Jump to content

Rythu Raksha


sonykongara

Recommended Posts

None of the CMs generated income for AP except CBN....so he has right to do and he knows what to do better than us.

Income ela generate cheyyali ane basic idea kuda leni ysr gaadu enjoy chesi velladu CBN efforts valana.

Same kachara gaadu enjoying now CBN efforts valana on Hyd

So aa jaffa gaadiki chance ivvatam kanna he is doing now for better nation and better state.

He has capable to generate income, not like Modi, kachara, jaffa, etc....

Link to comment
Share on other sites

1 hour ago, Nbk4lyf said:

Maree copy kottinattu untadhemo kadha bros .. aa saagu ki saayam ani edho annaru ga adhi better emo

Haa సాగు సాయం is catchy n well sounded, monna edo dwacra website ki emahila అని పెట్టారు, ఎవడు chudatledantannaru, naming is also to be taken properly to reach max ppl.. 

Link to comment
Share on other sites

30 minutes ago, ask678 said:

None of the CMs generated income for AP except CBN....so he has right to do and he knows what to do better than us.

Income ela generate cheyyali ane basic idea kuda leni ysr gaadu enjoy chesi velladu CBN efforts valana.

Same kachara gaadu enjoying now CBN efforts valana on Hyd

So aa jaffa gaadiki chance ivvatam kanna he is doing now for better nation and better state.

He has capable to generate income, not like Modi, kachara, jaffa, etc....

 

Link to comment
Share on other sites

8 hours ago, ask678 said:

None of the CMs generated income for AP except CBN....so he has right to do and he knows what to do better than us.

Income ela generate cheyyali ane basic idea kuda leni ysr gaadu enjoy chesi velladu CBN efforts valana.

Same kachara gaadu enjoying now CBN efforts valana on Hyd

So aa jaffa gaadiki chance ivvatam kanna he is doing now for better nation and better state.

He has capable to generate income, not like Modi, kachara, jaffa, etc....

 

Link to comment
Share on other sites

రైతు రక్ష!
21-01-2019 02:10:24
 
636836334674711738.jpg
  • సాగుకు సాయం చేసే పథకం
  • 1.52 కోట్ల రైతు కుటుంబాలకు మేలు
  • నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ
  • కౌలు రైతులకూ లబ్ధి చేకూర్చే యోచన
  • ఉద్యోగులకు నివాసంపై ప్రత్యేక విధానం
  • ఒక విడత డీఏ విడుదలకు ఓకే!
  • పథకానికి నేడు కేబినెట్‌లో ఆమోదం
అన్నదాతకు అండగా ‘రైతు రక్ష’ పేరిట సరికొత్త పథకం అమలు చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. రెండు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలో గడిపే ఉద్యోగులు సొంత ఇల్లు సమకూర్చుకునేలా ఒక విధానాన్ని రూపొందిస్తోంది. ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ కూడా విడుదల చేయాలని భావిస్తోంది. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
 
 
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైతులతోపాటు కౌలు రైతులకూ మేలు జరిగేలా సాగుకు సహాయం అందించడమే లక్ష్యంగా తలపెట్టిన పథకంపై ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఖరీఫ్‌ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ‘రైతు రక్ష’ అని పేరుపెట్టనున్నట్లు సమాచారం! నగదు రూపంలో అందించే సహాయాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలని దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సోమవారం కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం పక్కాగా నిక్షిప్తం చేసింది. ఈ లెక్క ప్రకారం రాష్ట్రంలో సుమారు 1.30 కోట్ల మంది రైతులున్నట్లు అంచనా! ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటికీ ‘రైతు రక్ష’ ద్వారా లబ్ధి చేకూరనుంది.
 
 
కౌలు రైతులకు కార్డులు
మరోవైపు రాష్ట్రంలో ఉండే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఈ కార్డులను అందించారు. బ్యాంకులనుంచి తేలిగ్గా రుణాలు వచ్చేందుకు ఈ కార్డులు ఉపయోగపడుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీవంటి ప్రయోజనాలు సమకూరుతాయి. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు రక్ష పథకానికి కూడా ఈ కార్డులు ఉపకరిస్తాయి. నిజానికి... నవ్యాంధ్రలో సొంతంగా భూమిసాగు చేసుకునే రైతులకంటే కౌలు రైతులే ఎక్కువగా ఉన్నట్లు అంచనా! కౌలు రైతులను అధికారికంగా గుర్తించేందుకు అనేక సమస్యలున్నాయి. భూమి యజమానికి, కౌలు రైతుకూ మధ్య అధికారికమైన ఒప్పందం ఏదీ ఉండదు. అయినప్పటికీ కౌలు రైతులను గుర్తించి, వారికి కార్డులు జారీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఉద్యోగులకు ఆవాసం... ఒక డీఏ!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆవాసం కల్పించేలా ఒక విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. వీలున్నచోట్ల ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు, స్థలం కొరత ఉన్న చోట్ల అపార్ట్‌మెంట్లకు స్థలాలు ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందిస్తారు. ఇక... ఉద్యోగులకు ఒక డీఏ బకాయిని చెల్లిస్తూ ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో అమరావతి పరిధిలో పేదలకు దాదాపు 500ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేయాలన్న ఆలోచన ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న విధానంలో భాగంగా ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.
Link to comment
Share on other sites

అంతకు మించి!

