌, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ లాంజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏపీ లాంజ్‌లో సీఐఐ డైరక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, కేపీఎంజీ ఛైర్మన్‌, సీఈవో అరుణ్‌కుమార్‌తో మంత్రి సమావేశమై మాట్లాడారు. పెట్టుబడుదారుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ముందుకు రావాలని సీఐఐ ప్రతినిధులను కోరారు.

దావోస్‌లో ‘అమరావతి’పై చర్చ 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగర ప్రణాళిక, పర్యావరణ అనుకూల నగరంగా రూపుదిద్దుకుంటున్న తీరుతెన్నులపై సదస్సులో చర్చ జరిగింది. అమరావతి అభివృద్ధి నమూనా, భూసమీకరణ, మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించిన విధానాలను చర్చించినట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఒక ప్రకటనలో వెల్లడించారు.

Link to comment
Share on other sites

Lokesh NaraVerified account @naralokesh 9m9 minutes ago

 
 

at a cost of Rs. 2500 Crores. 215 people will find direct employment through these endeavours. Mr. Jindal has also expressed interest to build a steel plant near Ramayapatnam port along with starting an Electric Cars’ factory and Apparel Park at suitable locations in the State.

0 replies 2 retweets 7 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...