Jump to content

Amit gadi chopper landing ki no permission


krish2015

Recommended Posts

Mamatha not even allowing pigg fever shah's chopper into west Bengal 

కోల్‌కతా : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టరు ల్యాండింగుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అనుమతి నిరాకరించిన ఉదంతం మాల్దా జిల్లాలో సంచలనం రేపింది. స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న బీజేపీ అధినేత అమిత్ షా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో ఈ నెల 22వతేదీన ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోల్‌కతాకు వచ్చి అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొనేందుకు మాల్దాకు హెలికాప్టరులో రావాలనుకున్నారు. ఈ మేరకు వీవీఐపీ హెలికాప్టరు మాల్దాలో ల్యాండింగు కోసం అనుమతించాలని మాల్దా జిల్లా అధికారులకు బీజేపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. తమ పీడబ్లూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నివేదిక ప్రకారం మాల్దా హెలిపాడ్ హెలికాప్టరు దిగేందుకు అనువుగా లేదని, అక్కడ ఇసుక, నిర్మాణ సామాగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాత్కాలిక హెలిపాడ్ లో కూడా నిర్మాణ పనులు చేపట్టినందున అమిత్ షా హెలికాప్టరు దిగేందుకు సురక్షితం కాదని అందుకే తాము హెలికాప్టరు ల్యాండింగుకు అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో అమిత్ షా హెలికాప్టరు మాల్దాలో ల్యాండింగుకు మమతా బెనర్జీ సర్కారు నిరాకరించింది. ఈ ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మాల్దా హెలిపాడ్ హెలికాప్టరు ల్యాండింగుకు అనువుగా ఉన్నా జిల్లా అధికారులు అనుమతి నిరాకరించడం బీజేపీతో మమతకు ఉన్న వైరుధ్యమే కారణమని తెలుస్తోంది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...