 

రైతుల కోసం ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పథకం
కేంద్రం ప్రకటించే వాటికంటే కొత్తగా
  వేర్వేరు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - అమరావతి

ఆరుగాలాలు కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలను మరింతగా ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలనే విషయమై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలతోపాటు కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతోందనే అంశాన్ని నిశితంగా గమనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టే పథకం.. ఇతర రాష్ట్రాల పథకాల కంటే గొప్పగా, కొత్తగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అధికారులకు స్పష్టంచేశారు. అదే సమయంలో కేంద్రం ప్రకటించే వరాలను చూసిన తర్వాతే ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
పెట్టుబడి నిధిపై ముందుకు ఎలా?

20AP-main1a.jpg

రైతుకు సాయంపై నాలుగైదు రకాల ప్రతిపాదనలు తయారు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలను 2 కోట్ల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇచ్చినా ఏడాదికి రూ.10 వేల కోట్ల వరకు అవసరం అవుతుంది. అయితే పంపిణీలోనే సమస్యలున్నాయి.

* ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల సంఖ్య అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16 లక్షల మంది వరకు ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 60 శాతంపైనే కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. కౌలు రైతులు 90 శాతానికిపైగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీరికి పంట రుణాలు అందించడానికే ప్రభుత్వం బ్యాంకులపై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు దేశంలోనే అత్యధికంగా రూ.5 వేల కోట్ల వరకు రుణాలుగా ఇప్పించింది. ఇప్పుడు పెట్టుబడి నిధి కూడా వీరికి చెందేలా చేయాలంటే ఏం చేయాలనే విషయమై ప్రస్తుతం ఆలోచిస్తోంది.

* సాగుదారులనే పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తే.. భూమి యజమానుల సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. కౌలురైతులు, భూ యజమానులు అందరినీ కలిపి లెక్కలోకి తీసుకుంటే మొత్తం రైతుల సంఖ్య 96 లక్షలకు చేరుతుంది.

బీమా ప్రీమియం చెల్లిస్తే పోలా..
పంటల బీమా ఉచితంగా కల్పిస్తే రైతులందరికీ ప్రయోజనం కల్పించవచ్చు. దీని వల్ల రూ.1,000 కోట్ల లోపు మాత్రమే రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని అంచనా. ఆహార, తృణ ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలకు నిర్ణయించిన స్థూల ప్రీమియం రేటులో 1.50 శాతం, మిర్చి, పసుపు తదితర పంటలకైతే 5 శాతం వరకు రైతులు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. రైతు వాటాతో పనిలేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం వల్ల పంట నష్టం సమయాల్లో బీమా అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఆహార పంటల సాగుకు ఉచిత బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి ప్రకటన వెలువడ్డాకే రాష్ట్ర పరిధిలో ఏం చేయాలనే విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ అవసరమే
అధికారులు ఇతర రాష్ట్రాలతోపాటు వివిధ దేశాల్లో రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ చూసినా రుణమాఫీ, పెట్టుబడి నిధి, పంటలకు మద్దతు ధర కల్పించడం తదితర అంశాలే ప్రధానంగా ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. వాటితోపాటు మార్కెటింగ్‌, నిల్వ సౌకర్యాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటేనే దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనాలు కల్పించడం సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.

రుణమాఫీ.. రైతు రథం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.24,500 కోట్లతో రుణమాఫీ చేపట్టి.. ఇప్పటి వరకు మూడు వాయిదాల్లో రూ.15,147 కోట్ల చెల్లింపులు చేసింది. దీని ద్వారా 58.29 లక్షల ఖాతాలకు రుణ ఉపశమనం లభించింది.

* ‘రైతు రథం’ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.2.5 లక్షల రాయితీతో 12,215 పెద్ద ట్రాక్టర్లను అందించింది. ఈ ఏడాది 11,664 ట్రాక్టర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
* మద్దతు కరవైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి 9.27 లక్షల టన్నుల ఉత్పత్తులను రూ.3,556 కోట్లతో కొనుగోలు చేసింది. కరవు నివారణ, పెట్టుబడి రాయితీల రూపంలో గత నాలుగేళ్లలో 39.33 లక్షల మంది రైతులకు రూ.3,767 కోట్లు చెల్లించింది. వ్యవసాయ అనుబంధ శాఖలకు 2018-19 బడ్జెట్లో రూ.19,070 కోట్లు కేటాయించింది.

* పంటలు దెబ్బతిన్న సమయంలో పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ.12,500, పొద్దు తిరుగుడుకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు, పత్తి, వేరుశెనగ, చెరకు పంటలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. పశువులకు ఉచిత బీమా కింద రూ.50 కోట్లు కేటాయించింది. గోకులం, మినీ గోకులం పథకాలు ప్రవేశపెట్టి పశు వసతిగృహాల నిర్మాణానికి ఆర్థికసాయం చేసింది.

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...